విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాధా వ్యాఖ్య‌ల‌తో రంగా అభిమానుల కంట క‌న్నీళ్లు :ఆయ‌న కోస‌మే నెహ్రూను వైసిపి లోకి తీసుకోలేదు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

YCP Leader Perni Nani Replies To Vangaveeti Radha | Oneindia Telugu

వైసిపికి రాజీనామా చేసిన వంగ‌వీటి రాధా చేసిన వ్యాఖ్య‌ల పై వైసిపి స్పందించింది. వైసిపి కృష్ణా జిల్లా నేత పేర్ని నాని రాధా వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. రాధా అమాయ‌కుడ‌ని ..సింహం క‌డుపున పుట్టి చంద్ర‌బాబుకు కుందేలు లా దొరికిపోయా ర‌ని చెప్పుకొచ్చారు. రాధాకు పార్టీలో ప్రాధాన్య‌త ఇచ్చాం కాబ‌ట్టే..అత‌ని మాట మేర‌కు దేవినేని నెహ్రూ వైసిపి లోకి వ‌స్తా నంటే వ‌ద్ద‌ని చెప్పాల‌ని వివ‌రించారు. రాధా..ముఖ్య‌మంత్రి ట్రాప్ లో ప‌డ్డార‌ని వ్యాఖ్యానించారు.

రాధా వ్యాఖ్య‌ల‌తో రంగా అభిమానుల కంట క‌న్నీళ్లు..

రాధా వ్యాఖ్య‌ల‌తో రంగా అభిమానుల కంట క‌న్నీళ్లు..

వైసిపికి రాజీనామా చేసిన వంగ‌వీటి రాధా వైసిపి అధినేత జ‌గ‌న్ పై చేసిన వ్యాఖ్య‌ల‌ను వైసిపి ఖండించింది. వైసిపి నేత పేర్ని నాని..వంగ‌వీటి వ్యాఖ్య‌ల పై స్పందించారు. వంగ‌వీటి రాధా అమాయ‌కుడ‌ని ఆయ‌న చంద్ర‌బాబు ట్రాప్ లో ప‌డ్డార‌ని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబును వంగ‌వీటి రాధా న‌మ్మ‌టం భాదాక‌ర‌మ‌న్నారు. వైసిపి లో రాధాకు స‌ముచిత స్థానం క‌ల్పించామ‌ని..వైసిపి యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడిని చేసామ‌ని గుర్తు చేసారు.

రంగా అభిమానుల‌కు

రంగా అభిమానుల‌కు

రంగా విగ్రహావిష్క‌ర‌ణ‌ల‌కు వెళ్ల వ‌ద్ద‌ని చెప్ప‌లేద‌ని..ఆ నియోజ‌క‌వ‌ర్గాల‌కు వెళ్లిన స‌మయంలో పార్టీ కార్యాల‌యానికి వెళ్లి కార్య‌క‌ర్త‌ల‌తో గ‌డ‌పాల‌ని మాత్ర మే జ‌గ‌న్ చెప్పార‌ని నాని వివ‌రించారు. రాధా తో మాట్లాడ‌టానికి జ‌గ‌న్ ప్ర‌య‌త్నించినా ఆయ‌న అందుబాటులోకి రాలే ద‌ని వివ‌రించారు. రాధా హ‌త్య‌తో టిడిపికి సంబంధం లేద‌ని చెప్ప‌టం స‌రి కాద‌ని..రంగా హ‌త్య‌కు టిడిపి యే కార‌ణ‌మ నే విష‌యం అంద‌రికీ తెలుసన్నారు. రాధా చేసిన వ్యాఖ్య‌ల‌తో ల‌క్ష‌లాది రంగా అభిమానుల‌కు క‌న్నీళ్లు వ‌చ్చాయ‌ని నాని చెప్పుకొచ్చారు.

రాధా కోస‌మే నెహ్రూను పార్టీలోకి తీసుకోలేదు..

రాధా కోస‌మే నెహ్రూను పార్టీలోకి తీసుకోలేదు..

వంగ‌వీటి రాధాకు పార్టీలో ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌నే మాట వాస్త‌వం కాద‌ని పేర్ని నాని వివ‌రించారు. రాధాకు ప్రాధాన్య‌త ఇచ్చాం కాబ‌ట్టే..దేవినేని నెహ్రూ పార్టీలోకి వ‌స్తామంటే..రాధాతో సంప్ర‌దింపులు చేసామ‌ని..ఆయ‌న అంగీక‌రించ‌క పోవ టంతో..నెహ్రూను పార్టీలోకి తీసుకోలేద‌ని నాని వివ‌రించారు. ఆ స‌మయంలో కృష్ణా జిల్లాకు చెందిన వైసిపి నేత‌లంతా ఉన్నార‌ని చెప్పుకొచ్చారు. రంగా హ‌త్య జ‌రిగిన త‌రువాత తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంద‌రు పాట కూడా రాసార‌ని గుర్తు చేసారు. వంగ‌వీటి రంగా హత్య టిడిపి గుండాలే చేసార‌ని అంద‌రికీ తెలుసంటూ నాని వ్యాఖ్యానించారు. రంగా హత్య గురించి ఎవ‌రిని అడిగినా చెబుతార‌న్నారు.

English summary
YCP counter Vangaveeti Radha comments on Jagan, YCP leader Perni Nani says Jagan always given priority to Radha in party. Jagan never neglected Radha in party activites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X