వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు మహిళా సీఎంను చూడాలనుంది.. పీవీపీ ట్వీట్: ఆసక్తికర చర్చ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Evening News Express : 3 Minutes 10 Headlines | Coronavirus | YCP MLA Roja Slams Chandrababu

ఇప్పుడు ఏపీలో పీవీపీ చేసిన ఒక ట్వీట్ సంచలనం రేపుతుంది .ఆసక్త్జికర చర్చకు కారణం అవుతుంది . సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, వ్యాపారవేత్త పొట్లూరి ప్రసాద్ తాజాగా చేసిన ఒక ట్వీట్ తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో పెను దుమారమే రేపింది. ఆయన చేసిన ట్వీట్ వైసీపీని ఉద్దేశించే అని చర్చ జరుగుతున్న తరుణంలో ఆయన ఆ ట్వీట్ డిలీట్ చేసినా సరే దానిపై రచ్చ మాత్రం ఆగటం లేదు.

భారత సైన్యంలో కమాండింగ్ రోల్స్ లో మహిళలకు స్థానం ఇవ్వటంతో పీవీపీ ట్వీట్

భారత సైన్యంలో కమాండింగ్ రోల్స్ లో మహిళలకు స్థానం ఇవ్వటంతో పీవీపీ ట్వీట్

అసలు ఇంతకీ పీవీపీ ఏం చేశారంటే భారత సైన్యంలో కమాండింగ్ రోల్స్ లో మహిళలకు స్థానం ఇవ్వాలని సుప్రీం ధర్మాసనం చెప్పిన నేపధ్యంలో తాజాగా పీవీపీ చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారులకు కూడా శాశ్వత కమిషన్, కమాండింగ్ రోల్స్ ఇవ్వాల్సిందేనని, దానిపై ఉన్న నిషేధం ఎత్తివేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పురుషులతో సమానంగా మహిళలకు స్థానం కల్పించాలని సుప్రీం చెప్పిన నేపధ్యంలో పీవీపీ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ ఆయనకు తలనొప్పి తెచ్చింది.

తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలని ట్వీట్ చేసిన పీవీపీ

తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలని ట్వీట్ చేసిన పీవీపీ

తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలనుకుంటున్నట్టు ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు పీవీపీ. ఏపీలో ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక ఈ సమయంలో మహిళా ముఖ్యమంత్రిని చూడాలని ట్వీట్ చెయ్యటం ఆసక్తిని రేకెత్తించింది. నిన్న ఉదయం ట్వీట్ చేసిన పీవీపీ తాను చేసే ట్వీట్ తర్వాత పరిణామాలు ఊహించలేదు . తన మనసుకు నచ్చిన అంశాన్ని ట్వీట్ ద్వారా వ్యక్తం చేశారు .

పీవీపీ ట్వీట్ సారాంశం ఇదే

పీవీపీ ట్వీట్ సారాంశం ఇదే

"బూజుపట్టిన సంప్రదాయాలకు తెరదించుతూ, మగ ఆఫీసర్స్ ఆడవారి ఆర్డర్లను తీసుకోరు అన్న ప్రభుత్వం వాదనని పక్కనపెట్టి, కొత్త శకానికి నాంది పలికిన సుప్రీం కోర్ట్. ఆనాడు, అన్న ఎన్టీఆర్‌ గారు, ఆడవారికి సమాన ఆస్తిహక్కులు కల్పించి మన తెలుగు కుటుంబాల ఉదారతను ప్రపంచానికి తెలియచేసారు. అదే స్ఫూర్తితో మన తెలుగువారు కూడా, మన ఆడపడుచులను గౌరవిస్తూ, తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నాను. అవకాశాల్లో సగం, ఆస్తిలో సగం, ప్రజా ప్రతినిధులలో సగం, ప్రభుత్వంలో సగం.'' అంటూ ట్వీట్ చేశారు పీవీపీ.

కాసేపటికే ట్వీట్ డిలీట్ చేసిన పీవీపీ

కాసేపటికే ట్వీట్ డిలీట్ చేసిన పీవీపీ

అయితే, ఆయన ఉద్దేశం మహిళలకు రాష్ట్రాల పాలనలో అత్యున్నత స్థానం ఇవ్వాలనే భావన అయినా ఇప్పటికే ఏపీలో వైసీపీ నుండి జగన్ సీఎం గా ఉన్నారు. తమ అధినేత సీఎంగా ఉండగా అసలు పీవీపీ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్న ఆ మహిళా నేత ఎవరు? అనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది. ఇక ఇది ఒక వివాదంగా మారుతుందేమో అని ఆయన తన ట్వీట్‌ను కాసేపటికే డిలీట్ చేశారు .

వైరల్ అయిన పీవీపీ ట్వీట్.. మహిళా సీఎంపై ఆసక్తికర చర్చ

వైరల్ అయిన పీవీపీ ట్వీట్.. మహిళా సీఎంపై ఆసక్తికర చర్చ

ఇక సోషల్ మీడియాలో అప్పటికే పీపీవీ చేసిన ట్వీట్ షేర్ చెయ్యటం , స్క్రీన్ షాట్ తీసుకోవటం , వైరల చెయ్యటం జరిగిపోయాయి. మరోవైపు జగన్ పై సీబీఐ దర్యాప్తులో వేగం పెరుగుతుంది. జగన్ కు శిక్ష పడుతుంది అని ఒక పక్క ప్రచారం జరుగుతున్న తరుణంలో మహిళా సీఎం కావాలని ఆయన ట్వీట్ చెయ్యటం తో ఆ మహిళా సీఎం వైఎస్ భారతి నా ? వైఎస్ షర్మిలనా ? లేదా వైఎస్ విజయమ్మనా అన్న సందేహాలు నెలకొన్నాయి.

English summary
Now a tweet sensation made by PVP in AP . A recent tweet by YSR Congress Party leader and businessman Potluri VaraPrasad, who has always been active on social media, has been the worst in the wake of the latest political developments. His tweet that he was looking for a female CM was not meant to be YCP, but it is going to be controversy and everybody discussing on this he deleted the tweet but he didn't stop the deabte .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X