తిరుమల డిక్లరేషన్: సీఎం జగన్ ఆ పని చేస్తే సరిపోతుంది కదా?: రఘురామ కృష్ణరాజు
న్యూఢిల్లీ: తిరుమల డిక్లరేషన్ అంశంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించరారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో వీవీఐపీలకు మాత్రమే మాత్రమే డిక్లరేషన్ విధానం ఉందని, గత జీవోను రద్దు చేయకుండా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని ఆయన అన్నారు.

హిందూ ఆలయాలపై దాడులక నిరసనగా..
ఢిల్లీలో రఘురామ కృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి పార్లమెంటు సమావేశాల్లో పాల్గొంటానని తెలిపారు. దేవాలయాల దాడుల అంశంపై సీబీఐ విచారణ అడుగుతుంటే తమ పార్టీ వాళ్లు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.

సీఎం జగన్ ఆ పని చేస్తే సరిపోతుంది కదా..
గత జీవోను రద్దు చేయకుండా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని రఘురామ రామకృష్ణ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసే అధికారం టీటీడీ ఛైర్మన్ లేదని అన్నారు. సీఎం జగన్ తిరుమల వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలని కోరుతున్నట్లు రఘురామ కృష్ణరాజు చెప్పారు. డిక్లరేషన్ విషయంలో చిన్న సంతకంతో పోయే దానికి ఎందికింత రచ్చ అని వ్యాఖ్యానించారు. గోటితో పోయేదానికి గొడ్డలికాదా తెచ్చుకోవడం ఎందుకని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు.

తనపై వేటు వేయలేరంటూ రఘురామ కృష్ణరాజు
ప్రజలు తనను బహిష్కరించలేదని.. వారధిగా భావిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఒకట్రెండు నెలల్లోనే తనను పార్టీ నుంచి బహిష్కరిస్తారని అనుకుంటున్నానని, తనపై అనర్హత వేటు వేయించడం సాధ్యం కాదని రఘురామ వ్యాఖ్యానించారు.
ఇక రాష్ట్రంలో రైతుభరోసా అమలులో ఆలస్యం జరుగుతోందని అన్నారు. రైతులకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచాలని సర్కారు సూచించారు.

అలా అనలేదని వైవీ సుబ్బారెడ్డి..
ఇది ఇలావుండగా, తిరుమలలో అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని తాను అనలేదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అయితే, కొన్ని మీడియా ఛానళ్లు, పత్రికలు తన వ్యాఖ్యలపై వివాదం చేస్తున్నాయని విమర్శించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ తాలకు చెందిన వేలాది మంది భక్తులు రోజూ వస్తుంటారని.. వారందరినీ డిక్లరేషన్ తప్పనిసరిగా అడగలేము కదా? అని మాత్రమే తాను అన్నానని చెప్పారు. తాను డిక్లరేషన్ తీసేయాలని చెప్పలేదని స్పష్టం చేశారు.