వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజు గారి రాజసం చూడూ.. పంచె కట్టుతో.. సీఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది నీడన..

|
Google Oneindia TeluguNews

వైఎస్ఆర్ సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏం చేసినా సంచలనమే. సొంత పార్టీని, సీఎం జగన్‌ను విమర్శించి.. వైసీపీ నేతల ఆగ్రహానికి గురవుతున్నారు. ఆయనపై నేతలు కేసులు పెట్టడం, బెదిరించడంతో తనకు కేంద్ర బలగాలతో రక్షణ కావాలని స్పీకర్‌ని కోరడంతో కేంద్ర ప్రభుత్వం వై క్యాటగిరీ భద్రత కల్పిస్తోంది. సీఎస్ఎఫ్ జవాన్లు ఆయన భద్రతాదళంలోకి చేరిన తర్వాత ఒక ఫోటో దిగి.. పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో రఘురామ రాజసంగా కనిపిస్తున్నారు. పంచె కట్టుకోని ముందు ఉండగా.. భద్రతా సిబ్బంది సహా బలగాలు ఆయన వెనకాల ఉన్నాయి.

సినిమాను మించి సీఎం జగన్ కామెడీ - బెంగళూరుకు దగ్గరగా క్యాపిటల్ - తోలు తీస్తామంటారా?: ఎంపీ రఘురామసినిమాను మించి సీఎం జగన్ కామెడీ - బెంగళూరుకు దగ్గరగా క్యాపిటల్ - తోలు తీస్తామంటారా?: ఎంపీ రఘురామ

 10 మంది సెక్యూరిటీ రాగా..

10 మంది సెక్యూరిటీ రాగా..

రఘురామకృష్ణ రాజుకు 10 మంది వరకు సెక్యూరిటీగా ఉన్నారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్కొక్కరు ఒక్కొలా కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి రాజుగారు అనుకున్నది సాధించారు అని కామెంట్స్ వస్తున్నాయి. కేంద్ర బలగాల పహారాలో ఉన్నారని పోస్ట్ చేస్తున్నారు. అయితే వైసీపీ కార్యకర్తలు మాత్రం మండిపడుతున్నారు. రఘురామ పార్టీకి వ్యతిరేకంగా కామెంట్లు చేయడంతో అదేస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

ఫిర్యాదులు, దిష్టిబొమ్మల దగ్ధం

ఫిర్యాదులు, దిష్టిబొమ్మల దగ్ధం

ఇదివరకు మంత్రి, వైసీపీకి ఎమ్మెల్యేలు కొందరు రఘురామపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరికొందరు వైసీపీ కార్యకర్తలు ఎంపీ దిష్టి బొమ్మల్ని దగ్థం చేశారు. దీంతో రఘురామ కృష్ణరాజు తన నియోజకవర్గంలో పర్యటించలేకపోతున్నారు. భద్రత కల్పించాలని స్పీకర్‌ని కోరగా.. ఆయన హోంశాఖకు లేఖ రాయడంతో వై క్యాటగిరీ భద్రతను కల్పించారు. ఈ క్రమంలోనే ఒక ఫోటో తీసి.. రఘురామ పోస్ట్ చేశారు. దీనిపై అనుకూల, వ్యతిరేకంగా కామెంట్లు వస్తున్నాయి.

Recommended Video

కొరియోగ్రఫర్ Dhanashree Verma తో Yuzvendra Chahal నిశ్చితార్థం || Oneindia Telugu
జగన్ లక్ష్యంగా విమర్శలు

జగన్ లక్ష్యంగా విమర్శలు

రఘురామకృష్ణంరాజు బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఆయన సీఎం జగన్‌పై విమర్శలు చేయడం, ప్రభుత్వ పథకాల తీరును తప్పుపట్టడంతో వైసీపీ నేతలు ముప్పేట దాడికి దిగారు. తొలుత ఎమ్మెల్యే ప్రసాదరాజు.. ఎంపీపై విరుచుకుపడ్డారు.మిగతా నేతలు కూడా ఆడపా దడపా కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. మంత్రి రంగనాథరాజు, కారుమూరి నాగేశ్వరరావుపై కామెంట్లు చేయడంతో.. ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
ysrcp narsapuram mp raghu rama krishna raju’s central security staff photo goes viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X