• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి భారీ షాక్ -ఎస్టీ హోదాపై హైకోర్టు నోటీసులు -రాజీనామా చేయాలంటూ

|

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కుల ధృవీకరణ వివాదం అనూహ్య మలుపు తిరిగింది. విజయనగరం జిల్లా కురుపాం (ఎస్టీ) నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచిన ఆమె అసలు ఎస్టీ కాదని, పదవి నుంచి ఆమెను తొలగించే విషయమై ఎన్నికల సంఘం, గవర్నర్‌కు ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు అనూహ్యంగా స్పందించింది. డిప్యూటీ సీఎం సహా సంబంధిత ప్రభుత్వ యంత్రాంగం మొత్తానికీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పుష్పశ్రీవాణి పదవి నుంచి తప్పుకోవాల్సిందేనంటూ గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి..

జగన్‌పై అమిత్ షా యాక్షన్ -విదేశీ పర్యటనలు రద్దు -పవన్ చెప్పింది చేస్తా -తిరుపతిలో రీపోల్: ఎంపీ రఘురామజగన్‌పై అమిత్ షా యాక్షన్ -విదేశీ పర్యటనలు రద్దు -పవన్ చెప్పింది చేస్తా -తిరుపతిలో రీపోల్: ఎంపీ రఘురామ

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

కురుపాం (ఎస్టీ) నియోజకవర్గం నుంచి గెలిచి, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కొనసాగుతోన్న పుష్పశ్రీవాణి ఎస్టీ కాదని చాలా కాలంగా వివాదం నడుస్తోంది. పుష్ప శ్రీవాణి సోదరి రామతులసిని నాన్ ఎస్టీగా గుర్తిస్తూ ఆమెను ప్రభుత్వ ఉద్యోగం నుంచి కూడా తొలగించారు. అయితే సర్కారీ కొలువు నుంచి సోదరి తొలగింపు కులానికి సంబంధించిన వివాదం కాదని, నాన్ లోకల్ అంశమని, తాము ముమ్మాటికీ ఎస్టీలమే అని శ్రీవాణి వాదిస్తూ వచ్చారు. తాజాగా శ్రీవాణి ఎస్టీ హోదాపై ఓ రిటైర్డ్ టీచర్ మరో పిటిషన్ దాఖలు చేయగా, దానిని శుక్రవారం విచారించిన హైకోర్టు ప్రతివాదులందరికీ శనివారం నోటీసులు జారీ చేసింది.

ఆమె కొండదొర కానేకాదు..

ఆమె కొండదొర కానేకాదు..

పుష్పశ్రీవాణి ఎస్టీ అంటూ తహశీల్దార్‌ ఇచ్చిన కులధ్రువీకరణ పత్రం చెల్లదని ఓ రిటైర్డ్ అధ్యాపకురాలు వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పుష్పశ్రీవాణి ఎస్టీ (కొండదొర) అంటూ తహశీల్దార్‌ ఇచ్చిన కులధ్రువీకరణ పత్రం చెల్లదని, ఆర్డీవో, ఆపై స్థాయి అధికారి అధికారులు ఇచ్చిన కులధ్రువీకరణ పత్రం మాత్రమే చెల్లుబాటవుతుందని పిటిషన్ తరఫు న్యాయవాది వాదించారు. పదవికి ఆమె అనర్హతను తేల్చే విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గవర్నర్‌ ముఖ్య కార్యదర్శి అభిప్రాయం తీసుకోవలసిందిగా కోర్టును కోరారు.

అచ్చెన్నకు హోం శాఖ ఖరారు -పార్టీ మార్పుపై విజయసాయిరెడ్డి క్లారిటీ -గురుమూర్తి నిఖార్సైన హిందువుఅచ్చెన్నకు హోం శాఖ ఖరారు -పార్టీ మార్పుపై విజయసాయిరెడ్డి క్లారిటీ -గురుమూర్తి నిఖార్సైన హిందువు

చెల్లెలు ఎస్టీ కానప్పుడు అక్క ఎలా?

చెల్లెలు ఎస్టీ కానప్పుడు అక్క ఎలా?

పుష్ప శ్రీవాణి శాసనసభ్యత్వానికి అనర్హురాలిగా తేల్చే విషయంలో రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తించాలంటూ.. అఖిలభారత దళిత రైట్స్‌ ఫోరమ్‌ 2019 అక్టోబరు 4న గవర్నర్‌ వద్ద పిటిషన్‌ దాఖలు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్ తరఫు న్యాయవాది గుర్తుచేశారు. పుష్పశ్రీవాణి సోదరి రామతులసిని నాన్ ఎస్టీగా పేర్కొంటూ ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. సోదరి ఎస్టీ కానప్పుడు శ్రీవాణి మాత్రం ఆ హోదాను అనుభవించడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. కాగా,

టాప్ టు బాటమ్ నోటీసులు..

టాప్ టు బాటమ్ నోటీసులు..

పాముల పుష్పశ్రీవాణి పదవికి అనర్హతను తేల్చే విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గవర్నర్‌ ముఖ్య కార్యదర్శి అభిప్రాయం తీసుకోవలసిందిగా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. పుష్ప శ్రీవాణితో పాటూ ప్రతివాదులుగా ఉన్న ఉన్న అందరు అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్‌ ముఖ్యకార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం సెక్రటరీ జనరల్‌, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌, బుట్టాయిగూడెం తహశీల్దార్‌లు నోటీసులు అందుకున్న జాబితాలో ఉన్నారు. దీనిపై..

  Telangana : 2600 బీసి కులాల్లో.. 2550 కులాలు ఇంకా పార్లమెంట్ లో అడుగు పెట్టలేదు..
  డిప్యూటీ సీఎంను తొలగించాల్సిందే..

  డిప్యూటీ సీఎంను తొలగించాల్సిందే..

  కుల ధ్రువీకరణ విషయంలో హైకోర్టు నోటీసులు అందుకున్న ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణిని ఆ పదవి నుంచి తొలగించాలని ఏపీ గిరిజన సంఘం డిమాండ్‌ చేసింది. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స శనివారం పాడేరులో విలేకరులతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. పుష్పశ్రీవాణి చెల్లెలు రామతులసి ఎస్టీ కాదని నిర్ధారించి టీచర్‌ పోస్టు నుంచి తొలగించారని, చెల్లెలు ఎస్టీ కానప్పుడు అక్క ఎస్టీ ఎలా అవుతుందని అప్పలనర్స ప్రశ్నించారు. తాజా హైకోర్టు నోటీసులపై ఏపీ డిప్యూటీ సీఎం స్పందించాల్సి ఉంది.

  English summary
  The AP Tribal Association has demanded the removal of Deputy Chief Minister Pushpasrivani, who received high court notices on caste certification row. The AP High Court on Saturday served a notice on Deputy Chief Minister P Pushpasreevani following a petition filed against in the court challenging her claim that she belonged to the ST category.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X