నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెల్లూరు భూవివాదంపై నిర్మాత సి. కళ్యాణ్: వాటా కోసమే తనపై ఆనం వివాదం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: నెల్లూరులోని వక్ఫ్ బోర్డు స్ధలాన్ని నిర్మాత సి కళ్యాణ్ అక్రమించారంటూ ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై శుక్రవారం నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ తాను వక్ఫ్ బోర్డు భూములను ఆక్రమించలేదని, తన భూమికి సంబంధించి తన దగ్గర ఆధారాలున్నాయని చెప్పారు.

నెల్లూరు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి ఈ భూమిపై కావాలనే వివాదం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తన భూమిలో వాటాల కోసమే వివాదాలు రేపుతున్నారంటూ సి కళ్యాణ్ ఆరోపించారు. గతంలో ఈ భూమికి సంబంధించి ఓ తెలుగు దినపత్రిక ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది.

నెల్లూరు నడిబొడ్డునున్న 59 సెంట్ల స్థలాన్ని తన సహచరుడితో కలిసి సొంతం చేసుకున్నారని ఆ పత్రిక ఆరోపించింది. వక్ఫ్‌బోర్డు స్థలాన్ని ఆర్కాట్ నవాబు వారసులంటూ కొంతమందిని తీసుకొచ్చి, వారివద్ద రూ. 1.10 కోట్లకు కొన్నట్లు చూపించి కళ్యాణ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఆ వార్తాకథనం ప్రధాన ఆరోపణ.

నెల్లూరు నడిబొడ్డున ఒకటిన్నర ఎకరాల వక్ఫ్‌భూమి ఉంది. ఈ భూమిని 18వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన ఆర్కాట్ నవాబు ముస్లింల శ్మశానవాటిక కోసం ఇచ్చారు. ఇందులో కొంతభాగంలో ముస్లింల సమాధులు, దర్గాలు ఉండగా మరో 59 సెంట్ల భూమి (354 అంకణాలు) ఖాళీగా ఉంది.

Producer C Kalyan land trouble at nellore

ఆ వార్తాకథనం ప్రకారం - ఆర్కాట్ నవాబు వారసులు అంటూ నెల్లూరు, తంజావూరు, చెన్నై ప్రాంతాలకు చెందిన కొంతమందిని తీసుకొచ్చి, కళ్యాణ్ వారితో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. భూమి విలువ రూ. 1,10,45,000 అని చెప్పి ఆ మేరకు తన ప్రతినిధి మెంటా మల్లికార్జునరావుతో 2008 ఏప్రిల్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయించారు.

ఇదే మొట్టమొదటి డాక్యుమెంట్ కావడంతోను, వివాదం ఉండటం వల్ల అప్పటి రిజిస్ట్రార్ ఈ భూమి రిజిస్టర్ చేయడానికి నిరాకరించి దాన్ని సస్పెన్షన్‌లో పెట్టారు. ఇదే సమయంలో స్థానిక మహిళా ప్రజాప్రతినిధి ఈ భూమిలో 150 అంకణాలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు.

కానీ అప్పట్లో బేరం కుదరలేదు. ప్రస్తుత మార్కెట్ విలువ ఈ ప్రాంతంలో అంకణం 4 లక్షలు. అంటే.. మొత్తం భూమి విలువ సుమారు రూ. 14 కోట్లు! దీంతో కళ్యాణ్ అండ్ కో ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లి పత్రాలు విడుదల చేయించుకున్నారు. నెల్లూరుకు చెందిన ముస్లిం పెద్దలు మాత్రం ఈ వ్యవహారంపై నాటి నుంచి నేటివరకు అభ్యంతరాలు వ్యక్తంచేస్తూనే ఉన్నారు.

English summary
Producer C Kalyan land trouble at nellore .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X