వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘ఈశ్వరి! జగన్‌కు ఎన్ని కోట్లిచ్చారు, బాబు వద్ద ఎన్నికోట్లు తీసుకున్నారు?’

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన గిడ్డి ఈశ్వరిపై వైసీపీ కురుపాం ఎమ్మెల్యే పుష్ఫ శ్రీవాణి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన గిడ్డి ఈశ్వరిపై వైసీపీ కురుపాం ఎమ్మెల్యే పుష్ఫ శ్రీవాణి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న గిరిజనుల అభివృద్ధి చూసే పార్టీ మారానని గిడ్డి ఈశ్వరి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

గతంలో బాక్సైట్‌ తవ్వకాల కోసమే అరకు ఎంపీ, ఎమ్మెల్యే పార్టీ మారారన్న గిడ్డి ఈశ్వరి... ఇప్పుడు ఆమె కూడా బాక్సైట్‌ తవ్వుకోవడానికే టీడీపీలోకి వెళ్లారా? అని నిలదీశారు.

టీడీపీలో చేరిన గిడ్డి ఈశ్వరి: జగన్‌పై సంచలనం, బాబు తల నరుకుతానని ఎందుకన్నానంటే..టీడీపీలో చేరిన గిడ్డి ఈశ్వరి: జగన్‌పై సంచలనం, బాబు తల నరుకుతానని ఎందుకన్నానంటే..

ఎన్ని కోట్లు తీసుకున్నారు?

ఎన్ని కోట్లు తీసుకున్నారు?

ఎన్నికోట్లు తీసుకుని పార్టీ మారారో గిడ్డి ఈశ్వరి సమాధానం చెప్పాలని పుష్ప శ్రీవాణి డిమాండ్‌ చేశారు. గిడ్డి ఈశ్వరికి ఆత్మాభిమానం ఉంటే తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అన్నారు.

జగన్‌కు ఎన్ని కోట్లిచ్చారు..?

జగన్‌కు ఎన్ని కోట్లిచ్చారు..?

‘2019 ఎన్నికల్లో అరకు, పాడేరులో మళ్లీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనే గెలుస్తుందని చెప్పడం మీ మాటల్లోనే విన్నాం. వైయస్‌ జగన్‌ ఎవరైతే కోట్లు ఇస్తారో వారికే సీట్లు కేటాయిస్తున్నారని ఇప్పుడు చెప్పడం దురదృష్టకరం. అలా అయితే మీరు ఎన్నికోట్లు ఇస్తే... 2014లో మీకు వైయస్‌ జగన్‌ సీటు ఇచ్చారో చెప్పాలి' అని నిలదీశారు.

నిన్నటి వరకు బాబును విమర్శించి..

నిన్నటి వరకు బాబును విమర్శించి..

‘నిన్న, మొన్నటివరకూ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని, చంద్రబాబు నాయుడును విమర్శించేవారు. గిరిజనులకు టీడీపీ సర్కార్‌ చేస్తున్న వ్యతిరేక విధానాలపై ప్రశ్నించిన మీరు.. మళ్లీ గిరిజనులకు చేస్తున్న అభివృద్ధి చూసి టీడీపీలో చేరుతున్నట్లు చెప్పడం హాస్యాస్పదం. ఆనాడు టీడీపీ నేతలు మా పార్టీకి వస్తే రూ.30కోట్లు ఇస్తామని చెప్పారన్న గిడ్డి ఈశ్వరి.. ఇప్పుడు ఎన్నికోట్లు ఇస్తే పార్టీ మారారో చెప్పాలి. వైయస్సార్సీపీలో ఆత్మాభిమానం లేదన్న మీరు... నిజంగా మీకు ఆత్మాభిమానం ఉంటే తక్షణమే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీ తరపున నిలబడి గెలవాలి' అని పుష్పశ్రీవాణి డిమాండ్‌ చేశారు.

కోట్లు తీసుకున్నారనే ఆరోపణలు

కోట్లు తీసుకున్నారనే ఆరోపణలు

వైయస్సార్సీపీ నేతగా ఎన్నికల్లో గెలిచిన గిడ్డి ఈశ్వరి... సోమవారం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అందుకోసం రూ.25కోట్లకు పైగా డీల్‌ కుదిరిందని ఆరోపణలు కూడా వచ్చాయి. రూ.10 కోట్లు అడ్వాన్సుగా అందించారని, మిగిలిన రూ.15 కోట్లు కమీషన్లు దక్కే పనుల రూపంలో అందించబోతున్నారని ఆరోపణలున్నాయి.

English summary
YSRCP MLA Pamula Pushpa Srivani on Monday fired at MLA Giddi Eswari for joining in TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X