• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శ్రీధర్‌కు ప్రమోషనే: దానం, జగన్‌ని ఉరేయాలి: పాల్వాయి

By Srinivas
|

Promotion to Sridhar Babu: Danam
హైదరాబాద్/మెదక్: మంత్రి శ్రీధర్ బాబు శాఖ మార్పుపై తెలంగాణ ప్రాంత నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన మండిపడుతుండగా.. కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ మాత్రం ప్రమోషన్ వచ్చిందని చెబుతున్నారు. రాజధానికి చెందిన ఇద్దరు మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్‌లు మహీధర్ రెడ్డిని కలిసి జంట నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఉచిత నీటి సరఫరా చేయాలని కోరారు.

ఈ సందర్భంగా దానం మాట్లాడారు. శాసన సభ వ్యవహారాల నుండి తప్పించి వాణిజ్య పన్నుల శాఖను అప్పగించడం శ్రీధర్ బాబుకు ప్రమోషన్ లభించినట్లన్నారు. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అదేదో ఆయనకు చెప్పి మారిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

జగన్, బాబులను ఉరెయ్యాలి: పాల్వాయి

అవినీతిపరులకు ఉరేయాలంటే మొదట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిలను ఉరేయాలని తెలంగాణ ప్రాంత సీనియర్ కాంగ్రెసు నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వేరుగా అన్నారు.

చంద్రబాబు, జగన్‌ల అవినీతిని అందరూ తిప్పి కొట్టాలన్నారు. జగన్ అవినీతి పైన ఆంధ్రా ఎంపీలు ఎందుకు అడగలేకపోతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ కావాలన్న కోరికకు చంద్రబాబే కారణమన్నారు. సీమాంధ్ర ప్రాంత పార్లమెంటుసభ్యులు ఎక్కడ దీక్ష చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ చచ్చిపోలేదన్నారు.

అసహ్యించుకునేలా చేయొద్దు: పొంగులేటి

అరుపులు, కేకలతో చట్ట సభలను అసహ్యించుకునేలా చేయవద్దని మరో సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. తొండి, వితండవాదాలతో సభాపతి, చైర్మన్‌లను టార్గెట్ చేసి సభా సమయాన్ని వృధా చేసుకోవద్దన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చకు సహకరించాలని కోరారు.

English summary
Minister Danam Nagender on Thursday said that the Commercial Taxes portfolio is promotion to Minister Sridhar Babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X