వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ నుండి రాంచ‌ద్ర‌య్య ఔట్...! జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపిలో చేరిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

కాంగ్రెస్ ను వీడి వైసీపిలో చేరిన రాంచ‌ద్ర‌య్య..! | Oneindia Telugu

హైద‌రాబాద్/ఏపి : ఏపిలో ప్ర‌జ‌లు మార్పును కోరుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పాల‌న ప‌ట్ల అస‌హ‌నంగా ఉన్న ప్ర‌జ‌లు ప్ర‌త్య‌మ్నాయం వైపు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగానే నాయ‌కులు కూడా త‌మ నిర్ణ‌యాన్ని మార్చుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల కాంగ్రెస్ - టీడిపి పొత్తును జీర్ణించుకోలేని కొంత‌మంది కాంగ్రెస్ నాయ‌కులు ఆ పార్టీకి రాంరాం చెబుతున్నారు. కాంగ్రెస్ టీడిపి పొత్తు అనైతిక‌మ‌ని భావిస్తున్న ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కులు ఇత‌ర పార్టీల వైపు చూస్తున్నారు.

కాంగ్రెస్ నుండి సీనియ‌ర్లు ఔట్..! పొత్తు ను త‌ప్పుబ‌డుతున్న నేత‌లు..!

కాంగ్రెస్ నుండి సీనియ‌ర్లు ఔట్..! పొత్తు ను త‌ప్పుబ‌డుతున్న నేత‌లు..!

టీడిపి కాంగ్రెస్ తో పొత్తు అంశం తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న కొంత‌మంది నేత‌లు పార్టీ అదిష్టానానికి లేఖ‌లు కూడా రాస్తున్నారు. మ‌రికొంత మంది నేత‌లు ప్ర‌త్యామ్నాయం వెతుక్కుంటున్నారు, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు వ‌ట్టి వ‌సంత‌కుమార్, ప‌సుపులేటి బాల‌రాజు తో పాటు సీ.రామ‌చంద్ర‌య్య కంగ్రెస్ పార్టీని వీడిన వారిలో ఉన్నారు. అసంత్రుప్తితో ఉన్న మ‌రికొంత మంది నేత‌లు కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. కాగా సీనియ‌ర్ నేత సీ రాంచంద్ర‌య్య పొత్తు అంశం ఖ‌రారు కాగానే ప‌ర్టీకి రాజీనామా చేసి విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పాద‌యాత్ర‌లో ఉన్న వైసీపి అదినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆద్వ‌ర్యంలో ఆ పార్టీలో చేరిపోయారు.

టీడిపి-కాంగ్రెస్ పొత్తు అనైతికం..! అందుకే జీర్ణించుకోలేక పోతున్నామంటున్న సీఆర్..!!

టీడిపి-కాంగ్రెస్ పొత్తు అనైతికం..! అందుకే జీర్ణించుకోలేక పోతున్నామంటున్న సీఆర్..!!

అంతే కాకుండా వైసీపిలో తాను ఎందుకు చేరుతున్నాడో చెప్పుకొచ్చారు. ప్ర‌జామోదం పొందే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌క‌టించిన జగన్‌ నాయకత్వాన్ని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. వైఎస్సార్‌ ఆశయాలను సంపూర్ణంగా నెరవేరుస్తానని జగన్‌ అంటున్నారని, ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితుడై వైఎస్సార్‌సీపీలో చేరినట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కాకుండా తన అభివృద్దినే చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ గడ్డు పరిస్థితిలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

వైసీపిలో చేరిన సీఆర్..! కాంగ్రెస్ త‌ప్పుచేస్తుంద‌ని ఆరోప‌ణ‌..!!

వైసీపిలో చేరిన సీఆర్..! కాంగ్రెస్ త‌ప్పుచేస్తుంద‌ని ఆరోప‌ణ‌..!!

తాజాగా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన సీనియర్ నేత సి. రామచంద్రయ్య మంగళవారం నాడు వైసీపీలో చేరారు. టీడీపీ, కాంగ్రెస్ పొత్తును వ్యతిరేకిస్తూ ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. రామచం‍ద్రయ్యకు కండువా కప్పిన వైఎస్‌ జగన్‌ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. రామచంద్రయ్యతో పాటు కడప జిల్లాకు చెందిన రైల్వేకోడూరు నియోజకవర్గం టీడీపీ నాయకులు ఎన్‌ సుబ్బరాఘవరాజు కూడా వైఎస్సార్‌ సీపీలో చేరారు. రామచంద్రయ్య చేరికతో వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్సార్‌ సీపీ మరింత బలపడుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు.

టీడిపి పై ఘాటు వ్యాఖ్యలు..! అదికారంలోకి వ‌చ్చేది జ‌గ‌నే అన్న సీఆర్..!!

అనంతరం రామచంద్రయ్య మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు పెంచి పోషిస్తున్న అరాచక శక్తులను అంతమొందిచాల్సిన అవవసరం ఉందన్నారు. ఈ అక్రమాలను అరికట్టే శక్తి వైఎస్‌ జగన్‌కు మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూని చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడని విమర్శించారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే చంద్రబాబు నాయుడిని దూరం పెట్టాలని పిలుపునిచ్చారు. ఏ భావాలతో టీడీపీ పుట్టిందో అది ఇప్పుడు లేదని వ్యాఖ్యానించారు.

English summary
People who are impatient towards TDP rule seems to be looking towards substitution. In the face of people's ideas, leaders also change their decision. Recently some Congress leaders who do not dig up the Congress-TDP are telling goodbye to the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X