వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏయూ ఫ్రొఫెసర్‌కు మావోలతో సంబంధాలు: విశాఖ ఎస్పీ

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఆంధ్రా విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న అప్పారావుకు మావోయిస్టులతో సన్నిహిత సంబంధాలున్నాయని విశాఖపట్నం ఎస్పీ కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు. అప్పారావును బుధవారం రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టారు. అప్పారావుతోపాటు మరో ఇద్దరిని కూడా మీడియా ముందుకు తీసుకొచ్చారు.

మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారన్న అనుమానంతో అప్పారావుతోపాటు మరో ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. అప్పారావుకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని, పేలుడు పదార్థాల సరఫరాలో అప్పారావుది కీలక పాత్ర అని ఎస్పీ చెప్పారు.

professor apparao has close contacts with maoists say police

ప్రొఫెసర్ అప్పారావు అరెస్ట్ విషయంలో ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని ఎస్పీ కోయ ప్రవీణ్ అన్నారు. కాల్ డేటా ఆధారంగా అప్పారావు కార్యకలాపాలపై నిఘా పెట్టామని ఆయన తెలిపారు. ఆరు బ్యాగుల అమ్మోనియం నైట్రేట్, 500 ఎలక్ట్రిక్ పేలుడు పదార్థాలు, మరో 100 ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు.

అప్పారావును న్యాయమూర్తి ముందు హాజరుపర్చనున్నట్లు చెప్పారు. ఇది ఇలా ఉండగా ప్రొఫెసర్ అప్పారావు అరెస్ట్‌కు నిరసనగా ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, విద్యార్థులు ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. అప్పారావు అరెస్ట్ అక్రమమని, వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

English summary
Visakhapatnam SP Koya Praveen on Thursday said that Andhra University professor apparao has close contacts with maoists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X