• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రేమికులను వెంటాడి, వేటాడి, కొట్టి చంపాడు: గాయాలతో ఉన్న అమ్మాయిపై అత్యాచారం:

|

ఏలూరు: ఒంటరి అమ్మాయిలు, ప్రేమికులే అతని టార్గెట్. ఒంటరిగా కనిపించినా, జంటగా కనిపించినా అతని వైఖరి మారదు. మొదట దొంగదెబ్బ కొట్టడం, ఆ తరువాత చేతికి అందిన వస్తువుతో దాడి చేయడం అతని నైజం. రక్తమోడుతున్న అమ్మాయిలపై అత్యాచారం చేసేంత శాడిజం అతనిలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోట మండలం జీలకర్రగూడెం సమీపంలోని గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద మూడురోజుల కిందట చోటు చేసుకున్న ఘటన కూడా ఇలాంటిదే. ఈ కిరాతక ఘటనలో పోలీసులురాజు పొట్లూరు రాజు అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారిస్తున్నారు.

ఈ నెల 24వ తేదీన బౌద్ధారామాల వద్ద మృతదేహమై కనిపించిన యువతి శ్రీధరణి కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొద్దీ.. దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీధరణి హత్య ఘటనలో రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ రాజు పలువురు ఒంటరిగా కనిపించిన అమ్మాయిలపై అత్యాచాలు చేసినట్లు ప్రాథమిక సమాచారం. ప్రేమికుల జంటపై దాడి చేసి, హతమార్చినట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన సరైన సాక్ష్యాధారలను పోలీసులు అన్వేషిస్తున్నారు.

హత్య చేశాడిలా..

హత్య చేశాడిలా..

భీమడోలు మండలం అర్జావారిగూడేనికి చెందిన దౌలూరి నవీన్, ఎంఎం పురం గ్రామానికి చెందిన శ్రీధరణి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈనెల 24న ఉదయం 11.30 గంటలకు వారు గుంటుపల్లి బౌద్ధారామాలను సందర్శించడానికి వెళ్లారు. భీముడి పాదాల సమీపంలోని ఏకాంత ప్రదేశంలో ఉన్న సమయంలో రాజు వారిని గమనించాడు. వెంటనే దాడి చేశాడు. కర్రతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. నవీన్ ప్రతిఘటించగా.. అతణ్ని చావబాదాడు. అనంతరం శ్రీధరణిని హత్య చేశాడు.

ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడా? లేదా? అనే విషయం పోస్ట్ మార్టమ్ నివేదిక అందిన తరువాత నిర్ధారిస్తామని పోలీసులు చెబుతున్నారు. సంఘటనాస్థలాన్ని బట్టి చూస్తే ధరిణిపై అత్యాచారం చోటు చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజు కొట్టిన దెబ్బలకు నవీన్ స్పృహ తప్పాడు. నవీన్ కూడా చనిపోయాడనుకుని రాజు అక్కడి నుంచి పారిపోయాడు.

బౌద్ధారామాలే అతని టార్గెట్..

బౌద్ధారామాలే అతని టార్గెట్..

కృష్ణాజిల్లా మైలవరం మండలం చండ్రాల గ్రామానికి చెందిన రాజు ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లికి చెందిన గంగమ్మను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తరువాత అక్కడే స్థిరపడ్డాడు. రాజుకు ఓ కుమారుడు అటవీ ప్రాంతంలోకి వెళ్లి పిట్టలు, అడవి పందులను వేటాడటం అతని వృత్తి. ప్రతి ఆదివారం జీలకర్ర గూడెంకు వెళ్లి ప్రేమికులపై నిఘా పెడుతున్నాడు. ఈ క్రమంలోనే ఈనెల 24న ఆదివారం రాజు జీలకర్ర గూడెం బౌద్ధారామాల వద్దకు వెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

ట్రాకింగ్ లో మృతురాలి సెల్ ఫోన్..

ట్రాకింగ్ లో మృతురాలి సెల్ ఫోన్..

ధరణిని హత్య చేసిన తరువాత రాజు ఆమె ఫోన్‌ తీసుకుని పారిపోయాడు. జి.కొత్తపల్లిలోని అత్తవారి ఇంటికి చేరుకున్నాడు. ధరణి ఫోన్ లో తన సిమ్‌ కార్డును వేసి వినియోగించాడు. అదే అతణ్ని పట్టించింది. మొదట్లో కనిపించకుండా పోయిన సెల్ ఫోన్.. కొన్ని గంటల తరువాత యాక్టివేట్ అయింది. అప్పటికే ధరణి ఫోన్ ను ట్రాకింగ్ లో ఉంచారు పోలీసులు. ఫోన్ వినియోగంలోకి వచ్చిన వెంటనే.. ఈ విషయం పోలీసులకు తెలిసింది. సిగ్నల్ ఆధారంగా, జీ కొత్తపల్లికి చేరుకున్న పోలీసులు రాజును అదుపులోకి తీసుకున్నారు. విచారిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులన్నీ అతనే హంతకుడని నిర్ధారించడానికి అనువుగా ఉన్నప్పటికీ.. సరైన సాక్ష్యాధారాల కోసం అన్వేషిస్తున్నామని పోలీసులు తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Prime suspect arrested by the police in a young woman brutally murder at Guntupalli Boudharamalu in West Godavari district. Raju, a man who resident of G. Kothapalli, is the prime suspect in this case. Sri Dharani, 18 Years old young women allegedly killed by the Raju, and her lover Naveen seriously injured in the attack of Raju. Police traced the Raju with the help of Cell Phone belonging of deceased Dharani. Raju ran away after attack on both Dharani and Naveen with Dharani's Cellphone. Police put the cell phone in track.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more