• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారీ కుట్ర -ఆ ఛానళ్ల నుంచి రఘురామకు డబ్బులు: చంద్రబాబు పాత్ర - ఇవీ ఆధారాలు : సుప్రీంలో ఏపీ కౌంటర్..!!

By Lekhaka
|

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు కు రెండు తెలుగు ఛానళ్ల నుండి డబ్బులు అందాయని..అందుకు ప్రతిఫలంగా ఆ ఛానళ్ల వ్యక్తుల ప్రయోజనాల కోసం ఎంపీ తన పదవిని వినియోగించారంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కౌంటర్ అఫిడవిట దాఖలు చేసింది. అందులో పలు సంచలన అంశాలను ప్రస్తావించింది. ప్రముఖ న్యాయ సంబంధింత అంశాల వార్తలను ప్రచురించే బార్ అండ్ బెంచ్ వెబ్ సైట్ ఈ వార్తను వెలుగులోకి తెచ్చింది.

ఆ రెండు ఛానళ్లతో పాటుగా చంద్రబాబు..

ఆ రెండు ఛానళ్లతో పాటుగా చంద్రబాబు..

రెండు ఛానళ్ల పేర్లు సైతం వెబ్ సైట్ ప్రచురించింది. ఏబీఎన్-టీవీ5 తో పాటుగా టీడీపీతో రఘురామ కుమ్మక్కై ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేసారంటూ అఫిడవిట్ లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఆ సమయంలో ఆ రెండు ఛానళ్లకు..రఘురామ మధ్య ఆర్దిక లావాదేవీలు జరిగాయని ప్రస్తావించింది.

గతంలో రఘురామ పైన సీఐడి సుమోటోగా కేసులు నమోదు చేసిన సమయంలో ఈ రెండు ఛానళ్ల పైన కేసుల నమోదు చేసారు. అయితే, ఆ తరువాత ఆ రెండు ఛానళ్లు సుప్రీంను ఆశ్రయించాయి. దీనిని విచారించిన సుప్రీం మీడియాపైన దుందుడకు చర్యలు వద్దంటూ హెచ్చరించాయి.

టీవీ ఛానల్ నుంచి డబ్బులు..క్విడ్ ప్రో కో..

టీవీ ఛానల్ నుంచి డబ్బులు..క్విడ్ ప్రో కో..

ఇక, ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ లో టీవీ5 ఛైర్మన్ ఎంపీకి పది లక్షల యూరోలు అంటే మన కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ.8.8 కోట్లు బదిలీ చేసినట్లు గా పేర్కొంది. దీనికి బదులుగా క్విడ్ ప్రో కో లో భాగంగా ఎంపీ రుఘురామ ఆ ఛానళ్లలోని వ్యక్తుల ప్రయోజనాల కోసం తన పదవిని వినియోగించారని అఫిడవిట్ లో పేర్కొంది. వాక్ స్వాతంత్రంను తాము పవిత్రంగా భావిస్తామని..అయితే, ప్రజాస్వామ్యంలో కీలంగా వ్యవమరించాలని మీడియాలోని కొన్ని సంస్థలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను...విద్వేషాలను వ్యప్తి చేయటానికి మాత్రం అనుమతించలమేని పేర్కొంది.

 అందరూ కలిసి..ప్లాన్ సెట్ చేసి..

అందరూ కలిసి..ప్లాన్ సెట్ చేసి..

రఘురామ రాజు చేసి ప్రసంగాలను ముందుగా ప్రణాళికా బద్దంగా సిద్దం చేసి వాటిని ప్రసారం చేసారని అఫిడవిట్ లో పేర్కొందని బార్ అండ్ బెంచ్ ప్రచురించింది. ఛానళ్లతో పాటుగా..టీడీపీ నేతలు..రఘురామ రాజు కూలంకషంగా చర్చించుకున్న తరువాతనే వాటి ప్రసారాలు జరిగాయని వివరించింది. అవి...క్షేత్ర స్థాయిలో హింసకు ప్రేరేపించాయని ఆరోపించింది. టీడీపీ అధినేత చంద్రబాబు దీని వెనుక ఉన్నట్లుగా అఫిడవిట్ లో పేర్కొన్నారు. రఘురామ రాజుతో చంద్రబాబుతో పాటుగా లోకేశ్ మధ్య సాగిన ఫోన్ సంబాషణలను..వారి మధ్య జరిగిన డాక్యుమెంట్ల షేరింగ్ వంటి అధారాలను వైసీపీ ప్రభుత్వం అఫిడవిట్ ద్వారా బయట పెట్టినట్లు కధనంలో పేర్కొన్నారు.

 సెల్ ఫోన్ లో పూర్తి ఆధారాలు..

సెల్ ఫోన్ లో పూర్తి ఆధారాలు..

దర్యాప్తు సమయంలో రఘురామ కృష్ణ రాజు నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ ఫోన్‌ను పరిశీలించి రూపొందించిన ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టు, ఆయన సెల్‌ ఫోన్‌ నుంచి వచ్చిన మొత్తం ఎలక్ట్రానిక్ వివరాలను కోర్టు ముందు ఉంచినట్టు కధనంలో పేర్కొన్నారు. రఘురామకృష్ణం రాజు ప్రెస్‌ మీట్ల తర్వాత మీడియా వ్యక్తులనుంచి ఆయనకు ఎవరి దగ్గర నుంచి ఎటువంటి ప్రశంసలు వచ్చాయి..అందులో రఘురామ ను ఏ రకంగా వారంతా అభినందించారనే అంశాన్ని ఆధారాలతో వివరంచినట్లుగా తెలుస్తోంది. ప్రజల మధ్య, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వ్యతిరేకతను ఉసిగొలిపేలా వ్యవహరించారని ఆరోపించింది.

ఎంపీకి ప్రశంసలు..అసలు లక్ష్యం ఇదేనంటూ..

ఎంపీకి ప్రశంసలు..అసలు లక్ష్యం ఇదేనంటూ..

ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికలపై, మీడియా చానళ్ల ద్వారా విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని అఫిడవిట్‌లో ఆరోపించింది. వావ్‌.. మీరు మంచి పంచ్‌ ఇచ్చారు, సింహం ఒంటరిగా వస్తుంది.. పందులు గుంపులుగా వస్తాయి, మీరు పార్టీకి పెద్ద బొక్క పెడుతున్నారు, మీ ఇంటర్వ్యూ సూపర్‌ హిట్‌..అంటూ వారి నుంచి ప్రశంసలు వచ్చినట్లుగా పేర్కొన్నారు.

రఘరామ రాజు మీడియా సమావేశాలను ఆ ఛానళ్లు తమ విధిలో భాగంగా ప్రసారం చేయలేదని...రాజకీయ-ఆర్దిక ప్రయోజనాల కోసం పని చేశాయంటూ ప్రభుత్వం పేర్కొంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలు చేసేలా కుట్ర పన్నాయని ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్నట్లుగా వెబ్ సైట్ కధనంలో వివరించారు.

English summary
The website Bar and Bench that carries news related to courts had written an article on AP Govt's petition which alleged that Rebel MP Raghurama Raju had taken money from TDP backed channels to throw mud on Jagan govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X