
నారాయణ దెబ్బలకు తట్టుకోలగలరా?.. సీఎంతోపాటు మంత్రి బొత్సనూ అరెస్ట్ చేయాలి: రఘురామ
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి తాజా ఏపీ రాజకీయాలపై వరుసగా స్పందిస్తున్నారు. జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకుంటే వైసీపీ ఓటమి ఖాయమంటూ ఇటీవల వ్యాఖ్యానించిన రఘురామ.. తాజాగా మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ అరెస్టు వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. ఏపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. నారాయణ అరెస్టును ఖండిస్తున్నట్లు తెలిపారు.

నారాయణ అరెస్ట్ కరెక్ట్ అయితే.. సీఎం జగన్, మంత్రి బొత్సనూ అరెస్ట్ చేయాలి
ఢిల్లీలో
రఘురామ
కృష్ణరాజు
మాట్లాడుతూ..
పదో
తరగతి
ప్రశ్నపత్రాల
లీకేజీ
విషయంలో
36
మందిని
అరెస్ట్
చేసినట్లు
ఏపీ
ప్రభుత్వం
ఇటీవల
చెప్పిందన్నారు.
దీనికి
సంబంధించి
నారాయణ
అరెస్ట్
న్యాయం
అనుకుంటే..
సీఎం
జగన్,
విద్యాశాఖ
మంత్రి
బొత్సనూ
అరెస్ట్
చేయాలి
కదా?
అని
రఘురామ
ప్రశ్నించారు.
ఇటీవల
తిరుపతిలో
సీఎం
జగన్..
నారాయణ,
శ్రీచైతన్య
పాఠశాల
నుంచే
పదో
తరగతి
ప్రశ్నపత్రాలు
లీక్
అయ్యాయని
అన్నారని,
అన్యాయంగా
తమపై
అపవాదులు
వేస్తున్నారని
చెప్పారు
అని
రఘురామ
తెలిపారు.
ఆ
తర్వాత
రోజు
అదంతా
అబద్ధమని
బొత్స
అన్నారు.
ఇందులో
ఏది
నిజం?
అని
రఘురామ
ప్రశ్నించారు.

కొట్టడం కోసమే అరెస్టులన్న రఘురామ
నారాయణను అరెస్ట్ చేయడం తప్పు అని వ్యాఖ్యానించారు. వీరికొక అలవాటు ఉందని, విచారణ చేసే గదుల్లో కెమెరాలు తీసేస్తారు. వ్యక్తిగత సిబ్బంది ఉంటే పంపించేస్తారు. కేవలం కొట్టడం కోసమే తీసుకెళ్తారు. ఆ తర్వాత పచ్చి అబద్ధాలు ఆడతారు. ఇవన్నీ నా కేసు విచారణలో అసలు దొంగలు, క్రూర మృగాలతో సహా బయటికొస్తారని అన్నారు. దెబ్బతిన్న వ్యక్తిగా తాను ఇదంతా చెబుతున్నట్లు రఘురామ తెలిపారు.

ఆ దెబ్బలకు నారాయణ తట్టుకోగలరా? అంటూ రఘురామ
నారాయణను
అభిమానించేవాళ్లంతా
అప్రమత్తంగా
ఉండాలన్నరు
రఘురామ.
నారాయణ
ఎంత
ఫిజికల్
ఫిట్‌గా
ఉన్నారో
తెలియదన్నారు.
రెండు
మూడు
దెబ్బలు
కొడితే
ఏదైనా
జరగొచ్చని,
దయచేసి
కోర్టును
ఆశ్రయించండి
అని
కోరారు.
ఈ
ప్రభుత్వాధినేతలు
ఎంతకైనా
తెగిస్తారన్నారు.
ప్రజాస్వామ్యాన్ని
గౌరవించే
వారు
నారాయణ
అరెస్టును
ఖండించాలని
రఘురామ
పిలుపునిచ్చారు.
ప్రభుత్వ
అన్యాయాలపై
ప్రశ్నించానికి
ఇప్పుడిప్పుడే
నాయకులు,
వారిని
చూసి
ప్రజలు
బయటికొస్తున్నారని
తెలిపారు.
ఓ
సీనియర్
నేతను
అరెస్ట్
చేస్తే
వీళ్లంతా
భయపడతారని
సర్కారు
భావిస్తోందని
రఘురామ
తెలిపారు.