కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

28 రోజులుగా నో కరోనా కేస్: గ్రీన్‌జోన్‌గా వైఎస్ జగన్ సొంత పట్టణం: నిబంధనలను సడలించేలా

|
Google Oneindia TeluguNews

కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం గ్రీన్‌జోన్‌గా మారింది. కడప జిల్లాలోని పులివెందులను రెడ్‌జోన్ నుంచి గ్రీన్‌జోన్ కిందికి మార్చినట్లు కలెక్టర్ హరికిరణ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇదివరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నాలుగు నమోదు అయ్యాయి పులివెందులలో. వారంతా వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కిందటి నెల 20వ తేదీన వారంతా డిశ్చార్జి అయ్యారు. అప్పటి నుంచి ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.

ఈ వ్యవధిలో సుమారు పులివెందుల నియోజకవర్గం పరిధిలో సుమారు అయిదువేల మందికి పైగా కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించారు. ఒక్కటి కూడా పాజిటివ్ రాలేదు. దీనితో పులివెందుల పరిధి మొత్తాన్నీ గ్రీన్‌జోన్‌గా మార్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రస్తుతం కడప జిల్లాలో 104 కరోనా వైరస్ కేసులు ఉండగా.. అందులో యాక్టివ్‌గా ఉన్నవి 76. జిల్లా కేంద్రం కడప సహా బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల రెడ్‌జోన్‌లో కొనసాగుతున్నాయి. పోరుమామిళ్ల, పుల్లంపేట, కమలాపురం, వేంపల్లి, చెన్నూరు, జమ్మలమడుగు ఆరెంజ్‌లో ఉన్నాయి.

కరోనా బారిన ఏపీ: ఇప్పటిదాకా 52 మంది మృత్యువాత: చిత్తూరుజిల్లాలో తొలి మరణం: భారీగా కేసులుకరోనా బారిన ఏపీ: ఇప్పటిదాకా 52 మంది మృత్యువాత: చిత్తూరుజిల్లాలో తొలి మరణం: భారీగా కేసులు

Pulivendula converted as Green zone after no new covid 19 cases have reported

పులివెందులను గ్రీన్‌జోన్‌గా ప్రకటించినప్పటికీ.. ఆంక్షలు మరి కొంతకాలం పాటు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు. పాక్షికంగా దుకాణాలను తెరచుకోవడానికి అనుమతి ఇస్తామని తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా బస్సుల రాకపోకలు, ప్రైవేటు రవాణా వ్యవస్థను పునరుద్ధరిస్తామని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన తరువాతే.. ఆంక్షలను సడలిస్తామని తెలిపారు. జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పూర్తిగా మటుమాయమైన తొలి పట్టణం ఇదేనని, రెడ్‌జోన్ నుంచి గ్రీన్‌జోన్‌లోకి బదలాయించిన ప్రదేశం ఇదేనని వెల్లడించారు.

English summary
Andhra Pradesh CM YS Jagan own assembly constituency Pulivendula was converted as Green Zone from Red Zone. Kadapa district officials told that there is no Covid-19 Coronavirus positive case have reported in Pulivendula since 28 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X