వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో పబ్లిసిటీ స్టంట్ ... హీటెక్కిస్తున్న రంగుల రాజకీయం

|
Google Oneindia TeluguNews

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది. ఏపీ సీఎంగా పాలనా బాధ్యతలు చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి పాలనలో తనదైన దూకుడు చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాత్రం అధికారపార్టీకి తలనొప్పిగా మారాయి. విమర్శలకు కారణం అవుతున్నాయి.

వైసీపీ భవనాలకు పార్టీ రంగులు వేసుకోటానికే ... పాలించటానికి పనికిరాదన్న కన్నావైసీపీ భవనాలకు పార్టీ రంగులు వేసుకోటానికే ... పాలించటానికి పనికిరాదన్న కన్నా

చంద్రబాబు హయాంలో అంతా పసుపుమయం .. అప్పడాల మీద కూడా బాబే

చంద్రబాబు హయాంలో అంతా పసుపుమయం .. అప్పడాల మీద కూడా బాబే

గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం పబ్లిసిటీ కోసం చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం అలాంటి తప్పిదాలే వైసిపి ప్రభుత్వం కూడా చేస్తుందని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, అనవసరపు దుబారా ఖర్చులు పెట్టారని, ప్రచార ఆర్భాటాల కోసం విచ్చలవిడిగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఏపీలో చర్చ జరిగింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వారి పార్టీ ప్రచార ఆర్భాటాలకు కనిపించిన వాటన్నిటినీ పసుపుమయం చేశారని విమర్శలు వెల్లువెత్తాయి. ఆఖరుకు అప్పడాల మీద కూడా బాబు మొహం అచ్చు వేయించుకున్నాడని పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

పబ్లిసిటీ ప్రభుత్వం ... పంచాయితీలకు వైసీపీ రంగులు

పబ్లిసిటీ ప్రభుత్వం ... పంచాయితీలకు వైసీపీ రంగులు

ఇక ఇప్పుడు అధికార వైసిపి సైతం పబ్లిసిటీ స్టంట్లు చేస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఏపీ రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు వైసీపీ పార్టీకి చెందిన మూడురంగులతో పాటు ప్రతి పంచాయితీలోనూ జగన్ ఫోటో ఒకటి తప్పకుండా ఏర్పాటుచేయాలని పంచాయితీ అధికారులకు ఆదేశాలు వెళ్ళటంతో ఏపి లోని అన్ని పంచాయితీలు వైసిపి రంగులతో దర్శనమిస్తున్నాయి. అయితే గ్రామాల్లో పంచాయితికి రంగులు మార్చే విషయంపై అధికార, ప్రతిపక్షాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి.

టీడీపీని, వైసీపీని టార్గెట్ చేసి విమర్శిస్తున్న బీజేపీ

టీడీపీని, వైసీపీని టార్గెట్ చేసి విమర్శిస్తున్న బీజేపీ


ఇప్పటికే పలుమార్లు వైసిపి రంగుల రాజకీయం చేస్తోందని బిజెపి నాయకులు, టిడిపి నాయకులు ధ్వజమెత్తారు.ఏపీలో ఉన్న పంచాయతీలు,వాటర్ ట్యాంకులు, చేతి పంపులు, స్మశానాలు ఇలా దేన్ని కూడా వదలకుండా వైసీపీ పార్టీ జెండా రంగులు వేసి బాబుకు ఏమాత్రం తీసిపోకుండా తమ పార్టీని పబ్లిసిటీ చేసుకుంటున్నారని బిజెపి నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ రంగుల రాజకీయంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసేందుకే పనికొస్తుందని ఘాటుగా విమర్శించారు. భవనాలకు పార్టీ రంగులు వేసుకోవాడానికి తప్ప, రాష్ట్రాన్ని పాలించడానికి వైసీపీ పనికిరాదని కన్నా మండిపడ్డారు.

 హీటెక్కిస్తున్న ఏపీలో రంగుల రాజకీయం

హీటెక్కిస్తున్న ఏపీలో రంగుల రాజకీయం

ఒకపక్క పాలన విషయంలో జగన్ సంచలన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, మరోపక్క ఇలాంటి చిన్న చిన్న వివాదాలు వైసిపి సర్కార్ ను ఇబ్బంది పెడుతున్నాయి. గతంలో టీడీపీ చేసిన తప్పే తిరిగి వైసీపీ చేస్తోందని, పబ్లిసిటీ పిచ్చి తో పార్టీ జెండా రంగులను ఏపీలోని ప్రభుత్వ భవనాలకు వేయిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బిజెపి అటు అధికార పార్టీని, ఇటు ప్రతిపక్ష టిడిపిని పబ్లిసిటీ రాజకీయాల విషయంలో టార్గెట్ చేస్తోంది. దీంతో ఏపీలో రంగుల రాజకీయం కూడా హీట్ పుట్టిస్తోంది.

English summary
There is a lot of criticism that the YSP government is currently making mistakes for the publicity of the erstwhile Telugu Desam Government. BJP leaders have been criticizing the YCP colors for buildings like tdp and not leaving anything to publicity to the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X