అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు ఇంటి వద్ద కొండచిలువ కలకలం: గుర్తించిన భద్రతా సిబ్బంది..

చంద్రబాబు నివాసానికి సమీపంలోని కరకట్టకు ఇరువైపులా తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ కొండచిలువను అధికారులు గుర్తించారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి ఇంటి వద్ద ఓ భారీ కొండచిలువ కలకలం రేపింది. రోజు లాగే భద్రత అధికారులు ఈరోజు ఆయన ఇంటి వద్ద ఉన్న మార్గం గుండా తనిఖీలు నిర్వహిస్తుండగా కొండచిలువ వారి కంటపడింది.

చంద్రబాబు నివాసానికి సమీపంలోని కరకట్టకు ఇరువైపులా తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ కొండచిలువను అధికారులు గుర్తించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ సిబ్బంది ఆ కొండచిలువను పట్టుకుని, మంగళగిరిలోని కొండ ప్రాంతంలో వదిలివేశారు.

Python found at CM Chandrababu house premises

కొండచిలువ దాదాపు ఆరడుగల పొడుగు ఉన్నట్లు గుర్తించారు. కాగా, ఇదే మార్గంలో 10అడుగుల పొడవున్న మరో కొండచిలువ సంచరిస్తున్నట్లు స్థానికులు చెప్పారు. ఇదిలా ఉంటే, సీఎం చంద్రబాబుకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉండటంతో ఆయన ప్రయాణించే మార్గంలో ప్రతీ రోజు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తుంటారు.

English summary
On this morning, a six feet python was found by security officials at CM Chandrababu Naidu house premises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X