వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా చెయ్.. లేక పోతే నీ బాస్ లాగే నువ్వు కూడా డాష్ నాకిపోతావ్..! కేశినేని నానిని దులిపేసిన పీవీపి..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : విజయవాడ రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా కొనసాగుతుంటాయి. ఆరోపణలు. ప్రత్యారోణలు, వ్యక్తిగత కామెంట్లు, వివాదాస్పద వ్యాఖ్యలు, తాజాగా ట్విట్టర్ సందేశాలతో రాజకీయాలు తారా స్థాయిలో నడుస్తుంటాయి. నిన్నటి వరకు తన పర బేదం లేకుండా రెచ్చిపోయిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రస్తుతం ప్రత్యర్థుల దూషణలకు గురౌతున్నారు. ఎరక్క పోయి ఇరుక్కున్న చందంగా తయారయ్యింది నాని పరిస్థితి. నానిని టార్గాట్ చేస్తూ పొట్లూరి వర ప్రసాద్ ట్విట్టర్ లో దారుణంగా స్పందించారు. ఇంతకు ముందు నాని సొంత పార్టీ నేతలపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యల్లో కూడా తల దూర్చి నానిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసారు. తాజాగా మరో వివాదాన్ని ఎత్తి చూపుతూ నాని మీద ఫైర్ అయ్యారు పీవీపి అలియాస్ పొట్లూరి వరప్రసాద్.

నాని పీవీపిల మద్య టీట్ల యుద్దం..! డోస్ పెంచిన పొట్లూరి..!!

నాని పీవీపిల మద్య టీట్ల యుద్దం..! డోస్ పెంచిన పొట్లూరి..!!

తనకు ఒక క‌న్ను పోతే ప‌క్కోడికి రెండు క‌ళ్లు పోవాల‌ని కోరుకునే స‌మాజం నడుస్తోంది. అదే రాజ‌కీయాల్లో అయితే ఇది మ‌రీ తారాస్థాయికి చేరుతుంది. పైగా విజ‌య‌వాడ వంటి చోట నేత‌ల మ‌ధ్య వైరం ఎంత‌కైనా తెగించేలా దారితీస్తుంది. నాటి వంగ‌వీటి నుంచి నేటి పొట్లూరి వరప్రసాద్ అలియాస్ పీవీపి వ‌ర‌కూ అంద‌రూ అదే కోవలోకి వస్తారని తెలుస్తోంది. తాజాగా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని వ‌ర్సెస్ పొట్లూరి వ‌ర‌ప్ర‌సాద్ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి కాదు, అస‌లు ఏగ‌డ్డీ లేకుండానే భ‌గ్గుమంటోంది. రాజ‌కీయాల్లోకి రాక‌ముందు మూడు బ‌స్సులు. ఆరు టెంపోలుగా సాగిన నాని ప‌దేళ్ల రాజ‌కీయాల్లో ఎన్నో అనుభవాలను తెలసుకోగలిగారు.అందులో భాగంగానే సొంత పార్టీ నేతలపై ఒంటి కాలితో విమర్శలకు దిగుతుంటారనే చర్చ కూడా జరుగుతుంది.

 నిన్నటి వరకూ వైలెంట్ గా ఉన్న నాని..! అనూహ్యంగా సైలెంట్ ఐపోయిన ఎంపీ..!!

నిన్నటి వరకూ వైలెంట్ గా ఉన్న నాని..! అనూహ్యంగా సైలెంట్ ఐపోయిన ఎంపీ..!!

బిజినెస్ మేన్ గా ఎంత విజ‌యం సాధించారో రాజ‌కీయాల్లో అన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు కేశినేని నాని. టీడీపీ, బీజేపీ దోస్తీగా ఉన్న ఐదేళ్ల కాలంలో కొత్త క‌ష్టాలు తెచ్చుకున్నాడు. ర‌వాణాశాఖ అధికారుల‌తో గొడ‌వ‌.. ఇటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ విమ‌ర్శ‌లు.. ప్ర‌త్యేక‌హోదాపై పోరు.. చివ‌ర‌కు సొంత పార్టీ నేతల నుంచే ఎదురైన ఇబ్బందులు భ‌రించ‌లేక చివ‌ర‌కు కేశినేని ట్రావెల్స్‌ను మూసివేయాల్సిన పరిస్థితులు తలెత్తినట్టు ప్రచారం జరిగింది. ఆ త‌ర్వాత తన రాజకీయ జీవితం సజావుగా ఉందా అంటే అదీ లేదు. రెండోసారి విజ‌య‌వాడ పార్ల‌మెంట‌రీ ప‌రిధిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థులంతా ఓడినా తాను మాత్రం ఎంపీగా నెగ్గారు. ఆ స‌మ‌యంలో కాస్త నోరు జారి పొర‌పాటు చేశారు. అది ఆయ‌న పాలిట శాపంగా మారి టీడీపీ, వైసీపీ నేత‌ల‌కు ముఖ్యంగా ఆయ‌న ప్ర‌త్య‌ర్థుల‌కు అస్త్రంగా త‌యారైంది.

 నాని పై ఘోరమైన తిట్లు..! దెబ్బతింటావంటూ ట్వీట్లు..!!

నాని పై ఘోరమైన తిట్లు..! దెబ్బతింటావంటూ ట్వీట్లు..!!

ఇప్పుడు కేశినేని ట్రావెల్స్ ఉద్యోగులు త‌మ పాత బ‌కాయిల కోసం ఏకంగా నిర‌స‌న‌కు దిగారు. ఇదిలా ఉంటే.. అగ్గికి ఆజ్యం పోసినట్టుగా నాని చేతిలో ఓడిన పొట్లూరి సోష‌ల్ మీడియా వేదిక‌గా సెటైర్లు వేస్తూ మ‌రింత మాన‌సిక వేద‌న‌కు గురిచేస్తున్నారు. సుజ‌నా దారిలో తాను కూడా క‌మ‌లంలోకి చేర‌దామ‌నుకున్నా.. అదంతా బాబు ప్లాన్‌గా చెబుతూ పీవీపీ సెటైర్ వేసారు. దీంతో ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో, మరోటి ఆలోచించారో తెలియదు గాని నాని సైలెంట్ అయిపోయారు. ఆ త‌రువాత రాజ‌కీయాలు వ్యాపారం కాదంటూ మ‌రో కామెంట్ పెట్టారు.

 మోదాదు పెంచిన పీవీపి..! నాశనమై పోతావని మండిపాటు..!!

మోదాదు పెంచిన పీవీపి..! నాశనమై పోతావని మండిపాటు..!!

తాజాగా కేశినేని ఉద్యోగుల ఆందోళ‌న‌పై స్పందించిన పీవీపీ, నానిపై ఘాటుగానే స్పందించారు. క‌సాయి వాడికి గొర్రె మీద ఉన్న ప్రేమ కూడా నీకు నీ ద‌గ్గ‌ర ప‌నిచేసే కార్మికుల మీద లేదే? వేలాది మంది పొట్ట‌కొట్టి ఈ రోజు నువ్వు అంద‌ల‌మెక్కి కూర్చున్నావు. క‌డుపుకాలి, ఆ క‌డుపు మంట‌తో రోడ్డెక్కిన ఆ వేలాది కుటుంబాల‌ను మ‌న‌సుంటే ఆదుకో, లేదంటే సంక నాకిపోతావ్.. నీ బాస్ లాగా.. అంటూ ట్వీట్ట‌ర్ లో పీవీపీ మ‌రింత‌గా చెల‌రేగాడు. ఇంత జరుగుతున్నా, పీవీపి హద్దూ అదుపూ లేకుండా ట్వీట్లు పారేసుకుంటున్నా ఇంతవరకునాని స్పందిచక పోదడం గమనార్హం.

English summary
Potluri Vara Prasad reacted brutally on Twitter by targeting Kesineni Nani. Earlier, Nani's own comments to his own party leaders were also attempted to scold Nani. PVP alias Potluri Varaprasad has recently come under fire for pointing out another controversy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X