వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రేకింగ్ : గోదావరిలో లాంచీ మునక.. 47 మంది గల్లంతు..! సీఎం ఆరా

|
Google Oneindia TeluguNews

తూర్పు గోదావరి : గోదావరి నదిలో లాంచీ మునక కలకలం రేపుతోంది. 62 మంది పర్యాటకులతో పాపికొండలకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. అందులో 15 మంది సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. అయితే మిగతా 42 మంది కోసం మాత్రం తీవ్రంగా గాలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రమాదంలో సేఫ్‌గా బయటపడ్డవారు లైఫ్ జాకెట్లు వేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రమాదం ఎలా జరిగిందనేది మాత్రం పూర్తి వివరాలు తెలియరాలేదు.

పాపికొండలకు 62 మంది పర్యాటకులతో బయల్దేరిన లాంచి గండిపోచమ్మ ఆలయం నుంచి బయల్దేరిన కాసేపటికే నీట మునిగినట్లు తెలుస్తోంది. దేవీపట్నం మండలం మంటూరు - కచ్చులూరు మధ్య ఈ ఘటన జరిగినట్లు సమాచారం. గోదావరి నదిలో వరద ఉధృతి తగ్గిన నేపథ్యంలో పాపికొండల టూర్‌కు అధికారులు పర్మిషన్ ఇచ్చినట్లు చెబుతున్నారు కొందరు.

punnami boat fell into godavari river with 62 tourists

ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. అధికారుల ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు. సహాయక చర్యలు స్పీడప్ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ క్రమంలో హెలికాప్టర్‌ను సిద్ధం చేశారు అధికారులు. అదలావుంటే గోదావరిలో వరద ఉధృతి తగ్గకముందే లాంచీ బయలుదేరడానికి ఎలా అనుమతి ఇచ్చారనే కోణంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

English summary
punnami boat fell into godavari river with 62 tourists. 15 were safe and 47 tourists not found.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X