వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ కుష్ హువా....!? మోడీ విమానం దిగగానే జగన్ ఎం చేశాడో తెలుసా....

|
Google Oneindia TeluguNews

ప్రధాని హోదాలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీకి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈనేపథ్యంలోనే రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న మోడీకి జగన్ పుష్పగుచ్చం అందించారు. అనంతరం రెండు సార్లు మోడీ ఆశీర్వాదం తీసుకునేందుకు కాళ్లు మొక్క బోయాడు. అయితే రెండు సార్లు కూడ మోడీ జగన్‌ను కాళ్లు మొక్కకుండా వారించాడు. అనంతరం పుష్పగుఛ్చాలను తీసుకుని అత్మీయ సత్కారం అందుకున్నారు.

రేణిగుంట విమానాశ్రయంలో మోడీకి ఘన స్వాగతం

రేణిగుంట విమానాశ్రయంలో మోడీకి ఘన స్వాగతం

నరేంద్రమోడీ రెండవ సారీ ప్రధాని అయిన తర్వాత తొలిసారి శ్రీలంక పర్యటనకు వెళ్లారు. తన విదేశీ పర్యటనను ముగించుకుని నేరుగా ఆంధ్ర ప్రదేశ్‌కు చేరుకున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈనేపథ్యంలోనే ఆయనకు ఏపి నూతన ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ నర్సింహన్‌‌తోపాటు పలువురు రాష్ట్ర్ర మంత్రులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలు ఘనస్వాగతం పలికారు.అనంతరం తిరుపతిలో చేపట్టిన ప్రజా ధన్యవాద సభలో ఆయన పాల్గోన్నారు. అనంతరం తిరుమలకు చేరుకున్నారు.

మోడీ ఆశీర్వాదం తీసుకునేందుకు మోడీ కాళ్లపై జగన్

మోడీ ఆశీర్వాదం తీసుకునేందుకు మోడీ కాళ్లపై జగన్

ఈనేపథ్యంలోనే ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మోడీ ఆత్మీయ స్వాగతం పలికారు.రేణిగుంటకు చేరుకున్న మోడీకి స్వాగతం పలికే సంధర్బంలో ప్రధాని కాళ్లను మొక్కి ఆయన ఆశీస్సులు తీసుకునే ప్రయత్నం చేశారు. కాని మోడీ మాత్రం మర్యాదపూర్వకంగానే అందుకు అంగీకరించలేదు. అనంతరం ఏపి ఆర్ధిక పరిస్థితిని తెలియజేసే విధంగా చిన్నపాటీ పుష్పగుఛ్చాలను మాత్రమే జగన్ అందించారు. అనంతరం కొద్దిసేపు మాట్లాడారు. కాగా మరోసారి కూడ కాళ్లపై పడే ప్రయత్నం చేశారు జగన్ ,అప్పుడు కూడ మోడీ సున్నితంగా తిరస్కరించారు. దీంతో మంత్రుల పరిచయం చేసేందుకు మోడీ వెంట జగన్ నడిచారు. ఇక గవర్నర్‌తో పాటు,మరియు ఇతర మంత్రులు కూడ చిన్నపాటీ పుష్పగుచ్చాలనే మోడీకి అందించారు

ఏపీకి సంపూర్ణ సహకారం...జగన్‌కు అభినందనలు.. : మోదీ

ఏపీకి సంపూర్ణ సహకారం...జగన్‌కు అభినందనలు.. : మోదీ

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఏపీలో బలమైన ప్రభుత్వం ఏర్పడిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఏపీ ప్రజల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏపీకి అన్ని విధాల సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పడిందని, ప్రజలందరి ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు

ఏపి అభిృద్దికి మోడీ సహకారం కోసం జగన్ ప్రయత్నాలు

ఏపి అభిృద్దికి మోడీ సహకారం కోసం జగన్ ప్రయత్నాలు

కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రం ఏర్పాటు తర్వాత ఆ రాష్ట్ర్ర ఆర్ధిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి తెలిసిందే.. దీంతో జగన్ కేంద్రంతో సత్సంభంధాలను కొనసాగిస్తున్నాడు. ఆర్ధికంగా రాష్ట్ర్రం పరిపుష్టి సాధించాలంటే కేంద్రం సహకారం అవసరమవుంది. దీంతో ప్రధానంగా ఏపికి ప్రత్యేక హోదా సాధించడంతోపాటు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు తీసుకువచ్చే ప్రధాన లక్ష్యంతో జగన్ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి మోడీతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటే తప్ప ఇవి సాధ్యమయ్యో అవకాశాలు లేవు. దీంతోనే ముఖ్యమంత్రి జగన్, ప్రధానితో పాటు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

English summary
Prime Minister Narendra Modi was welcomed by AP CM Jagan Mohan Reddy at Renigunta airport. who came to visit Tirumala .In this manner, cm jagan try to pick up his for taking his blessings for two times. but modi refused smoothly
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X