• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రఘురామపై వేటు ఖరారు.. ముహుర్తం ఫిక్స్ చేసిన జగన్.. వైసీపీలో ఒక్కరూ మిగలరన్న రెబల్..

|

''ఇన్నాళ్లూ మా పార్టీలో జరుగుతోన్న పరిణామాలన్నీ సీఎం జగన్ కు తెలియవేమో అనుకున్నాను. కానీ నాపై ఫిర్యాదు చేసేందుకు ఎంపీలను, అడ్వకేట్లను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పంపిస్తున్నారంటే.. అంతా జగన్ కనుసన్నల్లోనే జరుగుతోందని అర్థమైపోయింది. వాళ్ల ఢిల్లీ పర్యటనతో ఎలాంటి ఉపయోగం ఉండదు. అయినా, ప్రజాసమస్యలను ప్రస్తావించిన అందరినీ సాగనంపితే వైసీపీకి పార్లమెంటులో ఒక్కరూ మిగలరు...'' అంటూ మండిపడ్డారు నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు. కొంతకాలంగా పార్టీలో వేడిపుట్టిస్తోన్న రెబల్ ఎంపీ వ్యవహారాన్ని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఎట్టకేలకు ఫిక్స్ చేశారు.

సీఎం జగన్ కు కలిసిరాని 3 అంకె.. మాడు పగిలేందుకేనన్న టీడీపీ.. డీజీపీకి చంద్రబాబు లేఖ..

జగన్ పై నిప్పులు..

జగన్ పై నిప్పులు..

పార్టీ లైన్ కు విరుద్దంగా మాట్లాడినందుకు వివరణ ఇవ్వకపోగా, షోకాజ్ నోటీసుల చట్టబద్ధతనే ప్రశ్నిస్తూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు ఎంపీ రఘురామ. అయితే, ఇప్పటిదాకా పార్టీ నేతల్ని, మరీ ముఖ్యంగా విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చిన ఆయన.. తొలిసారి సీఎం జగన్ పైనా తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. అంతా సీఎం కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపిస్తూ, పార్టీలో ఒక్కరూ మిగలరని శాపనార్థాలు పెట్టారు. గురువారం ఈ మేరకు ఆయన వ్యాఖ్యలు చేసే సమయానికే వైసీపీ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడింది..

వేటేయాని నిర్ణయించాం..

వేటేయాని నిర్ణయించాం..

బీజేపీ అనుకూల, వైసీపీ వ్యతిరేక విధానంతో కొద్దిరోజులుగా పంటికింద రాయిలా మారిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారాన్ని ఎట్టకేలకు సీఎం జగన్ ఫిక్స్ చేశారు. రఘురామపై అనర్హత వేటు వేయాలని పార్టీ నిర్ణయించినట్టు ముఖ్యనేత సజ్జల రామకృష్ణ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఆయనీ విషయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా అసంతృప్త నేతలను ఉద్దేశించి సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు.

సాయిరెడ్డికి సీఎం జగన్ షాకిచ్చారా?.. వైసీపీలో ఎంపీ బాధ్యతలకు భారీ కోత.. సజ్జలకు పెద్ద పీట..

వైసీపీలో అందరికీ స్వేచ్ఛ..

వైసీపీలో అందరికీ స్వేచ్ఛ..

‘‘నిజం చెప్పాలంటే వైసీపీలో ఉన్నంత స్వేచ్ఛ మరే ఇతర పార్టీల్లోనూ ఉండదు. పార్టీ అధినేతే ముఖ్యమంత్రి కావడంతో పని ఒత్తిడి వలన కొన్ని సందర్భాల్లో కొందరికి సమయం కేటాయించే వీలు లేకపోవచ్చు. కానీ నేతలు, శ్రేణులతో ఏనాడూ కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రం రానేలేదు. రఘురామకృష్ణం రాజు విషయానికొస్తే ఆయన ఉద్దేశాలు వేరు. తన వ్యక్తిగత ఉద్దేశాల కోసం పార్టీని నష్టపరిచే ప్రయత్నం చేచేశారాయన. పార్టీ నేతల బృందం ఢిల్లీ వెళుతోంది''అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

  YS Jagan Inaugurates New Ambulance Services In AP | 104,108 సేవ‌లలో కొత్త శ‌కం || Oneindia Telugu
  ఢిల్లీకి వైసీపీ టీమ్..

  ఢిల్లీకి వైసీపీ టీమ్..

  నర్సాపురం ఎంపీ విషయంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు వైసీపీ ఎంపీల బృందం శుక్రవారం ఢిల్లీకి వెళ్లనుంది. వారంతా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి... రఘురామపై అనర్హత వేటుకు అవసరమైన అన్ని ఆధారాలను సమర్పించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎంపీల బృందానికి న్యాయపరమైన సలహాలు అందించేందుకు కొందరు అడ్వకేట్లు కూడా ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం. స్పీకర్ తో భేటీ తర్వాత రఘురామపై వేటుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

  మళ్లీ మోదీ గానం..

  మళ్లీ మోదీ గానం..

  చైనాతో సరిహద్దు వివాదాన్ని ప్రధాని మోదీ అద్భుతంగా డీల్ చేస్తున్నారంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఓ పాట విడుదల చేయడం తెలిసిందే. తాజాగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప‌థ‌కాన్ని న‌వంబ‌ర్ వ‌ర‌కు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయంపైనా ప్ర‌శంస‌లు కురిపించారు వైసీపీ ఎంపీ. దయ గల మనిషిగా మోదీని చరిత్ర గుర్తుంచుకుంటుదన్నారు. అయితే జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 108, 104 సర్వీసులపై మాత్రం ఎంపీ మాట వరుసకైనా స్పందించకపోవడం గమనార్హం.

  English summary
  as team of ysrcp mps likely to meet lok sabha speaker om birla on friday, the rebel mp raghu rama krishnam raju now targets cm jagan. sajjala ramakrishna reddy clarifies that rebel mp will be suspended.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more