వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడే దిగ్బంధం: ఆ ముసుగులో వైసీపీ 'విధ్వంసం'?.. టీడీపీ సంచలనం

|
Google Oneindia TeluguNews

Recommended Video

Andhra Pradesh Parties Protest, Block Highways

అమరావతి: ఏపీలో ప్రత్యేక హోదా ఫైట్ ఉధృతమవుతోంది. ఇన్నాళ్లు ప్రజా ఉద్యమాన్ని తొక్కిపెట్టారని ఆరోపిస్తూ వస్తున్న ప్రత్యేక హోదా సాధనా సమితి ఆధ్వర్యంలో.. హోదా పోరు ఉద్యమ పంథా వైపు మళ్లుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా జాతీయ రహదారులను దిగ్బంధానికి ప్రత్యేక హోదా సాధనా సమితి పిలుపునిచ్చింది. అనివార్యంగా టీడీపీ కూడా ఇప్పుడు దీనికి మద్దతునివ్వాల్సిన పరిస్థితి తలెత్తింది.

మందేసి, లోకేష్.. అమ్మాయిల నడుములు కొలిచాడు: పోసాని సంచలనం మందేసి, లోకేష్.. అమ్మాయిల నడుములు కొలిచాడు: పోసాని సంచలనం

టీడీపీ మద్దతు:

టీడీపీ మద్దతు:

రాష్ట్ర ప్రయోజనాల కోసం నిర్వహించే కార్యక్రమమైనందున నిరసనకు నైతిక మద్దతును తెలియజేస్తున్నామని టీడీపీ ప్రకటించింది. అయితే తమ పార్టీ అధికారంలో ఉన్నందున తమ నేతలు బంద్‌లూ, రాస్తారోకోలలో పాల్గొనే అవకాశం లేదని పేర్కొంది.

వైసీపీ విధ్వంసం సృష్టించవచ్చు..: కళా వెంకట్రావు

వైసీపీ విధ్వంసం సృష్టించవచ్చు..: కళా వెంకట్రావు

రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో వైసీపీతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనవద్దని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పార్టీ నేతలకు సూచించారు. రహదారుల పక్కన టెంటులు వేసి నిరసన సభలు నిర్వహించాలని సూచించారు. ఆందోళనను అడ్డం పెట్టుకుని వైసీపీ ఉద్రిక్తతలు రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని హెచ్చరించారు.

జగన్ మద్దతు:

జగన్ మద్దతు:

రహదారుల దిగ్బంధానికి వైసీపీ అధినేత జగన్ మద్దతు ప్రకటించారు. రహదారుల దిగ్బంధంలో పాల్గొని ప్రత్యేక హోదా ఆకాంక్షను చాటాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. అటు కాంగ్రెస్‌ పార్టీ కూడా సంపూర్ణ మద్దతును ప్రకటించింది.

పవన్ కల్యాణ్ మద్దతు:

పవన్ కల్యాణ్ మద్దతు:


జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రహదారుల దిగ్బంధానికి మద్దతు తెలిపారు. అయితే పరీక్షల సమయం కావడంతో.. విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదని సూచించారు. కాగా, రహదారుల దిగ్బంధానికి అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఈ ప్రయత్నంతో ఏపీ ప్రజల్లో ఉన్న హోదా ఆకాంక్షను మరోసారి గట్టిగా వినిపించే అవకాశముందని అంటున్నారు.

చలసాని పిలుపు మేరకు:

చలసాని పిలుపు మేరకు:

హోదా ఏ ఒక్కరితోనో సాధ్యమయ్యేది కాదని, ఇందుకోసం అన్ని పార్టీలు కలిసి పోరాడాలని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ అన్నారు. ప్రత్యేక హోదాపై అనకాపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే, గురువారం రహదారుల దిగ్బంధం నేపథ్యంలో.. పరీక్షలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఉదయం 10గం. కంటే ముందే గమ్య స్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

English summary
All parties are readied to stage for protests across the Andhrapradesh. Chalasani Srinivas Yadav given a call to Highways bandh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X