వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కు ఆ విషయంలో హితవు పలికిన పురంధరేశ్వరి ..

|
Google Oneindia TeluguNews

Recommended Video

జగన్ ఆ విషయంపై పదేపదే మాట్లాడటం కరెక్ట్ కాదు || Oneindia Telugu

బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఏపీ సీఎం వైయస్ జగన్ గురించి, అలాగే మాజీ సీఎం చంద్రబాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని ఆ మధ్య పేర్కొన్న ఆమె ఇప్పుడు జగన్ తీరుపై కాసింత అసహనంతో ఉన్నారు .దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నిర్ణయం మారదు అని తేల్చి చెప్పారు. అయినప్పటికీ జగన్ ఆ విషయంపై పదేపదే మాట్లాడటం కరెక్ట్ కాదని పేర్కొన్నారు.

<strong>అన్నా క్యాంటీన్లలో 150కోట్ల స్కామ్ అన్న విజయసాయి .. పేదల కడుపు మాడ్చే పైశాచిక ఆనందం మీదన్న బుద్దా</strong>అన్నా క్యాంటీన్లలో 150కోట్ల స్కామ్ అన్న విజయసాయి .. పేదల కడుపు మాడ్చే పైశాచిక ఆనందం మీదన్న బుద్దా

హోదా ముగిసిన అధ్యాయం .. పదేపదే మాట్లాడొద్దని జగన్ కు హితవు

హోదా ముగిసిన అధ్యాయం .. పదేపదే మాట్లాడొద్దని జగన్ కు హితవు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేసినా సీఎం జగన్ మాత్రం పదేపదే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారని అది సరైన పద్ధతి కాదని హితవు పలికారు . విభజన చట్టంలోని అంశాలను 90 శాతం కేంద్రం అమలు చేసిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇక ఈ విషయంలో చంద్రబాబు చేసిన తప్పుని ప్రస్తుత సీఎం జగన్ చేయకూడదు అని కేంద్ర మాజీ మంత్రి ,మహిళా మోర్చా జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి సూచించారు.

టీడీపీ చేసిన తప్పులే చేస్తున్న వైసీపీ .. రామయపట్నం పోర్ట్ కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపాలని సూచన

టీడీపీ చేసిన తప్పులే చేస్తున్న వైసీపీ .. రామయపట్నం పోర్ట్ కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపాలని సూచన

అయితే ఏపీని అన్ని విధాలుగా ఆదుకోవడానికి కేంద్రం సుముఖంగా ఉందని పేర్కొన్న ఆమె గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో అవే తప్పులు వైసీపీ ప్రభుత్వం కూడా చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ కూడా ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించలేకపోయిందని పేర్కొన్నారు. టీడీపీ అవినీతిని గ్రహించిన ప్రజలు ఎన్నికల్లో బుద్ది చెప్పారని ఎద్దేవా చేశారు. ఇక వైసీపీ కూడా అలాగే ఉంటె ప్రజలు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. దుగ్గరాజపట్నం పోర్ట్ కు బదులుగా రామయపట్నం పోర్ట్ ప్రతిపాదన కేంద్రం ముందు జగన్ ఉంచాలని , కేంద్రం జగన్ ప్రతిపాదిస్తే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఆమె పేర్కొన్నారు.

నదీ జలాల విషయంలో సీఎం జగన్ ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న పురంధరేశ్వరి

నదీ జలాల విషయంలో సీఎం జగన్ ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న పురంధరేశ్వరి

మరోవైపు ఇసుక పాలసీపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించకపోవడం వల్ల నిర్మాణ రంగం కుదేలైందన్నారు. భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు..మరోవైపు సీఎం కేసీఆర్ తో జగన్ స్నేహంపై పురందరేశ్వరి వ్యాఖ్యలు చేశారు.
గోదావరి జలాల విషయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు మాట్లాడుతున్నారని అయితే ఏపీ హక్కులకు భంగం కలగకుండా ఉండేవిధంగా నదీ జలాల పంపకాల విషయంలో సీఎం జగన్ జాగ్రత్తగా వ్యవహరించాలన్న ఆమె గోదావరి జలాలను తరలించే విషయంలో జగన్ ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

English summary
Purandhareshwari asserted that the state of Andhra Pradesh was not given special status. Former Union Minister of State for Women and Morcha National Leader Daggubati Purandhareshwari said that CM Jagan should not make Chandrababu's mistake in this regard. While Finance Minister Nirmala Sitharaman has made it clear that the state of Andhra Pradesh is not given special status, CM Jagan has repeatedly asking about the special status , that it is not the right approach. She said 90 per cent of the provisions of the Partition Act were implemented by the Center
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X