వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపిలో కాపుల రిజర్వేషన్లు గందరగోళంలో పడనున్నాయా...

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లి :ఏపి కాపులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇస్తామన్న అయిదు శాతం రిజర్వేషన్లకు బ్రేకులు పడనున్నాయా...ఏపి అసెంబ్లిలో బిల్లు ద్వార తమకు న్యాయం జరుగుతుందనుకుంటున్న కాపులు మరి కోంత కాలం వేచి చూడాల్సిందేనా...

అగ్రవర్ణ పేదలకు నరేంద్రమోడి ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే..అయితే దీనీపై పలు వివాదలు నెలకొన్నాయి......కేంద్రప్రభుత్వ నిర్ణయంపై సుప్రిం కోర్టులో ఇప్పటికే పలు పిటిషన్లు ధాఖలు అయ్యాయి..తాజాగా పది శాతం రిజర్వేషన్ ను వ్యతిరేకించడంతో పాటు ,ఏపి ప్రభుత్వం కాపులకు ఇచ్చిన రిజర్వేషన్లపై బీసి సంఘం జాతియ నేత ,మాజీ ఎమ్మెల్యే ఆర్ క్రిష్ణయ్య కూడ సుప్రింలో పిటిషన్ దాఖలు చేశారు..పలు పిటిషన్లు స్వికరించిన సుప్రిం కోర్టు రిజర్వేషన్లు కేటాయింపు పూర్తి వివరాలను ఈ నెల 26 లోగా కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది..

R Krishnaih filed petition on reservation

అయితే కేంద్రం తీసుకువచ్చిన రిజర్వేషన్లను ఆసరా చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా మలుచుకున్నారు..దీంతొ చాల రోజులుగా తమను బీసిల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నా కాపులకు ప్రత్యేకంగా (బీసి ఎఫ్ కోటాలో] భాగంగా విద్యా, ఉద్యోగ రంగాల్లో 5 శాతం ఇచ్చేందుకు రాష్ట్ర అసెంబ్లిలో బిల్లును తెచ్చారు..ఈ సంధర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హమిని నిలబెట్టుకున్నాననే దీమాతో పాటు రెండు దశాబ్దాలుగా నాన్చుతున్న సమస్యకు ఫుల్ స్టాప్ పడిందనే యోచనలో ఆయన ఉన్నారు..

ఇక అసెంబ్లిలో బిల్లు అమోదం కావడంతో తమకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఏదో ఒక విధంగా అయిదు శాతం రిజర్వేషన్ వచ్చిందన్న అనందంలో ఉన్న కాపుల్లో..సుప్రిం విచారణతో ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది.... రిజర్వేషన్ల పై కేంద్రం ఎలాంటి వివరణ ఇస్తుందనే సమాచారం పక్కన పెడితే కాపులకు ప్రత్యేకంగా కేటాయించిన రిజర్వేషన్ పై రాజ్యంగబద్దంగా వ్యవహరించే సుప్రిం కోర్టు ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి..

మరోవైపు మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాపులను తమ వైపుకు తిప్పుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పడే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.... మొత్తం మీద రిజర్వేష్ల పిటిషన్ల వల్ల అటు కాపు సామాజిక వర్గంతో పాటు ఏపి ప్రభుత్వం కూడ ఎన్నికల ముందు ఇబ్బందులను ఏదుర్కోనే అవకాశాలున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు....

కాగా కాపుల్లో గనుక రిజర్వేషన్లు అమలు కాకపోతే మళ్లి ఎన్నికల ముందు అందోళన పట్టే అవకాశాలు ఉన్నాయి...ముఖ్యంగా ఏపిలో రాజకీయంగా ఇప్పటికే అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ తోపాటు జనసేన పార్టీలు అధికారం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి..మరి రిజర్వేషన్ల వివాదం ఏమేరకు రాజకీయలను మలుపు తిప్పుతాయో వేచి చూడాలి...

English summary
R Krishnaih filed petition on reservation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X