వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమ్మగడ్డ వ్యవహారంలో అనూహ్య ట్విస్ట్: హైకోర్టు తీర్పుపై హైకోర్టులోనే ఛాలెంజ్: కోవారెంట్

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం.. ఓ అనూహ్య మలుపు తీసుకుంది. ఆయనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునర్నియమించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఒకవంక జగన్ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. మరోవంక- నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు వ్యతిరేకంగా హైకోర్టులోనే ఓ పిటీషన్ దాఖలైంది. ఆయన నియామకాన్ని రద్దు చేయాలంటూ కోవారెంట్ పిటీషన్ దాఖలైంది. హైకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది.

హైదరాబాద్‌ను వీడనున్న చంద్రబాబు: ఏపీలో బిజీ షెడ్యూల్..అమరావతికి: పర్మిషన్ కోసం డీజీపీకిహైదరాబాద్‌ను వీడనున్న చంద్రబాబు: ఏపీలో బిజీ షెడ్యూల్..అమరావతికి: పర్మిషన్ కోసం డీజీపీకి

మంత్రివర్గ సిఫారసులే ఆధారంగా..

మంత్రివర్గ సిఫారసులే ఆధారంగా..

గుంటూరు జిల్లా ఉప్పలపాడుకు చెందిన శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో ఈ కోవారెంట్ పిటీషన్‌‌ను దాఖలు చేశారు. రమేష్‌కుమార్ వ్యవహారంలో ఇదివరకు హైకోర్టు ఇచ్చిన తీర్పులో కొన్ని సాంకేతిపరమైన లోపాలు ఉన్నాయని, దాన్ని ఆధారంగా చేసుకుని చూస్తే- హైకోర్టు ఆదేశాలను పునఃసమీక్షించాల్సి ఉంటుందని ఆయన తన పిటీషన్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గం చేసిన సిఫారసులను ఆధారంగా చేసుకుని శ్రీకాంత్ రెడ్డి ఈ పిటీషన్ దాఖలు చేశారని అంటున్నారు.

 చంద్రబాబు మంత్రివర్గాన్ని ప్రముఖంగా

చంద్రబాబు మంత్రివర్గాన్ని ప్రముఖంగా

నిజానికి- నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను రాాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని 2016లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని మంత్రివర్గం గవర్నర్‌కు సిఫారసు చేసింది. దీని ఆధారంగా రమేష్‌కుమార్ ఎన్నికల కమిషనర్‌గా నియమితులు అయ్యారు. బాధ్యతలను స్వీకరించిన తేదీ నుంచి అయిదేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారు. ఎన్నికల కమిషన్ అనేది చట్టబద్ధత గల స్వతంత్ర సంస్థ.

మంత్రివర్గ సిఫారసును తప్పుపట్టిన హైకోర్టు..

మంత్రివర్గ సిఫారసును తప్పుపట్టిన హైకోర్టు..

తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్లో రమేష్‌కుమార్‌ను తప్పించి, మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్‌ను నియమిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని మంత్రివర్గం గవర్నర్‌కు సిఫారసు చేసింది. దాన్ని ఆర్డినెన్స్ రూపంలో అమల్లోకి తీసుకొచ్చారు గవర్నర్. ఆర్డెనెన్స్‌ను జారీ చేయగల అధికారం రాజ్యంగబద్ధంగా గవర్నర్‌కు ఉంది. దాన్ని వినియోగించుకుని గవర్నర్ ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించాన్ని ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు.

హైకోర్టు తీర్పు ప్రకారం..

హైకోర్టు తీర్పు ప్రకారం..

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఎన్నికల కమిషనర్‌గా పునర్నియమించాలని, ఆర్డినెన్స్ జారీ చెల్లదంటూ తాజాగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. చట్టబద్ధత గల స్వతంత్ర సంస్థకు ఓ కమిషనర్‌గా జస్టిస్ కనగరాజ్‌ను మంత్రివర్గం సిఫారసు చేయడమేంటనే విషయాన్ని హైకోర్టు అభిప్రాయపడింది. మంత్రివర్గ సిఫారసు చేసిన ఆయన నియామకం చెల్లదని పేర్కొంది. సరిగ్గా ఇదే పాయింట్ మీద శ్రీకాంత్ రెడ్డి కోవారెంట్ పిటీషన్‌ను దాఖలు చేశారు.

Recommended Video

APSRTC In Tough Situation,Neighbour States Not Intrested To Allow AP Buses
2016 నాటి మంత్రివర్గ సిఫారసులకు కూడా

2016 నాటి మంత్రివర్గ సిఫారసులకు కూడా

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ 2016లో అప్పటి మంత్రివర్గం తీసుకున్న సిఫారసుకు కూడా తాజాగా హైకోర్టు తీర్పు వర్తిస్తుందనేది శ్రీకాంత్ రెడ్డి వాదన. ఈ ప్రకారం చూసుకుంటే.. అసలు రమేష్ కుమార్ నియమాకమే చెల్లదని అంటున్నారు. అలాంటప్పుడు ఆయనను ఎలా పునర్నియమించడానికి వీలు ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఇవే అంశాలను ఆయన హైకోర్టులో దాఖలు చేసిన కోవారెంట్‌లో పొందుపరిచారు. ఈ పిటీషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. త్వరలో బెంచ్ ముందుకు రానుంది.

English summary
Quo Warrant Writ Petition was filed in Andhra Pradesh High Court in Nimmagadda Ramesh Kumar case. The petitioner seeks that to stay on High Court judgement on Nimagadda Ramesh Kumar re appointment as State Election Commissioner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X