అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకోర్టు ఏర్పాటు తీరు రాజ్యంగ విరుద్దం:వెళ్లాలో వ‌ద్దో సీజే తేల్చుకోవాలి: జస్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్‌

|
Google Oneindia TeluguNews

ఏపి హైకోర్టు ఏర్పాటు తీరు పై జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. ఏపి హైకోర్టు ఏర్పాటు చేసిన విధానం రాజ్యంగ విరుద్దంగా ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఫిబ్ర‌వ‌రి 3న ఏపిలో తాత్కాలిక హైకోర్టు భవ‌న ప్రారంభానికి ప్ర‌ధాన న్యాయ‌మూర్తి రంజ‌న్ గొగొయే వెళ్లాలా వ‌ద్దో తేల్చుకోవాల‌ని స్ప‌ష్టం చేసారు.

ఆ తీరు రాజ్యంగ విరుద్దం..

ఏపిలో హైకోర్టు ఏర్పాటు చేసిన విధంగా రాజ్యంగ విరుద్దంగా ఉంద‌ని సుప్రీం మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ జాస్తి చ‌ల‌మే శ్వ‌ర్ అన్నారు. ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడిని ఆయ‌న హైకోర్టు ఏర్పాటు పై వ్యాఖ్య‌లు చేసారు. పార్ల‌మెంట్ ను కాద‌ని, రాష్ట్రప‌తి ఉత్త‌ర్వుల ద్వారా హైకోర్టు ఏర్పాటు చేయ‌టం ఘోర‌మైన రాజ్యాంగ ఉల్లంఘ‌నగా అభివ‌ర్ణించారు. బిహార్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల పునర్విభజన చట్టాలలో హైకోర్టు ఏర్పాటుపై అపాయింటెడ్‌ తేదీని స్పష్టంగా పేర్కొన్నారు.

1956 లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పాటు చట్టంలోనూ 1956 జనవరి 1వ తేదీ లేదా ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసి సూచించిన తేదీ నుంచీ హైకోర్టు మనుగడలోకి వస్తుందని ప్రస్తావించారు. కానీ, ఇప్పుడలా లేదు. దేశంలోని ప్రతీ రాజ్యాంగ వ్యవస్థ ఇలా తయారైతే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందన్న నమ్మకం త‌న‌కు లేద‌న్నారు. ఆ దేవుడే మన దేశ ప్రజాస్వా మ్యాన్ని కాపాడాలని చలమేశ్వర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Process Did Not followed in AP high court formation : Justice Chelameswar..

ప్ర‌ధాన న్యాయ‌మూర్తి గొగోయ్ తేల్చ‌కోవాలి..

ఇటువంటి ప‌రిస్థితుల్లో ఏపి హైకోర్టు ప్రారంభానికి సుప్రీం ప్ర‌ధాన న్యాయ‌మూర్తి రావాలో వ‌ద్దో తేల్చుకోవాల‌ని జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్ వ్యాఖ్యానించారు. ఆయన రాక వల్ల ఈ లోపాలు సమసిపోతాయో లేదో జస్టిస్‌ గొగోయ్‌ తేల్చుకోవాలని పేర్కొ న్నారు. వాస్తవానికి 2019 జనవరి 1వ తేదీ నుంచీ కొత్త ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పాటవుతుందని పేర్కొంటూ గత ఏడాది డిసెంబరు 26న రాష్ట్రపతి నోటిఫికేషన్‌తో గజిట్‌ విడుదలైంది. తాత్కాలిక హైకోర్టు భవనం పూర్తి కాకపోవడంతో విజయవాడలోని సీఎం క్యాంప్‌ ఆఫీసులో ప్రస్తుతం కోర్టు కార్యకలాపాలు జరుగుతున్నాయి.

రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్‌ చెప్పిన తర్వాతే కొత్త హైకోర్టు ఏర్పాటుకు రాష్ట్రపతి నోటిఫై చేయ్యాల్సి ఉంటుందని జస్టిస్‌ చలమేశ్వర్‌ చెప్పారు. హైకోర్టుల ఏర్పాటుపై అనుసరించాల్సిన విధానం గురించి రాజ్యాంగంలో వివరించారు. కానీ, ఈ విషయం లో పార్లమెంట్‌ను పూర్తిగా దాటవేశారన్నారు. పార్లమెంట్‌ ఒక తేదీని నిర్ధేశించి రాష్ట్రపతి దగ్గరకు ఒక బృందాన్ని పంపుతుందని... గతంలో ఇలాగే జరిగిందని వివ‌రించారు. గతంలో హైకోర్టుల ఏర్పాటు విషయంలో ప్రతీదీ ఒక పద్ధతి ప్రకారం వెళ్లారుని గుర్తు చేసారు. ఒక తేదీని, ప్రదేశాన్ని నిర్ణయించేవారు. కానీ ఇప్పుడు రాజ్యంగ విరుద్దంగా జ‌రిగింద‌నే అభిప్రాయం వ్య‌క్తం చేసారు. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం ఏపి ప్ర‌భుత్వంలో కొత్త చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది.

English summary
Justice Chalameswar deffered with implementation process of formation of High court in AP. He says constitutional process not followed in this process.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X