ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ నన్ను పిలిచి.. హామీ ఇచ్చారు, అందుకే చంద్రబాబు పిలవలేదు: ఆర్ కృష్ణయ్య నిప్పులు

|
Google Oneindia TeluguNews

ఏలూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో బీసీ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సభలో ఆయన పాల్గొని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. బీసీలను చంద్రబాబు అవమానించాడన్నారు. ఆయనకు బీసీల ఓట్లు కావాలి కానీ, టిక్కెట్లు ఇవ్వరా అన్నారు. ఎన్నోసార్లు ప్రధాని మోడీని కలిశానని చెప్పారని, కానీ బీసీల కోసం మాట్లాడారా అని నిలదీశారు.

తాను బీసీ తీవ్రవాదిని అని ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీ డిమాండ్లపై ఆనాడు వైయస్ రాజశేఖర రెడ్డి తనను అడిగారని చెప్పారు. బీసీలకు విద్య ముఖ్యమని వైయస్ కోరుకునే వారని చెప్పారు. బీసీ అభ్యున్నతికి ఆయన కృషి చేశారని చెప్పారు. బీసీలకు మంచి స్కీంలు ప్రవేశ పెట్టారని కితాబిచ్చారు.

<strong>జగన్‌కు ఊరట: రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా మేడా పోటీ, తప్పుకున్న అమర్నాథ్ రెడ్డి</strong>జగన్‌కు ఊరట: రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా మేడా పోటీ, తప్పుకున్న అమర్నాథ్ రెడ్డి

 జగన్ మాటిచ్చారు

జగన్ మాటిచ్చారు

చట్టసభల్లో రిజర్వేషన్లకు చొరవ తీసుకోవాలని తాను జగన్‌ను కోరానని ఆర్ కృష్ణయ్య చెప్పారు. చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం పోరాడుతానని వైసీపీ అధినేత హామీ ఇచ్చారన్నారు. పార్లమెంటులో ప్రాతినిథ్యం ఉన్న అన్ని పార్టీలను కూడా కలిశానని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయితే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వస్తాయని చెప్పారు. బీసీలు శాశ్వతంగా బాగుపడాలని వైయస్ రాజశేఖర రెడ్డి కోరుకునే వారని చెప్పారు.

 బీసీలు ప్రలోభాలకు లొంగవద్దు

బీసీలు ప్రలోభాలకు లొంగవద్దు

వచ్చే ఎన్నికల్లో బీసీలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా (టీడీపీ ప్రలోభపెడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ) ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆర్ కృష్ణయ్య అన్నారు. వైసీపీ బీసీ డిక్లరేషన్‌తో చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. బీసీలను చంద్రబాబు అన్ని విధాలుగా అవమానించిందని చెప్పారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు జగన్ అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు అన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేశారు. బీసీలకు ఎంత బడ్జెట్‌ అయినా కేటాయిస్తామని మాట ఇచ్చి చేసి
చూపించారన్నారు. బీసీల కోసం నాడు నా పోరాటాలకు వైయస్సార్ స్పందించారని, బీసీల కోసం కమిటీ కూడా వేశారన్నారు. బీసీలకు ఏదైనా చేసిన నాయకుడు ఉన్నారంటే వైయస్సార్ అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వల్లే మన పిల్లలు ఉన్నత చదువులు చదువుకున్నారని, ఆ చలవ వైయస్‌దే అన్నారు.

 అందుకే చంద్రబాబు నన్ను పిలువలేదు

అందుకే చంద్రబాబు నన్ను పిలువలేదు

జగన్ తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారని ఆర్ కృష్ణయ్య అన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్ల అమలు కోసం ఏ ఒక్క పార్టీ కూడా స‍్పందించలేదన్నారు. పార్లమెంట్‌లో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఒక్క జగన్ మాత్రమే హామీ ఇచ్చారని, పార్లమెంట్‌లో బీసీల రిజర్వేషన్లపై పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డితో ప్రయివేట్‌ బిల్లు ప్రవేశపెట్టిన ఘటన వైసీపీదే అన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు వస్తాయన్నారు. అప్పుడే రీయింబర్స్‌మెంట్‌ పథకం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. తాను డిమాండ్లు పెడతాననే టీడీపీ బీసీ సభకు తనను పిలవలేదని చెప్పారు. కానీ జగన్ మాత్రం తన డిమాండ్లు ఏమిటో చెప్పాలని అడిగారని తెలిపారు.

English summary
BC leader R Krishnaiah praised YSRCP chief YS Jagan Mohan Reddy and lashed out at Andhra Pradesh chief minister Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X