• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విజయసాయిపై రఘురామ రివర్స్ దాడి : నీ చరిత్ర అందరికీ తెలుసు, దొంగలెక్కల ఘనాపాటి, సీఎం దగ్గర శకుని !!

|

రఘురామ అనర్హత అంశంపై జరుగుతున్న రచ్చ చిలికి చిలికి గాలివానగా మారింది. రఘురామ వర్సెస్ విజయసాయి రెడ్డి అన్నట్టు పరిస్థితి తయారైంది. ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలతో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు.తాజాగా మరోమారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంటరీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీల భేటీలో పలు అంశాలపై చర్చించిన అనంతరం మాట్లాడిన ఎంపీ విజయసాయిరెడ్డి రఘురామకృష్ణంరాజు గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జగన్ కు రఘురామ మరో లేఖ.. తెలుగు భాషను భూస్థాపితం చేసే నిర్ణయాలపై రిఫరెండంకి వెళ్లాలని సూచనజగన్ కు రఘురామ మరో లేఖ.. తెలుగు భాషను భూస్థాపితం చేసే నిర్ణయాలపై రిఫరెండంకి వెళ్లాలని సూచన

రఘురామ క్యారెక్టర్ లేని వ్యక్తి అని సాయిరెడ్డి కౌంటర్

రఘురామ క్యారెక్టర్ లేని వ్యక్తి అని సాయిరెడ్డి కౌంటర్

రఘురామకృష్ణంరాజు గురించి మాట్లాడటానికి అది అంత ప్రధానమైన అంశమా .. ఒక వ్యక్తి గురించి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నించాల్సిన అవసరం ఏముంది ? చర్చిస్తారని మీరు అనుకుంటున్నారా అంటూ ఎదురు ప్రశ్నలు సంధించిన విజయ సాయి రెడ్డి రఘురామకృష్ణంరాజు ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి అని విలువలు లేని వ్యక్తి అని అతని గురించి సీఎంతో చర్చించాల్సిన అవసరం లేదని ఆయన సంగతి మా స్థాయిలోనే చూసుకోగల మంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి నా క్యారెక్టర్ గురించి మాట్లాడటం ఏమిటి.. రఘురామ రివర్స్ ఎటాక్

ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి నా క్యారెక్టర్ గురించి మాట్లాడటం ఏమిటి.. రఘురామ రివర్స్ ఎటాక్

దీనిపై రివర్స్ ఎటాక్ చేసిన రఘురామకృష్ణంరాజు సీఎం జగన్ మోహన్ రెడ్డి దగ్గర విజయసాయిరెడ్డి శకుని పాత్ర పోషిస్తున్నాడు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి నా క్యారెక్టర్ గురించి మాట్లాడటం ఏమిటి అంటూ నిప్పులు చెరిగారు. విజయ్ సాయి రెడ్డి దొంగ లెక్కలు వేయటంలో ఘనాపాటి ఏంటి పేర్కొన్న రఘురామకృష్ణంరాజు ఆయన చరిత్ర గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అంటూ నిప్పులు చెరిగారు .

 ఒక అర్భకుడి గురించి ఇంతకంటే ఎక్కువ స్పందిస్తే బాగోదన్న రఘురామ

ఒక అర్భకుడి గురించి ఇంతకంటే ఎక్కువ స్పందిస్తే బాగోదన్న రఘురామ

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయసాయి మెడలు వంచుతానని చెప్పి వెళ్లి కాళ్లు పట్టుకునే రకం అంటూ రఘురామ కృష్ణంరాజు విరుచుకుపడ్డారు. నాలుక అదుపులో పెట్టుకుంటే మంచిదని దిక్కుమాలిన పనికిమాలిన పదప్రయోగాలు చేస్తే బాగుండదని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఒక అర్భకుడి గురించి ఇంతకంటే ఎక్కువ స్పందిస్తే కూడా బాగుండదని కూడా రఘురామ రివర్స్ ఎటాక్ చేశారు.
అంతేకాదు మహిళా రాజకీయ నేతలతో, అధికారులతో విజయసాయిరెడ్డి ఉన్నంత చనువుగా నేను ఉండలేనంటూ నరసాపురం ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 పార్లమెంట్ లో ఏం చేస్తారో అందరికీ తెలుసు

పార్లమెంట్ లో ఏం చేస్తారో అందరికీ తెలుసు

పార్లమెంట్ లో గర్జిస్తామని, గాండ్రిస్తామని, పెకలించి వేస్తామని, స్తంభింపజేస్తామని చెప్పి అక్కడికి వెళ్లి ఏం చేస్తారో అందరికీ తెలుసు ఎద్దేవా చేశారు. నా అనర్హతపై అంత అతిగా మాట్లాడాలా అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది రఘురామకృష్ణంరాజు అనర్హతపై తెలుసుకోవాలంటే 10వ షెడ్యూల్ ను ఒకసారి చదువుకోవాలని హితవు పలికారు. ఇక రాజద్రోహానికి సంబంధించి 124 ఏ చట్టం కింద సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రఘురామకృష్ణంరాజు సుప్రీం వ్యాఖ్యలు భేష్ అంటూ వ్యాఖ్యానించారు.

  With Revath Reddy taking over PCC leaders of various parties are coming to join the Congress party.
   రాజద్రోహం చట్టం పై సుప్రీం వ్యాఖ్యలను భేష్ అన్న రఘురామ

  రాజద్రోహం చట్టం పై సుప్రీం వ్యాఖ్యలను భేష్ అన్న రఘురామ

  చట్టాన్ని తమ రాజకీయ హక్కుల కోసం ఫ్యాక్షనిస్టు దుర్వినియోగం చేస్తున్నారని పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని అభిప్రాయపడ్డారు. ఇక అందులో భాగంగానే తనపై కూడా ఈ చట్టం కింద అక్రమంగా కేసులు బనాయించారని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఇక వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది అంటూ హితవు పలికారు. తన క్యారెక్టర్ గురించి మాట్లాడే గొప్ప కారెక్టర్ విజయసాయిరెడ్డిది కాదని రఘురామ రివర్స్ ఎటాక్ చేశారు.

  English summary
  Raghurama Krishnamraju made a reverse attack on YSRCP MP Vijayasaireddy. He countered Vijayasaireddy playing Shakuni role near CM Jagan Mohan Reddy, and slams a person who doesn’t have a character he is talking about his character.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X