purandeswari kambhampati hari babu hari babu pawan kalyan no confidence motion monsoon session parliament bjp narendra modi opposition congress tdp chandrababu naidu పురంధేశ్వరి కంభంపాటి హరిబాబు హరిబాబు వర్షాకాల సమావేశాలు పార్లమెంటు బీజేపీ నరేంద్ర మోడీ ప్రతిపక్షాలు కాంగ్రెస్ టీడీపీ అవిశ్వాస తీర్మానం చంద్రబాబు నాయుడు
యూటర్న్ బాబు, టీడీపీలా కాదు: పురంధేశ్వరి విమర్శలు, ‘జగన్ డిమాండ్ సరికాదు’

హైదరాబాద్/అమరావతి: పార్లమెంటులో శుక్రవారం అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని కించపర్చేలా టీడీపీ ఎంపీలు మాట్లాడటం సరికాదని బీజేపీ సీనియర్ నేత పురంధేశ్వరి హితవు పలికారు. శనివారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడారు.
కాగా, పార్లమెంటులో శుక్రవారం అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ప్రధానిపై టీడీపీ ఎంపీలు మోసగాడని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ చెప్పేవాన్ని అబద్ధాలే..
ఈ నేపథ్యంలో పురంధేశ్వరి శనివారం మీడియాతో పురంధేశ్వరి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. బీజేపీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం భాగస్వామ్యంతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే ఉత్తమమని చంద్రబాబే వ్యాఖ్యానించారని, ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. ప్రజాలు నిజానిజాలు గమనిస్తున్నారని చెప్పారు.

ఏపీ కోసం పోరాడింది టీడీపీ కాదు.. బీజేపీనే
విభజన సమయంలో ఏపీకి అండగా నిలబడింది బీజేపీనేనని పురంధేశ్వరి చెప్పారు. విభజనకు మద్దతుగా లేఖలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు అన్యాయం జరిగిందంటూ చెబుతున్నారని మండిపడ్డారు. ఏపీ కోసం టీడీపీ ఏమీ అడగలదేదని.. ఏపీకి న్యాయం చేయాలంటూ పోరాటం చేసింది బీజేపీనేనని చెప్పారు.

టీడీపీ సర్కారు నిర్లక్ష్యం..
ఏపీలో కేంద్రం విద్యాసంస్థలను నెలకొల్పుతోందని అన్నారు. పెట్రోలియం వర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్థలం కేటాయించలేదని పురంధేశ్వరి చెప్పారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు నివేదిక ఇవ్వమంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ఇప్పుడు ఆందోళన చేస్తోందని మండిపడ్డారు.
రైల్వే జోన్ ఇవ్వమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని ఆమె అన్నారు.

టీడీపీలా రాజకీయాలు చేయం
ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పురంధేశ్వరి చెప్పారు. టీడీపీలా రాజకీయాలు తాము చేయమని అన్నారు. ఏపీ అభివృద్ధి పట్ల కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తోందని చెప్పారు.కేంద్రంపై విమర్శలు చేసే ముందు రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో గుర్తు చేసుకోవాలని అన్నారు.

జగన్ డిమాండ్ సరికాదు
చట్టంలో లేని హామీలను కూడా కేంద్రం నెరవేరుస్తోందని పురంధేశ్వరి చెప్పారు. ఇప్పటి వరకు ఏపీకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చామని, ఇంకా ఇస్తూనే ఉంటామని ఆమె తెలిపారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక రాష్ట్రాలంటూ లేవని ప్రకటించినా.. వైయస్ జగన్మోహన్ రెడ్డి హోదానే కావాలంటూ డిమాండ్ చేయడం సరికాదని అన్నారు. హోదాతోనే అన్ని వస్తాయనుకోవడం వాస్తవం కాదని అన్నారు. హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీతోనే ఏపీకి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నామని పురంధేశ్వరి తెలిపారు.