అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇవాళ వీళ్లు, రేపు రెడ్లు, కెసిఆర్ దారిలో నడువు: బాబుకు కృష్ణయ్య

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బిసి సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎవరిని పడితే వాళ్లను బీసీలలో చేరుస్తామని చెబితే ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Present Kapus Tomorrow reddy's will ask for reservations ఇవాళ వీళ్లు, రేపు రెడ్లు, బాబుకు కృష్ణయ్య

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బిసి సంఘం అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.

నంద్యాల ఎఫెక్ట్: కెసిఆర్ పాత అస్త్రం, ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టలునంద్యాల ఎఫెక్ట్: కెసిఆర్ పాత అస్త్రం, ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టలు

ఎవరిని పడితే వాళ్లను బీసీలలో చేరుస్తామని చెబితే ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. బీసీలలో చేర్చడానికి అవసరమైన అర్హతలు ఉంటేనే అంగీకరిస్తామని చెప్పారు.

ఇవాళ కాపులు, రేపు రెడ్లు

ఇవాళ కాపులు, రేపు రెడ్లు

అందరినీ కలుపుకుంటూ పోతే ఇవాళ కాపులు, రేపు రెడ్లు కూడా బీసీలలో చేరుతామని అంటారని, తమను కూడా కలపాలని డిమాండ్ చేస్తే ఏం చేస్తారని ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. కాపులకు విద్య, ఉద్యోగాల రిజర్వేషన్లకు తమ సంఘం అంగీకరించబోదని చెప్పారు. ఆ డిమాండ్ తమకు అభ్యంతరకమని చెప్పారు.

నేతలు ఎన్నో ప్రకటనలు చేస్తారు

నేతలు ఎన్నో ప్రకటనలు చేస్తారు

ఒకసారి బీసీలలో చేరితే ఒక్కొక్కటి అమలు చేస్తారని, కాబట్టి ఎలా చేస్తారో తమతో చర్చించాలన్నారు. నేతలు ప్రకటనలు చాలానే చేస్తారని ఆర్ కృష్ణయ్య అన్నారు. కానీ అవి జరగాలంటే సాంకేతిక సమస్యలు వస్తాయని గుర్తు చేశారు. విద్య, ఉపాధి, చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

చంద్రబాబూ! కేసీఆర్‌ను అనుసరించు

చంద్రబాబూ! కేసీఆర్‌ను అనుసరించు

తెలంగాణ రాష్ట్రంలో ఇందుకు అవసరమైన కసరత్తు జరుగుతోందని ఆర్ కృష్ణయ్య అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ సీఎం కెసిఆర్ దారిలో నడవాలని అభిప్రాయపడ్డారు. బిసిలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను టిడిపి ప్రభుత్వం అమలు చేయాలన్నారు.

మోడీకి చంద్రబాబు క్లోజ్ కాబట్టి

మోడీకి చంద్రబాబు క్లోజ్ కాబట్టి

ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం చంద్రబాబు చాలా సన్నిహితుడు అని ఆర్ కృష్ణయ్య గుర్తు చేశారు. కాబట్టి బీసీల ప్రధాన డిమాండ్లు అమలు చేసేందుకు చంద్రబాబు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లి అందుకు అనుగుణంగా కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు.

English summary
BC leader and LB Nagar MLA R Krishnaiah on Tuesday said that they are against to Kapu reservation in BCs. He said that after Kapus, tomorrow reddy's will also ask for reservations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X