హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ కంటే అడుగు ముందు: సింధుకు భారీ బాబు ఆఫర్, గోపీకి భూమి

|
Google Oneindia TeluguNews

విజయవాడ: రియో ఒలింపిక్స్‌లో సింధు విజయం నేపథ్యంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. విజయవాడలో సింధును, గోపీచంద్‌ను సత్కరించిన సీఎం చంద్రబాబు.. కేసీఆర్ కంటే ఓ అడుగు ముందుకేశారు.

సింధుకు రూ.3 కోట్లు, గ్రూప్ 1 ఉద్యోగం, అమరావతిలో వెయ్యి ఎకరాల భూమితో పాటు, కిడాంబి శ్రీకాంత్‌కు రూ.25 లక్షలు గ్రూప్ 2 ఉద్యోగం ప్రకటించారు. కోచ్ గోపీచంద్‌కు రూ.50 లక్షలతో పాటు ఏయూ నుంచి పీహెచ్‌డీ, అమరావతిలో అకాడమీకి స్పోర్ట్స్ సిటీలో 15 ఏకరాలు ఇస్తామన్నారు.

కిడాంబి శ్రీకాంత్‌కు నజరానా, స్పోర్ట్స్ సిటీలో భూమి ఇస్తామని చెప్పడం ద్వారా పైచేయి సాధించే ప్రయత్నమని చెప్పవచ్చు. అంతేకాకుండా, హైదరాబాదులో మంత్రి కేటీఆర్ పాల్గొనగా, విజయవాడ సన్మాన సభలో స్వయంగా చంద్రబాబు పాల్గొన్నారు.

సింధు కోసం ఏపీ ఇలా, తెలంగాణ అలా: అదే తేడా!

పీవీ సింధును, గోపిచంద్‌ను సన్మానించిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. 'తమ్ముళ్లు నేను చెబుతున్నా. అమరావతిలో ఒలింపిక్స్‌లో జరగాలి. అమరావతిని వన్ ఆఫ్ ది బెస్ట్ రాజధాని చేద్దాం. రియో ఒలింపిక్స్‌లో చిన్న చిన్న దేశాలు పతకాలు సాధిస్తుంటే, మనకు ఒక్క మెడల్ రాకుంటే దేశమంతా సింధు ఆడిన రోజు పూజలు చేసింది. రియోలో సింధు మనకు ఆశాకిరణంలా కనిపించింది.

పుష్కరాల్లో సంకల్పం

కృష్ణా పుష్కరాల్లోను సంకల్పం చేశాం. రజతం సాధించి తెలుగు బిడ్డ జాతి గౌరవాన్ని నిలబెట్టారు. గోపీచంద్‌కు కూడా చప్పట్లు కొట్టి అభినందించాల్సిన అవసరముంది. సింధు తల్లిదండ్రులు రమణ, విజయలను కూడా అభినందిస్తున్నా.

వారి ప్రోత్సాహం లేకుంటే సింధు ఇంత బాగా ఆడేది కాదు. వారు పూర్తిగా సహకరించారు. కష్టపడ్డారు. వారి శక్తి, సామర్థ్యాలను బయటకు తీసుకు వచ్చేందుకు అనునిత్యం కృషి చేశారు. ఈ రోజు ముఖ్యమంత్రిగా, మామూలుగా ప్రోటోకాల్ పక్కన పెట్టి ఆమెను రిసీవ్ చేసుకున్నాను.

ఎందుకంటే మీ అందరికీ స్ఫూర్తినిచ్చేందుకు ఇలా చేశాను. 2000 సంవత్సరంలో మల్లీశ్వరికి కాంస్యం వచ్చింది. అప్పుడు తాను మీటింగ్ పెట్టి సన్మానించాను. ఆ రోజు గోపీచంద్ ఎదురుగా కూర్చున్నారు. ఆయన దానిని స్ఫూర్తిగా తీసుకున్నారు.

ఆ తర్వాత ఆల్ ఇండియా ఛాంపియన్ షిప్ గోల్గ్ గెలిచారు. ఆయనను సన్మానించాను. ఆ తర్వాత సానియా మీర్జాను సన్మానించాను. క్రీడలను ప్రోత్సహించేందుకు తాను రివార్డులు ఇవ్వడమే కాదు, సన్మానించాను. చాలామంది క్రికెట్టే పాపులర్ గేమ్ అనుకుంటారు.

క్రికెట్టే కాదు

క్రికెట్టే కాదు అన్ని గేమ్‌లు కావాలి. హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేశాను. నేను గోపీ తల్లికి కూడా చెప్పాను. మీ నాలెడ్జ్‌ను పది మందికి ఇప్పించాలని విజ్ఞప్తి చేశాను. ఆమె అంగీకరించింది. తాను ఐదెకరాల భూమిని ఇచ్చాను.

ఇప్పుడు ప్రపంచంలో భారత దేశ ప్రతిష్ట పెంచింది. ఇందుకు నేను ఎంతో గర్విస్తున్నా. ఓ విత్తనం వేశాం. బ్రహ్మాండంగా పెరిగి మంచి ఫలితాలు ఇస్తుంది. గోపీచంద్ నిరంతర శ్రమ చేస్తారు. ఆశయ సాధన కోసం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం కష్టపడే వ్యక్తి.

ఆ రోజు మీరు ఒకసారి చూస్తే నేను నేషనల్ గేమ్స్ చేశాను. ఏషియన్ గేమ్స్ పెట్టాను. కామన్వెల్త్ గేమ్స్ వచ్చాయి. నేను ఈ రోజు చెప్పడం లేదు. 2000 సంవత్సరంలోనే చెప్పాను. మన దేశంలో ఒలింపిక్స్ నిర్వహించాలని చెప్పాను. ఇప్పటి నుంచే ఒలింపిక్స్‌కు బిడ్ ఇవ్వాలన్నారు.

ఒలింపిక్స్ ప్లేయర్లను తయారు చేద్దాం

మనం ఒలింపిక్స్ ప్లేయర్లను తయారు చేయాలన్నారు. మంచి మౌలిక సదుపాయాలు కల్పిస్తే చైనా, అమెరికా కంటే మంచిగా ఆడే వాళ్లు మన వద్ద ఉన్నారు. గోపీచంద్‌లా అనుభవం ఉంటే అకాడమీ పెట్టడమే కాదు. అలా ప్రతిష్ట తీసుకు రావాలి.

చాలామంది బాగా ఆడి జాతీయ, అంతర్జాతీయ మెడల్స్ సాధించినా, ఆర్థిక ఇబ్బందులతో క్రీడలకు దూరమయ్యే పరిస్థితి ఉంది. ఇటీవల ప్రపంచం మొత్తం అధ్యయనం చేశాక.. గోపీచంద్ ఓ లక్ష్యంతో వచ్చారు. ఆనందంగా పని చేస్తే అలసట ఉండదు. పని చేయాలి కాబట్టి చేస్తే అన్ని బాధలు వస్తాయి.

క్రీడలు మన జీవితంలో భాగం కావాలి. సింధు తల్లిదండ్రులు రమణ, విజయలను అభినందిస్తన్నా. ఇద్దరు వాలీబాల్ ప్లేయర్లు. వారిద్దరు కూడా సింధును ప్రోత్సహించారు. 2029కి రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్టేట్‌గా ఇండియాలో ఉండాలి. ఒక సంపదలోనే కాదు, పేదరిక నిర్మూలనలోనే కాదు.. ఆనందంలో ఉండాలి.

కృష్ణా పుష్కరాలకు వచ్చినప్పుడు నేను చూస్తే.. అందరూ ఆనందంగా ఉన్నారు. మేం పుష్కరాలకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ రోజు కృష్ణా జిల్లాలో పాఠశాలలకు సెలవులిచ్చాం. మీరంతా సింధులా, గోపిచంద్‌లా తయారు కావాలి. కృష్ణా పుష్కరాల సాక్షిగా మనం సంకల్పం తీసుకోవాలి.

సింధుకు భారీ బాబు ఆఫర్, గోపీకి భూమి

సింధుకు భారీ బాబు ఆఫర్, గోపీకి భూమి

ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టాం. ఇప్పుడు అమరావతిని పెడతాం. అమరావతిలో మార్పు వచ్చిందా లేదా అడుగుతున్నా... (సభకు హాజరైన వారు మార్పు వచ్చిందన్నారు.). ఇంకా బ్రహ్మాండమైన కార్యక్రమాలకు నాంది పలుకుతామన్నారు.

సింధుకు భారీ బాబు ఆఫర్, గోపీకి భూమి

సింధుకు భారీ బాబు ఆఫర్, గోపీకి భూమి

కృష్ణా పుష్కరాల సమయంలో పవిత్ర హారతి ఇచ్చిన తర్వాత మనం ప్రార్థనలు చేశాం. ఈ సంవత్సరమే సింధుకు గోల్డ్ రావాల్సింది. తొలి గేమ్ గెలిచాక సంతోషించాం. రెండు, మూడు కోల్పోయింది. అయినా ఏం ఫరవాలేదు. ఆమెకు మంచి భవిష్యత్తు ఉంది.

సింధుకు భారీ బాబు ఆఫర్, గోపీకి భూమి

సింధుకు భారీ బాబు ఆఫర్, గోపీకి భూమి

ఆమెకు రూ.3 కోట్లు ఇస్తున్నాం. అమరావతిలో వెయ్యి ఎకరాల భూమి ఇస్తున్నాం. గ్రూప్ 1 పదవి కూడా ఆఫర్ చేశాను. భారత దేశం గర్వపడేలా సింధు ఏం చేయాలన్నా నేను పూర్తిగా సహకరిస్తా. భగవంతుడు చల్లగా చూడాలని మీరూ కూడా ఆశీర్వదించండి.

సింధుకు భారీ బాబు ఆఫర్, గోపీకి భూమి

సింధుకు భారీ బాబు ఆఫర్, గోపీకి భూమి

సింధు ఆణిముత్యం, ఓ డైమండ్. ఇలాంటి పిల్లలను ప్రోత్సహించాల్సిన అవసరముంది. ఇంతకుముందు పిల్లలు ఎంత బాగా డ్యాన్స్ చేశారు. మట్టిలో మాణిక్యాలు ఉన్నారు. ఎక్కడ మెరిట్ ఉంటే అక్కడ ప్రోత్సహిస్తా. మన భారత దేశ పరువు కాపాడిన మన బిడ్డ సింధు.

సింధుకు భారీ బాబు ఆఫర్, గోపీకి భూమి

సింధుకు భారీ బాబు ఆఫర్, గోపీకి భూమి

గోపీచంద్‌కు రూ.50 లక్షలు ప్రకటించాం. రాజధానిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ వరల్డ్ క్లాస్ అకాడమీ ఏర్పాటు చేయాలి. అందుకోసం పదిహేను ఎకరాలను ఇస్తున్నాం. గోపీచంద్‌కు ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ ఇవ్వాలని నిర్ణయించారు.

సింధుకు భారీ బాబు ఆఫర్, గోపీకి భూమి

సింధుకు భారీ బాబు ఆఫర్, గోపీకి భూమి

కిదాంబి శ్రీకాంత్‌కు రూ.25 లక్షలు ఇస్తున్నాం. అంతేకాదు గ్రూప్ 2 ఉద్యోగం ఇస్తున్నాం. ఎంత ఆర్థిక సాయమైనా చేస్తాం. మరో అమ్మాయి కూడా ఒలింపిక్స్‌కు వెళ్లింది. ఆమెకు కూడా ఉద్యోగం ఇస్తాం. సాయం చేస్తాం. సింధు, గోపిచంద్ కలిస్తే సిల్వర్ మెడల్ వచ్చింది. భారత దేశం గర్వించింది.

సింధుకు భారీ బాబు ఆఫర్, గోపీకి భూమి

సింధుకు భారీ బాబు ఆఫర్, గోపీకి భూమి

గోల్డ్ వస్తే చరిత్ర తిరగరాసేది. ఇప్పటికైనా తిరగరాశాం. భవిష్యత్తులో తిరగరాస్తాం. నాకు ఎప్పుడూ ఆనందంగా ఉంది. మనం చేసే పనికి ఫలితం వస్తే సంతోషంగా ఉంది. నాడు నేను చేసిన పనికి ఫలితం వచ్చింది కాబట్టి సంతోషంగా ఉంది. (హైదరాబాదులో గోపీచంద్ అకాడమీకి భూమి ఇవ్వడం).

సింధుకు భారీ బాబు ఆఫర్, గోపీకి భూమి

సింధుకు భారీ బాబు ఆఫర్, గోపీకి భూమి

అమరావతిలో చేసే పనికి కూడా భవిష్యత్తులో ఫలితం వస్తుంది. అమరావతి క్రీడల కేంద్రం అవుతుందన్నారు. భారతదేశం గర్వపడేలా మనం కార్యక్రమం చేపడతాం. అమరావతిలోని తొమ్మిది సిటీల్లో ఒక సిటీ స్పోర్ట్స్ సిటీ. అందరికీ చదువు పైన శ్రద్ధ ఉండాలి. ఆటల పైన శ్రద్ధ ఉంటే మరింత ఎక్కువ చదువు వస్తుంది. ఆడుకుంటే చదువు పైన ఆసక్తి పెరుగుతుంది. ఈ రెండు కలిసి పని చేయాలి. మీరే ఈ దేశానికి ఆశాజ్యోతులు.

సింధుకు భారీ బాబు ఆఫర్, గోపీకి భూమి

సింధుకు భారీ బాబు ఆఫర్, గోపీకి భూమి

ఎన్టీఆర్, నేను, గోపీచంద్.. ఇలా అందరం చిన్న వారిగా పుట్టాం. అవార్డులు తెచ్చే వారికి, శ్రమించే వారికి నేను కచ్చితంగా సహకరిస్తా. విజయం రావాలంటే ఇలాంటి ఈవెంట్లలో (ఒలింపిక్స్, కామన్వెల్త్) పాల్గొనాలి. అప్పుడే మన ప్రతిభ బయటకు వస్తుంది. అలాంటి గుర్తింపు కావాలి.' అన్నారు.

English summary
PV Sindhu in Andhra Pradesh after Telangana celebration, felicitated by AP CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X