వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ ఇసుక సత్యాగ్రహం .. వరదలొచ్చి 2 నెలలే .. మీరొచ్చి 6 నెలలు అన్న పురంధరేశ్వరి

|
Google Oneindia TeluguNews

బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఏపీ సీఎం వైయస్ జగన్ గురించి, అలాగే వైసీపీ నాయకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇసుక కొరతపై అందరూ స్పందిస్తున్నారని బిజెపి నాయకురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇసుక కొరత పేరుతో తమపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారని, వరదలు ఉంటే ఇసుక ఎలా తవ్వకాలు చేస్తారని ప్రశ్నిస్తున్న అధికార పార్టీ నాయకులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

<strong>వైసీపీలో చేరికపై స్పందించిన దగ్గుపాటి పురంధరేశ్వరి ... ఒత్తిడి నిజమే కానీ ..</strong>.వైసీపీలో చేరికపై స్పందించిన దగ్గుపాటి పురంధరేశ్వరి ... ఒత్తిడి నిజమే కానీ ...

నిర్మాణ రంగ కార్మికులు ఇబ్బంది పడుతుంటే అధికార పార్టీ నేతల మాటలు అవహేళన చేసినట్టుగా ఉన్నాయని పురంధరేశ్వరి అంటున్నారు. ఉపాధిలేక కార్మికులు ఆత్మహత్యలబాట పడుతుంటే వైసీపీ నాయకులు ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు.

Purandhareshwari outrage on YCP .. flooding for the past two months but YCP ruling from six months

కృష్ణా జిల్లా విజయవాడలో ఇవాళ బీజేపీ ఇసుక సత్యాగ్రహం నిర్వహిస్తుంది . రాష్ట్రంలో ఇసుక సంక్షోభానికి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో ఇసుక సత్యాగ్రహం చేపట్టారు . ఇసుక సత్యాగ్రహంలో పాల్గొన్న పురంధరేశ్వరి ఇసుకపై తప్పుడు విధానాలకు ప్రభుత్వం కారణమని ఆరోపించారు. గత రెండు నెలలుగా వరదలు ఉన్నాయని, అయితే ఆరు నెలల నుండి ఇసుక కొరత అలాగే ఉందని ఆమె పేర్కొన్నారు .

వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం విఫలమైందని, ఇసుక కొరత రాష్ట్ర ఆర్థిక స్థితిని ప్రభావితం చేసిందని ఆమె అన్నారు.ఇసుక సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడిన పురంధరేశ్వరి వరదలు వచ్చాయని చెప్పడం సాకు మాత్రమేనన్నారు.

రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఇసుక కొరత నెలకొందని ముందస్తుగా ఇసుకను ఎందుకు నిల్వ చేయలేకపోయారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వరదలు వచ్చి 2నెలలే అయ్యిందని పేర్కొన్న పురంధరేశ్వరి కానీ మీరు వచ్చి 6నెలలు కావొస్తోందని జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాత విధానం రద్దు చేసి 5నెలలైనా కొత్త విధానం తీసుకురాలేదన్నారు. పీపీఏల రద్దు, రివర్స్‌ టెండరింగ్‌, ఇసుక సమస్యల కారణంగా.. అభివృద్ధిలో రాష్ట్రం తిరోగమనంలో ఉందని పురంధరేశ్వరి విమర్శించారు.

English summary
BJP organizes sand satyagraha in Vijayawada in Krishna district. The BJP-led Sand Satyagraha was held in protest of the sand crisis in the state. Purandareshwari, who participated in the sand satyagraha, blamed the government for the wrong policies on the sand. She said there had been flooding for the past two months but sand shortages from six months remained.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X