వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినిమాను మించి సీఎం జగన్ కామెడీ - బెంగళూరుకు దగ్గరగా క్యాపిటల్ - తోలు తీస్తామంటారా?: ఎంపీ రఘురామ

|
Google Oneindia TeluguNews

పాలన వికేంద్రీకరణ లేదా అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేస్తోనన ఫీట్లు కామెడీ సినిమాను మించి నవ్వుతెప్పిస్తున్నాయని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. రాజధాని విషయంలో కేంద్రం అఫిడవిట్‌తో బాధపడాల్సిన పనిలేదని అమరావతి రైతులకు భరోసా ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వివాదంపై బీజేపీ నేతల తీరును తప్పుపట్టారు. రాయలసీమ అభివృద్ధిపై సీఎంకు సవాళ్లు కూడా విసిరారు. మొత్తంగా రఘురామ సొంతపార్టీపై ఎదురుదాడిని మరింత తీవ్రతరం చేశారు.

పడక పైనే ప్రేమ వివాహం - కాళ్లు విరగొట్టి కన్యాదానం - అనంతపురం జిల్లాలో వింత పెళ్లిపడక పైనే ప్రేమ వివాహం - కాళ్లు విరగొట్టి కన్యాదానం - అనంతపురం జిల్లాలో వింత పెళ్లి

కేంద్రం అఫిడవిట్‌పై..

కేంద్రం అఫిడవిట్‌పై..

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఎక్కడుండాలని నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉందంటూ కేంద్ర సర్కార్ అఫిడవిట్ దాఖలు చేయడం ఒకిత బాధ కలిగించిందని ఎంపీ రఘురామ అన్నారు. అయితే, సదరు అఫిడవిట్‌తో అమరావతి రైతులుగానీ, మిగతా ఆంద్రులుగానీ కలత చెందాల్సిన అవసరం లేనేలేదని, తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీలో మీడయాతో మాట్లాడిన ఆయన విశాఖపట్నంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

టైటిల్ మార్చాలి..

టైటిల్ మార్చాలి..

‘‘కేవలం రాజధానిని అమరావతి నుంచి తరలించే సినిమాకు ‘పాలన వికేంద్రీకరణ' అనే అనే టైటిల్ పెట్టారు. వాస్తవానికి ఈ సినిమాకు పెట్టాల్సిన సరైన టైటిట్ ‘అభివృద్ధి కేంద్రీకరణ'. ఎందుకంటే.. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖపట్నాన్ని ఇంకా డెవలప్ చేస్తామని చెబుతున్నారు. అసలు విశాఖలోగానీ ఉత్తరాంధ్రలోగానీ లేనిదేంటి? దేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్, దేశంలోనే అత్యధిక ఎగుమతులు జరిపే పోర్టు, బీహెచ్ఈఎల్, గంగవరం పోర్టు, భోగాపురం ఎయిర్ పోర్టు.. ఇవన్నీ విశాఖకు మణిహారాలేకదా, ఇప్పుడు కొత్తగా రాజధాని అక్కడ పెట్టడం ‘అభివృద్ధి కేంద్రీకరణే' అవుతుంది కదా.

కమ్మ వర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు - ఏపీలో లేడు, ట్యాపింగ్ ఏంటి? - వల్లభనేని వంశీ -బచ్చుల కౌంటర్కమ్మ వర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు - ఏపీలో లేడు, ట్యాపింగ్ ఏంటి? - వల్లభనేని వంశీ -బచ్చుల కౌంటర్

జంధ్యాల కన్నా జగన్ కామెడీనే..

జంధ్యాల కన్నా జగన్ కామెడీనే..

శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం దాకా పరిశ్రమలు ఉన్నాయన్నాయి. వెనుకబడిందని చెబుతోన్న విజయనగరం జిల్లాలో దాదాపు రూ.3 వేల కోట్ల వ్యయంతో విమానాశ్రయం నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు వద్ద భారీ సీ పోర్టు వస్తోంది. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా అక్కడే ఉంది. చివరికి విజయసాయిరెడ్డి గారి బంధువులకు చెందిన ఫార్మా సంస్థ కూడా అక్కడే ఉంది. విశాఖలో ఐదు వందల ఎకరాల్లో హెటెరో డ్రగ్స్ సంస్థ ఉంది. దేశంలో టాప్ సిటీల్లో ఒకటిగా ఉన్న విశాఖను మళ్లీ మేం అభివృద్ధి చేస్తామంటూ సీఎం జగన్, మా పార్టీ నేతలు చెబుతున్న మాటలు... జంధ్యాల, ఈవీవీ, బసు భట్టాచార్య సినిమాలను మించిన కామెడీ చేసినట్టుగా ఉంది.

బెంగళూరుకు దగ్గరగా క్యాపిటల్..

బెంగళూరుకు దగ్గరగా క్యాపిటల్..

టాప్ సిటీ విశాఖపట్నాన్ని పాడు చేయకుండా ఉంటే అదే పదివేలు. ఇది విశాఖ ప్రజల తరఫున నేను ప్రభుత్వానికి చేస్తున్న విన్నపం. అయినా, నిజంగా అభివృద్ధి వికేంద్రీకరణ కావాలంటే.. కదపడానికి వీలులేని హైకోర్టును అమరావతిలోనే ఉంచేసి, లెజిస్లేటివ్ క్యాపిటల్ ను రాయలసీమలో పెట్టాలి. అది కూడా.. బెంగళూరుకు దగ్గరగా ఉంటుంది కాబట్టి మరిన్ని పరిశరమలను తీసుకురావొచ్చు. నేనిలా మాట్లాడటం నా ప్రియమిత్రుడు అవంతి శ్రీనివాస్ కు కోపం తెప్పించొచ్చు.. తోలు తీస్తానని ఆయన వార్నింగ్ ఇవ్వొచ్చు.. కానీ నేను చెప్పేది విశాఖ ప్రజల మనోగతం. ఆంధ్రా యూనివర్సిటీలో ఆరేళ్లు చదివాను. అక్కడి ప్రజలు రౌడీయిజాన్ని ఇష్టపడరు. రాజధాని పేరుతో వాళ్ల ప్రశాంతతను చెడగొట్టొద్దు'' అని ఎంపీ రఘురామ చెప్పుకొచ్చారు.

జీవీఎల్‌పై రఘురామ ఫైర్

జీవీఎల్‌పై రఘురామ ఫైర్

ఏపీ రాజకీయలను కుదిపేస్తోన్న ఫోన్ ట్యాపింగ్ అంశంపైనా నర్సాపురం ఎంపీ వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కు తెలియకుండా ఆయన చుట్టూ ఉన్నవాళ్లే ట్యాపింగ్ లకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన రఘురామ.. సమగ్ర దర్యాప్తు జరగాల్సినవేళ.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేంద్రం పరిధిలోకి రాదని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ప్రకటించడం అసంబద్ధంగా ఉందని మండిపడ్డారు. జాతీయ పార్టీలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానాన్ని అనుసరిస్తాయని, ఫోన్ ట్యాపింగ్‌పై జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమై ఉండొచ్చని రఘురామ అన్నారు.

English summary
'vishakhapatnam is already a developed city, my concern is cm jagan wold not distroy is' says ysrcp rebel mp raghurama krishnam raju. speaking to media at delhi on thursday, the mp slams cm jagan over three capitals and phone tapping issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X