వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓడిపోయా: పోటీ నుంచి తప్పుకున్న కృష్ణంరాజు

By Pratap
|
Google Oneindia TeluguNews

 Raghurama Krishnam Raju withdraws from the contest
ఏలూరు: నర్సాపురం లోకసభ స్థానానికి నామినేషన్ వేసిన బిజెపి నాయకుడు రఘురామ కృష్ణంరాజు పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయన శనివారంనాడు ప్రకటించారు. తనను కాదని గోకరాజు రంగారాజుకు బిజెపి టికెట్ ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో చర్చించి ఆయన నామినేషన్ దాఖలు చేశారు.

నర్సాపురం టికెట్ తెచ్చుకోవడంలో తాను ఓడిపోయానని ఆయన అన్నారు. తన సొంత నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాని ఆయన చెప్పారు. తాను బిజెపి, తెలుగుదేశం కూటమితోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. కొన్ని సంస్థల కారణంగానే తనకు టికెట్ రాలేదని ఆయన అన్నారు.

తనకు టికెట్ రాకపోవడం బాధించినా ప్రజల మద్దతు చూసి సంతోషం వేసిందని ఆయన అన్నారు. బిజెపి, తెలుగుదేశం కూటమికి నష్టం చేసే చర్యలకు పాల్పడబోనని ఆయన అన్నారు. తెలుగుదేశంతో పొత్తులో భాగంగా నర్సాపురం టికెట్ బిజెపికి వెళ్లింది.

నిజానికి, నర్సాపురం నుంచి రఘురామకృష్ణం రాజుకు టికెట్ లభిస్తుందని అందరూ ఆశించారు. కానీ, బిజెపి రంగరాజు పేరును ఖరారు చేసింది. దీనిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
BJP rebel candidate at Narsapuram Lok Sabha seat Raghurama Krishnamraju has withdrawn from the contest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X