వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ జ‌నం మ‌న‌సు గెలిచారా..! నలభై రోజుల పాలనపై ప్రజా స్పందన ఏంటి..?

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : జగన్ మోహన్ రెడ్డి. అంటే జననేత. పాలరాతి భవంతులు ఉన్నా, అద్దాల సౌధాలు ఉన్నా ఏనాడు సొంత సుఖాలను కోరుకోని జననాయకుడు. ప్రజల కష్టాల పరిష్కారమే పరమావదిగా ప్రజా క్షేత్రంలో ఎక్కువ రోజులు గడిపిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రజల మద్య గడిపిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తమ గెండెల్లో పెట్టుకున్నారు. అత్యంత భారీ మెజారిటీతో గెలిపించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జగన్ కూడా మంచి ముఖ్యమంత్రిగా ముద్రవేసుకునేందుకు అహర్నిషలు శ్రమిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా దాదాపు 50 రోజులు కావస్తున్న తరుణంలో ఎంతవరకు ప్రజల అభిమానం సొంతం చేసుకోగలిగారు..? జగన్ వాస్తవంగా ప్రజలు మనసు గెలుచుకోగలిగారా..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!

<strong>చీరాలలో చిరిగిపోయే రాజకీయం..! ఎత్తులకు పైఎత్తు పాలిటిక్స్..!! </strong>చీరాలలో చిరిగిపోయే రాజకీయం..! ఎత్తులకు పైఎత్తు పాలిటిక్స్..!!

Recommended Video

రైతు కోసం విపత్తు సహాయ నిధి - జగన్
రాజన్న రాజ్యం వచ్చిందంటున్న వైసీపి నేతలు..! అబ్బే కాదులే అంటున్న ప్రతిపక్షాలు..!!

రాజన్న రాజ్యం వచ్చిందంటున్న వైసీపి నేతలు..! అబ్బే కాదులే అంటున్న ప్రతిపక్షాలు..!!

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి నలభై రోజుల ప‌రిపాల‌న ఎలా ఉంది. ఇంత క్లిష్ట‌మైన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాలంటే కాస్త క‌ష్ట‌మే అంటారు త‌ట‌స్థులు. అదీ ఒక పాల‌నేనా అంటున్నాయి విప‌క్షాలు.. ఇదీ అస‌లైన రాజన్న రాజ్య‌మంటూ వైసీపీ అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. నెల‌రోజుల్లో జ‌గ‌న్ పాల‌న సంగ‌తి ఎలా ఉన్నా.. వైసీపీ, టీడీపీ మ‌ధ్య వ‌ర్గ‌పోరు పెరిగింది. దాదాపు అన‌ధికార లెక్క‌ల ప్ర‌కారం 150 చోట్ల ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగాయి. దాదాపు 10 మంది వ‌రకూ హ‌త్య‌కు గుర‌య్యారు. కోస్తా జిల్లాల్లో టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఊళ్ల‌ను ఖాళీ చేసి ఇత‌ర ప్రాంతాల్లో త‌ల‌దాచుకుంటున్నారు. అయితే.. దీనికి వైసీపీ నేత‌లు చెబుతున్న వివ‌ర‌ణ కూడా అయ్యోపాపం అనిపించేలా ఉంది. వైసీపీ గెలుపు.. జ‌గ‌న్ సీఎం కావ‌టం అంతా ఒక మాయానాట‌క‌మంటూ టీడీపీ నేత‌లు ఎద్దేవా చేస్తున్నారు. ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్ చేసి గెలిచారంటూ విమ‌ర్శిస్తున్నారు. పైగా.. గ‌తంలో వైసీపీ నేత‌ల‌పై దాడులు చేసి.. పోలీసు కేసుల‌తో ఇబ్బందుల‌కు గురిచేసిన వారూ కూడా ఇలా విమ‌ర్శించే వారిలో ఉన్నారు.

దాడులకు ప్రతి దాడులు..! ప్రభుత్వం పై వెల్లువెత్తున్న విమర్శలు..!!

దాడులకు ప్రతి దాడులు..! ప్రభుత్వం పై వెల్లువెత్తున్న విమర్శలు..!!

ఇప్పుడెలాగూ తమ స‌ర్కారే ఉంద‌నే ఉద్దేశంతో వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు దైర్యంగా దాడులు చేస్తున్నారు. తాము చ‌విచూసిన అనుభ‌వాల‌ను గుర్తుచేసుకుని.. దానికి ప్ర‌తీకారం గా దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. ఇందులో త‌ప్పేముంది.. నిన్న వాళ్లు కొట్టారు. ఇప్పుడు వీళ్లు కొడుతున్నారు. ఇదిగో మా వ‌ద్ద ఉన్న సాక్ష్యాలంటూ.. పోలీసులే చెబుతుండ‌టం ప‌రిస్థితికి అద్దంప‌డుతోంది. ప‌థ‌కాల విష‌యానికి వ‌స్తే.. రైతుల‌కు రుణాలు, డ్వాక్రా మ‌హిళ‌ల రుణాల మాపీ ఆల్రెడీ జ‌నాల్లో పాజిటివ్ గా వెళ్లింది. అమ్మఒడి, ఆరోగ్య‌శ్రీ ఈ రెండు విష‌యాల‌పై పార్టీ, ప్ర‌భుత్వం రెండింటిలోనూ క్లారిటీ మిస్స‌యిన‌ట్టుగా అధికారులు భావిస్తున్నారు.

మంత్రుల అవినీతి చూపు..! అడ్డుకట్ట వేస్తున్న జగన్..!!

మంత్రుల అవినీతి చూపు..! అడ్డుకట్ట వేస్తున్న జగన్..!!

మ‌రోవైపు కొన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు మండ‌ల‌స్థాయిలో ప‌నుల‌ను త‌మ అనుచ‌ర‌గ‌ణానికి అప్ప‌గించారు. ప్ర‌జ‌లు త‌మ అవ‌స‌రాల‌కోసం త‌న వ‌ద్ద‌కు రావ‌ద్దంటూ బ‌హిరంగంగానే చెబుతున్నారట‌. టీడీపీ హ‌యాంలో షాడోలు ఎలా పెత్త‌నం చేశారో.. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల అనుచ‌ర‌గ‌ణం కూడా వ‌సూళ్ల‌కు దిగుతున్నార‌ట‌. కోడెల పేరిట ముద్ర‌ప‌డిన కే ట్యాక్స్ ఏకంగా టీడీపీను నిలువునా ముంచేసింది. ఇప్పుడు అదేబాట‌లో వైసీపీ నేత‌లు కూడా.. రాజ‌న్న రాజ్యంలో అన్నీ ఉచితం అంటూనే చాటుమాటుగా వ‌సూళ్ల‌కు శ్రీకారం చుట్ట‌డం జ‌గ‌న్ దృష్టి వ‌ర‌కూ చేరింద‌ట‌. కొంద‌రు ఎమ్మెల్యేలు మ‌రింత‌గా చెల‌రేగ‌టంపై మంద‌లించార‌ని కూడా తెలుస్తోంది.

ప్రజావేదిక కూల్చివేతపై పెదవి విరుపు ..! వస్తోన్న మిశ్రమ స్పందన..!!

ప్రజావేదిక కూల్చివేతపై పెదవి విరుపు ..! వస్తోన్న మిశ్రమ స్పందన..!!

ఇక‌పోతే మంత్రులు క‌ళ్లెదుట ల‌క్ష‌లు వ‌చ్చే మార్గం క‌నిపిస్తున్నా.. ఏం చేయ‌లేక నిస్స‌హాయంగా ఉన్నార‌ట‌. ఒక‌రిద్ద‌రు మంత్ర‌లు.. ప్ర‌మోష‌న్లు, ట్రాన్స్‌ఫ‌ర్ల విష‌యంలో క‌క్కుర్తిప‌డి తీసుకున్న సొమ్మ‌ను కూడా జ‌గ‌న్ తానే స్వ‌యంగా వారికి ఇప్పించారంటూ వైసీపీ అభిమానులు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేసుకుంటున్నారు. మ‌హిళ‌, రైతు వ‌ర్గాల్లో జ‌గ‌న్ పాజిటివ్ గా ఉన్నా.. గ్రామాల్లో క‌క్ష‌లు, ప‌గ‌లు, ప్ర‌తీకార దాడులు పార్టీ ప్ర‌తిష్ఠ‌ను దెబ్బ‌తీసే అవ‌కాశాలున్నాయంటూ పార్టీవ‌ర్గాలు ఆందోళ‌న ప‌డుతున్నాయి. వీట‌న్నింటినీ అధిగ‌మించి జ‌నం మ‌న‌సులో రాజ‌న్న అస‌లైన వార‌సుడు అనే ముద్ర ఎలా వేసుకుంటార‌నేది జ‌గ‌న్ వ్యూహంపై ఆధార‌ప‌డి ఉందనే చర్చ జరుగుతోంది. అంతే కాకుండా ప్రజావేదిక కూల్చివేత చర్య ఏపి సీఎం కి మిశ్రమ స్పందన వచ్చినట్టు తెలుస్తోంది. అంత తొందర పడాల్సిన అవసరం ఏముందనే దిశగా ప్రజల్లో ఓ వర్గం పెదవి విరుస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానకి జగన్ 50రోజుల పాలన పట్ల ప్రజల్లో మిశ్రమ స్పందన వస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

English summary
How is YS Jaganmohan Reddy's forty days administration. Neutrals are known to be a bit of a problem in the face of this complex issue. Opposition saying some bad. YCP fans are applauding that this is the original Rajanna Rajyam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X