వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలనం: అచ్చెన్నాయుడు ఆమెను కొట్టారా!?, ఎస్ఐ,సీఐ లైంగిక వేధింపులు..

రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు తనను కొట్టారని కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారుల తీరుపై టెక్కలి సీఐ, ఎస్ఐలకు ఫిర్యాదు చేస్తే.. కేసును పట్టించుకోకపోగా.. వారే తనను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించార

|
Google Oneindia TeluguNews

అమరావతి: బుధవారం నాడు శ్రీకాకుళంకు చెందిన కళ్యాణి అనే యువతి అసెంబ్లీ ఎదుట ఆత్మాహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తన సమస్యలపై సీఎంకు విన్నవించుకోవడానికి వచ్చిన ఆమెకు సిబ్బంది 'నో' చెప్పడంతో మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఆత్మాహత్యాయత్నం తర్వాత ఆమెను మంగళగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించిన సిబ్బంది.. ఆ తర్వాత రాత్రి 7గం. సమయంలో ఆమెను బలవంతంగా రైల్లో సొంత ఊరికి తరలించారు. అయితే ఆసుపత్రిలో పలువురు మీడియా ప్రతినిధులు ఆమె నుంచి వివరాలు సేకరించడంతో పలు విషయాలు వెలుగుచూశాయి.

<strong>చంద్రబాబును కలిసేందుకు వచ్చి!: అసెంబ్లీ ఎదుట యువతి 'ఆత్మహత్యాయత్నం'</strong>చంద్రబాబును కలిసేందుకు వచ్చి!: అసెంబ్లీ ఎదుట యువతి 'ఆత్మహత్యాయత్నం'

r and b employee suicide attempt infront of ap assembly

తన తండ్రి కూరపాని అప్పారావు ఆర్అండ్‌బీ శాఖలో రోడ్ రోలర్ డ్రైవర్ గా పనిచేస్తూ మృతిచెందడంతో..ఆయన స్థానంలో అదే శాఖలో తనకు అటెండర్ గా ఉద్యోగం ఇచ్చినట్లు కళ్యాణి చెప్పారు. ఇటీవల పదోన్నతి కోసం ప్రయత్నిస్తూ.. ఉన్నతాధికారులకు తన ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ సమర్పించగా.. పదో తరగతి సర్టిఫికెట్ నకిలీదని తనపై ఆర్అండ్‌బీ అధికారులు కేసు పెట్టారని పేర్కొన్నారు.

అప్పటినుంచి అధికారులు తనను వేధిస్తున్నారని, ఉద్దేశపూర్వకంగానే ఇదంతా జరుగుతోందని కళ్యాణి ఆరోపిస్తున్నారు. ఇక రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు తనను కొట్టారని కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారుల తీరుపై టెక్కలి సీఐ, ఎస్ఐలకు ఫిర్యాదు చేస్తే.. కేసును పట్టించుకోకపోగా.. వారే తనను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించారు.

గతంలో ఒకసారి సీఎం చంద్రబాబు నాయుడుకు సమస్య గురించి విన్నవించినప్పుడు న్యాయం చేస్తానని హామి ఇచ్చారని కళ్యాణి గుర్తుచేశారు. అయితే న్యాయం సంగతి అటుంచితే పోలీసులు ఆర్అండ్‌బీ అధికారులు వేధింపులు ఎక్కువైపోయాయని ఆమె ఆవేదన చెందారు. తన సమస్య గురించి మరోసారి చంద్రబాబుకు విన్నవించుకునేందుకు వస్తే.. సిబ్బంది తనను కలవనీయడం లేదని అన్నారు. ఆ మనస్థాపంతోనే ఆత్మహత్య యత్నించినట్లు తెలిపారు.

English summary
On wednesday, A woman who is working in R&B department was attempted suicide infront of ap assembly gate. Recently the details of that incident were came out
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X