వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా చికిత్సకు రోజుకు లక్ష..ఆగని ప్రైవేట్ దోపిడీ..వైద్యం సామాన్యులకు అందని ద్రాక్షేనా?

|
Google Oneindia TeluguNews

ఒకపక్క కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే, మరోపక్క వ్యాపార దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు. కరోనా మహమ్మారి నియంత్రణకు,నివారణకు ఇది నిర్దిష్టమైన చికిత్స విధానం అని ఇప్పటివరకు ఏ చికిత్స నిర్ధారించబడలేదు. అయినప్పటికీ ఆసుపత్రుల ఇష్టారాజ్యం దోపిడి ఆగడం లేదు. నామమాత్రపు కరోనా చికిత్సలకు కూడా లక్షల కొద్దీ వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాలనుకున్నా,సామాన్య,మధ్యతరగతి ప్రజలకు ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం అందని ద్రాక్షగా మారుతోంది.

Recommended Video

Corona Treatment: ప్రైవేట్ ఆసుపత్రులలో లక్షలకు లక్షలు... నియంత్రణ లేకపోవడమే ! || Oneindia Telugu
ఏ ఆస్పత్రిలో అయినా ప్రస్తుతం చేస్తున్న కరోనా చికిత్స ఒకటే

ఏ ఆస్పత్రిలో అయినా ప్రస్తుతం చేస్తున్న కరోనా చికిత్స ఒకటే

సాధారణంగా కరోనా చికిత్సా విధానంలో కొద్దిపాటి కరోన లక్షణాలు ఉన్నవారికి యాంటీబయాటిక్స్, యాంటీ వైరల్ మెడిసిన్స్ ఇస్తున్నారు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి రెమిడిసివిర్ ఇంజక్షన్లు ఇచ్చి, ఊపిరితిత్తుల్లో తీవ్రంగా ఉన్న ఇన్ఫెక్షన్ ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఆక్సిజన్ లెవెల్ శరీరంలో కావలసినంతగా లేకుంటే వారికి మాత్రమే ఆక్సిజన్ సపోర్ట్ ను అందిస్తున్నారు. ఎక్కడ హాస్పిటల్లో చూసినా ఇదే విధానం అమల్లో ఉంది.

ఆస్పత్రుల్లో చేరికతో మొదలు.. లక్షల్లో వసూళ్ళ దందా

ఆస్పత్రుల్లో చేరికతో మొదలు.. లక్షల్లో వసూళ్ళ దందా

ఇదిలా ఉంటే కరోనాతో బాధపడుతూ ఆస్పత్రులలో చేరిన బాధితులకు ఆస్పత్రిలో చేరిన నాటి నుండి డిపాజిట్లు మొదలుకొని, నిత్యం వైద్యం పేరుతో లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. కేవలం ఆసుపత్రిలో వసతి సౌకర్యం కల్పించడానికి, వైద్య సిబ్బంది సేవలు అందించడానికి ఒక్క రోజుకు ఒక పేషెంట్ కు లక్ష రూపాయలు చార్జి చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇక మందులు ,టెస్టులు, స్కాన్ లు వంటి వాటికి అదనం . ఇలా కరోనా మహమ్మారి బారిన పడిన రోగులను ఇష్టారాజ్యంగా ఆసుపత్రుల ఫీజుల పేరుతో బాదుతున్న తీరు బాధిత కుటుంబాలకు ప్రాణసంకటంగా మారుతోంది.

అరాకొరా వసతులు .. ప్రశ్నిస్తే మీ ఇష్టం వచ్చింది చేసుకోమంటూ ఇబ్బంది

అరాకొరా వసతులు .. ప్రశ్నిస్తే మీ ఇష్టం వచ్చింది చేసుకోమంటూ ఇబ్బంది

లక్షలకు లక్షలు ఫీజులు చెల్లిస్తున్నా ఆసుపత్రులలో వసతులు మాత్రం అరకొరగానే ఉంటున్నాయి. అదేమని ప్రశ్నిస్తే మీ ఇష్టమైతే ఉండండి లేకపోతే వెళ్ళిపొండి అంటూ ఆసుపత్రుల యాజమాన్యాలు బెదిరింపులకు గురి చేస్తున్నాయి. పట్టించుకునే నాధుడు లేక, ఎవరిని ప్రశ్నించాలో తెలియక ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని దీనంగా రోదిస్తున్నాయి కరోనా బాధితుల కుటుంబాలు.
దేశానికి కష్టం వచ్చింది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఆస్పత్రులలో వైద్యులు ప్రజల ప్రాణాలను నిలపడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశాన్ని ఎవరూ కాదనలేరు.

కరోనా చికిత్సపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమే దోపిడీకి కారణం

కరోనా చికిత్సపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమే దోపిడీకి కారణం

అయితే కరోనా చికిత్స విధానంపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమే, ఇష్టారాజ్యంగా ఎవరికివారు లక్షలకు లక్షలు కరోనా బాధితుల నుండి దోపిడీ చేయడమే సహించరాని నేరం. ఇంత దోపిడీ జరుగుతున్న ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. చూసీచూడనట్టు పోతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.కరోనా చికిత్స చేస్తున్న ఏ ఆస్పత్రికి వెళ్లిన ఒకటే ఫీజు విధానం ఉండేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది.

 బ్లాక్ మార్కెట్ లో బెడ్లు .. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని వినతి

బ్లాక్ మార్కెట్ లో బెడ్లు .. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని వినతి

ఆసుపత్రులలో బెడ్ల లభ్యతపై ప్రభుత్వం మానిటర్ చేసేలా ఉంటే, కరోనా బాధితులకు ఈ ఆసుపత్రుల దోపిడీ నుంచి విముక్తి కలుగుతుంది. బెడ్ లను బ్లాక్ చేసి, వాటిని కూడా బ్లాక్ మార్కెట్ చేసే ప్రైవేట్ ఆస్పత్రులకు చెక్ పడుతుంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా దీనిపై దృష్టి సారించాలని, కరోనా చికిత్సల పేరుతో సాగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కరోనా బాధితులు, బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.

English summary
There is no specific treatment for corona epidemic control and prevention. Yet the whims of hospitals do not stop exploitation. Even nominal corona treatments appear to be charging in lakhs of rupees.it is becoming a difficult to ordinary and middle class people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X