అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిప్పుల్లో నివేదికలు: భోగి మంటల మధ్య అమరావతి నిరనసలు: చంద్రబాబు సహా...!

|
Google Oneindia TeluguNews

భోగి మంటల్లో రాజధానుల నివేదికలను బూడిద చేసారు. పండుగ రోజు భోగి మంటల మధ్య నిరసనలు వ్యక్తం చేసారు. అమరావతి జేఏసీ పిలుపు మేరకు ప్రభుత్వానికి మూడు రాజధానుల పైన అందిని జీఎన్ రావు..బోస్టన్ కమిటీ నివేదికలను భోగి మంటల్లో వేసి నిరసన కొనసాగిస్తున్నారు. విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు..జేఏసీ నేతలు..రాజధాని గ్రామాల్లో రైతులు భోగి మంటల్లో ఈ నివేదికలను తగలబెట్టారు.

రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ బెంజిసర్కిల్‌ సమీపంలోని ప్రైవేట్‌ స్థలంలో నేతలు భోగి మంటలను ఏర్పాటు చేశారు. తుళ్లూరులో మహాధర్నా శిబిరం వద్ద బోగీమంటల కార్యక్రమంలో నివేదికల పత్రాలను వేస్తూ..అమరావతికి అనుకూలంగా నినాదాలు చేసారు. పండుగకు దూరంగా ఉండి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

సంబరాల్లో నిరసనలు..

సంబరాల్లో నిరసనలు..

సంక్రాంతి సంబరాలు అమరావతిలో నిరసనలతో ప్రారంభమయ్యాయి.రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలోవిజయవాడ బెంజిసర్కిల్‌ సమీపంలోని ప్రైవేట్‌ స్థలంలో నేతలు భోగి మంటలను ఏర్పాటు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తో సహా పార్టీ నేతలు..జేఏసీ నేతలు హాజరైన అమరావతికి అనుకూలంగా నినాదాలు చేసారు. జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌ నివేదిక ప్రతులను భోగిమంటల్లో వేసి నిరసన తెలిపారు.

మూడు రాజధానుల ప్రతిపాదనలు విరమించుకోవాలని

మూడు రాజధానుల ప్రతిపాదనలు విరమించుకోవాలని

ఆంధ్రులంతా ఒక్కేటే.. రాజధాని అమరావతి ఒక్కటే అంటూ పెద్ద ఎత్తున నినాదాలుచేశారు. మూడు రాజధానులప్రతిపాదనలు విరమించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. అమరావతిని చించాలంటే భవిష్యత్‌ ఉండదని చంద్రబాబు హెచ్చరించారు. అమరావతి చారిత్రక ప్రాధాన్యాన్ని కాపాడుకోవాలని బాబు పిలుపునిచ్చారు. అమరావతిని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సాయం చేశారని గుర్తు చేశారు.

రాజధాని గ్రామాల్లోనూ..

రాజధాని గ్రామాల్లోనూ..

రాజధాని అమరావతి గ్రామాల పరిధిలోనూ ఇదే రకంగా నిరసన వ్యక్తం చేసారు. ఎంపీ గల్లా జయదేవ్..టీడీపీ నేతలు అమరాతి ఉద్యమ కారులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. రెండు కమిటీల సిఫార్సులను భోగి మంటల్లో దహనం చేసారు. మాజీ మంత్రి దేవినేని ఉమా ఆధ్వర్యంలో సైతం నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా గ్రామాల్లో రైతులు, మహిళల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉన్న రాజధాని గ్రామ ప్రజలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ బెంజ్ సర్కిల్ వద్ద భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ అమరావతి రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేసారు. తెలంగాణ ముఖ్యమంత్రితో గంటల తరబడి సమావేశం జరిపిన సీఎం జగన్ అమరావతి రైతులతో ఎందుకు చర్చించరని ఎంపీ జయదేశ్ ప్రశ్నించారు.

English summary
Protests in Bhogi celebrations against three capitals proposals. Gn Rao and Bostan committee reports dropped in bhogi fires. CBN and JAC leaders protest in Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X