అంతా డొల్లే: లోపమెక్కడ? వర్షమొస్తే అసెంబ్లీ ఇంతేనా!(ఫోటోలు)

మంత్రి నారాయణ స్వీయ పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న ఈ భవనాలు.. అంతా లోపభూయిష్టమే అన్న విమర్శలు మూటగట్టుకుంటున్నాయి.

అమరావతి: ఆర్భాటంగా మొదలుపెట్టి.. త్వరతిగతిన పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో డొల్లతనం బయటపడుతోంది. తక్కువ కాలంలో నిర్మించారన్న మాటే గానీ నాణ్యత విషయంలో శ్రద్ద పెట్టలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం నాడు కురిసిన వర్షం సచివాలయ, అసెంబ్లీ భవనాల్లోని లోపాలను ఎత్తి చూపింది.

చిన్నపాటి వర్షానికే భవనాల పైకప్పులు డ్యామేజ్ అయితే.. ఇక వర్షాకాలంలో పరిస్థితేంటని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. వర్షపు నీటిని ఎత్తిపారబోయడానికి సిబ్బంది శ్రమిస్తున్న తీరు.. భవనాల పైకప్పుల నుంచి వర్షపు నీరు లీకేజీ అవుతున్న ఫోటోలు బయటకు రావడంతో.. చంద్రబాబు ప్రభుత్వం ప్రజా ధనాన్ని వృథా చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బడా కంపెనీలకు దోచిపెట్టడమే:

బడా కంపెనీలకు దోచిపెట్టడమే:

అసలు తాత్కాళిక భవనాలు నిర్మించడం పైనే చాలా అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ.. సీఎం చంద్రబాబు మాత్రం ఎవరి మాట వినలేదు. తీరా ఇప్పుడా భవనాల్లో డొల్ల బయటపడేసరికి.. ఈ తాత్కాళిక భవనాలు ఎందుకు నిర్మించినట్లు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. నాణ్యత విషయంలో జాగ్రత్త వహించకుండా.. కేవలం బడా కంపెనీలకు దోచిపెట్టే తరహాలో ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు.

ఊడిపోయిన సీలింగులు:

ఊడిపోయిన సీలింగులు:

మంగళవారం కురిసిన వర్షానికి అసెంబ్లీలోని పలు ఛాంబర్స్ లో సీలింగ్స్ ఊడిపోయాయి. ప్రతిపక్ష అధినేత ఛాంబర్ లో అయితే సీలింగ్ నుంచి వర్షం ధారాళంగా కురిసింది. సోఫాలు తడిసిపోయి, రూఫ్ లైట్లు పాడైపోయాయి. మంత్రి నారాయణ స్వీయ పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న ఈ భవనాలు.. అంతా లోపభూయిష్టమే అన్న విమర్శలు మూటగట్టుకుంటున్నాయి.

ఇరుకైన ఛాంబర్స్:

ఇరుకైన ఛాంబర్స్:

అసెంబ్లీలో ఛాంబర్స్ ఇరుగ్గా ఉన్నాయని, బాత్రూమ్స్ కూడా సరైన రీతిలో లేవని ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజా వర్షానికి భవనాల్లోని డొల్ల బయటపడటంతో సీఆర్డీయే అధికారులపూ కూడా విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీ, సచివాయ భవనాల్లోకి మీడియాను అనుమతించకపోవడం పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి. పరిస్థితి తీవ్రంగా ఉండటం వల్లే మీడియాను అడ్డుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది.

వైసీపీ నేతలే వీడియోలు తీసి:

వైసీపీ నేతలే వీడియోలు తీసి:

జగన్ ఛాంబర్‌కు వెళ్లే దారంతా నీటితో నిండిపోయింది. అటు ఛాంబర్ లో నుంచి లీకైన నీరంతా ఇటే రావడంతో.. ఎత్తిపోయడానికి ఇబ్బందులు తప్పలేదు. ఇందుకోసం సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. అయితే మీడియాను లోపలికి అనుమతించకపోవడంతో.. వైసీపీ నేతలే మీడియాకు వీడియోలు పంపించారు.

ఏసీ ప్లాంటు రిపేర్ వల్లే!:

ఏసీ ప్లాంటు రిపేర్ వల్లే!:

సీఎం ప్రవేశించే గేటు వద్ద ఉన్న చిన్న భవనంపై నీళ్లు నిలిచిన భాగం వరకూ ఉన్న ప్రాంతాన్ని బద్దలుకొట్టి, నీటి ఉధృతిని తగ్గించగలిగారు.ఇటీవల ఏసి ప్లాంటు రిపేరు కావడంతో దాన్ని మరమ్మతులు చేసే సందర్భంలో పటిష్ఠమైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని సీఆర్డీఏ అధికారులు చెప్పారు. ఏసీ పైప్ లైన్ల రిపేర్ వల్లే జగన్ ఛాంబర్ లోకి నీళ్లు వచ్చాయన్నారు. ఏసీ ప్లాంటు రిపేరు కావడంతో.. మరమ్మత్తుల్లో పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+