హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాఘవులు కరచాలనం: ఎత్తేసిన పోలీసులు (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సమస్యల పరిష్కారానికి మున్సిపల్ కార్మికులు అసెంబ్లీ ముట్టడికి పూనుకుంటే ముందుండి నడిపిస్తూ, వారి వెన్నంటే ఉంటామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి. రాఘవులు అన్నారు. ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల చర్చలకు పిలిచి సంమస్యలను పరిష్కరించాలని లేని ఎడల ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

బుధవారం మున్సిపల్ కార్మికులు చేపట్టిన జిహెచ్‌ఎమ్‌సి ముట్టడి కార్యక్రమంలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. మున్సిపల్ కార్మికుల్లో దళితులు, బలహీన వర్గాల వారే అత్యధికంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వారిపై వివక్ష చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరితో రాష్ట్రంలో తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించడంతో కార్మికులు సమ్మెను ఉధృతం చేయాలని నిశ్చయించుకున్నారని పేర్కొన్నారు.

ఉద్యోగులందరికీ ఇస్తున్నట్లే మున్సిపల్ కార్మికులకు కూడా ఐఆర్ 27శాతం, హెల్త్ కార్డుల మంజూరు చేసి, డిఎ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్మా ప్రయోగించి ఉద్యమాలను ఆపడం సాధ్యం కాదన్నారు. వెంటనే కార్మిక సంఘాలతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

పోలీసులు ఎత్తేశారు..

పోలీసులు ఎత్తేశారు..

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జిహెచ్‌ఎంసి) మహిళా ఉద్యోగిని ఇలా మహిళ పోలీసులు ఎత్తేశారు.

అంగన్‌వాడీ కార్యకర్తలకు రాఘవులు భరోసా

అంగన్‌వాడీ కార్యకర్తలకు రాఘవులు భరోసా

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద దీక్ష చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు తన సంఘీభావాన్ని తెలిపారు.

రాఘవులు విమర్శ

రాఘవులు విమర్శ

మున్సిపల్ కార్మికులు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నా వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని రాఘవులు విమర్శించారు.

జిహెచ్‌ఎంసి వద్ద ఆందోళన

జిహెచ్‌ఎంసి వద్ద ఆందోళన

జిహెచ్‌ఎంసి ముట్టడి కార్యక్రమానికి సిపిఎం అనుబంధ కార్మిక సంఘం సిఐటియు మద్దతు పలికింది. ఇలా సిఐటియు కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

English summary

 CPM secretary BV Raghavulu has extended his support to the agaitation of Municipal staff in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X