హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వ్యభిచార గృహంపై దాడి: చిక్కిన ముంబై మోడల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Prostitute rocket busted in Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పంజగుట్టలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందంటూ సమాచారం అందడంతో పోలీసులు శుక్రవారం అర్థరాత్రి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ యువతి భవనంపై నుంచి దూకినట్లు తెలుస్తోంది.

భవనంపై దూకడంతో గాయపడిన యువతిని సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. బాధితురాలిని ముంబైకి చెందిన మోడల్‌గా భావిస్తున్నారు. ఇదే సమయంలో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకుడితో పాటు ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పరారీకి ఖైదీ యత్నం: పోలీసుల కాల్పులు

ఖమ్మం ప్రభుత్వాస్పత్రి శనివారం ఉదయం తుపాకుల మోతతో దద్ధరిల్లింది. వైద్యం కోసం తీసుకుని వ్చిచన ఓ రిమాండ్ ఖైదీ పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. చివరకు పారిపోవడానికి ప్రయత్నించిన ఖైదీని పోలీసులు పట్టుకున్నారు.

పోలీసుల కాల్పుల్లో ఖైదీ స్వల్పంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు అందాల్సి ఉంది.

English summary
Hyderabad police have busted a prostitue rocket at Punjagutta raiding a house. It is said that a Mumbai model has been injured in this incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X