India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఎంవో జాబితాలోలేని రఘురామ పేరు.. విగ్గూ.. పెగ్గూ, నీజాతకం బీజేపీపెద్దలకు తెలుసు: ఆడేసుకున్న సాయిరెడ్డి

|
Google Oneindia TeluguNews

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంత నియోజకవర్గంలో జరిగిన అల్లూరి జయంతి ఉత్సవాలలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న ఈ కార్యక్రమంలో పీఎంవో జాబితాలో కూడా రఘురామకృష్ణంరాజు పేరు లేకపోవడంతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కి ఆయుధం దొరికినట్లయింది. సోషల్ మీడియా వేదికగా రఘురామ కృష్ణంరాజు పై విరుచుకు పడుతున్న ఆయన రఘురామకృష్ణం రాజుకు రాష్ట్రంలోనే కాదు కేంద్రం వద్ద కూడా ఏమాత్రం పరపతి లేదంటూ తేల్చి చెప్పారు.

పీఎంవో జాబితాలో లేని రఘురామ పేరు.. ఆడేసుకున్న సాయిరెడ్డి

పీఎంవో జాబితాలో లేని రఘురామ పేరు.. ఆడేసుకున్న సాయిరెడ్డి


తనకు వైసిపి ప్రాధాన్యత ఇవ్వకున్నా, కేంద్రంలోని బిజెపి దగ్గర తనకు చాలా ప్రియారిటి ఉందని చెప్పు వచ్చే రఘురామకృష్ణంరాజు కు పీఎంవో ప్రోటోకాల్ జాబితాలో పేరు లేకపోవడం పెద్ద షాక్ అనే చెప్పాలి. కేంద్ర పెద్దలతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పుకునే రఘురామ ఇప్పుడు అల్లూరి జయంతి ఉత్సవాల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలతో , పీఎంఒ ప్రోటోకాల్ జాబితాలో పేరు లేకపోవటంపై మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. ఒకరకంగా ఆయన తన వెనుక బీజేపీ ఉందని చెప్పుకునే యత్నం చేసిన పరిస్థితి నుండి ఆయన వెనుక ఎవరూ లేరనే స్థితి వచ్చింది. ఇక ఇదే అదునుగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇంతన్నాడు, అంతన్నాడు అంటూ రఘు రామ కృష్ణంరాజును ఎద్దేవా చేశారు. నీ బతుకు సులభ్ కాంప్లెక్స్ ల దగ్గర సబ్బులు అమ్ముకోవటమే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నువ్వు ఎటూ కాని బఫూన్ గాడివి.. నీ జాతకం బీజేపీ పెద్దలకు తెలుసన్న సాయిరెడ్డి

నువ్వు ఎటూ కాని బఫూన్ గాడివి.. నీ జాతకం బీజేపీ పెద్దలకు తెలుసన్న సాయిరెడ్డి

పీఎంవో జాబితాలో పేరు లేదంటేనే అర్థమైంది నువ్వు ఎటూ కాని బఫూన్ గాడివని అంటూ రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. టికెటిచ్చిన పార్టీకి ద్రోహం చేసి, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన నికృష్టుడివి అని విరుచుకుపడ్డారు. నీ జాతకం బిజెపి పెద్దలకు తెలియదా అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి, అందుకే పీఎంఓ జాబితాలో పేరు లేదు అన్నట్టు వ్యాఖ్యలు చేశారు . కడుపుకి ఏం తింటున్నావో ఏమో ఇంత లుచ్చా గాడివి అయ్యావేమిట్రా విగ్గూ? ఎందుకురా నీ బ్రతుకు. అంటూ దూషణలకు దిగారు.

పెగ్గేసి, విగ్గు పెట్టుకున్నంత ఈజీఅనుకున్నాడే ఈ దుబ్బరాజు : సాయిరెడ్డి వ్యంగ్యం

పెగ్గేసి, విగ్గు పెట్టుకున్నంత ఈజీఅనుకున్నాడే ఈ దుబ్బరాజు : సాయిరెడ్డి వ్యంగ్యం

అంతన్నడు, ఇంతన్నడే విగ్గు రాజు, రైలుదిగి పారిపోయిండే పెగ్గు రాజు అంటూ రఘురామకృష్ణంరాజు అల్లూరి జయంతి ఉత్సవాలకు రాకపోవడంపై సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం అంటే పెగ్గేసి, విగ్గు పెట్టుకున్నంత ఈజీఅనుకున్నాడే ఈ దుబ్బరాజు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు సులభ్ కాంప్లెక్స్ ల దగ్గర సబ్బులు అమ్ముకునే రోజు తొందర్లో ఉంది ఈ గబ్బుగాడికి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. 'పచ్చ'కామెర్లు వచ్చాయి ఈ నానాజాతి గాడికి అంటూ విరుచుకు పడ్డ సాయి రెడ్డి ఈ ఎంగిలి బతుకుగాడి సమస్య ఇదేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నీ మీద కుట్ర చేస్తే చంద్రబాబే చెయ్యాలి: సాయి రెడ్డి

నీ మీద కుట్ర చేస్తే చంద్రబాబే చెయ్యాలి: సాయి రెడ్డి


రఘురామకృష్ణంరాజు భీమవరం లో జరిగిన అల్లూరి జయంతి వేడుకలకు వస్తానని బయలుదేరి, మళ్లీ మధ్యలోనే రాకుండా వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. వస్తే తనను అరెస్టు చేస్తారన్న ఆందోళనతో రఘు రామ వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఎందుకు బయల్దేరి, ఎందుకు రైలు దిగి పారిపోయాడు ఈ ఆవారా గాడు, తాగి పడుకోక అంటూ రఘురామకృష్ణరాజు పై సెటైర్లు వేసిన విజయసాయిరెడ్డి రఘురామ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. బోగీ తగలబెట్టే కుట్ర సిద్ధాంతం ఏంట్రా విగ్గూ? అంటూ ప్రశ్నించినా సాయి రెడ్డి ఎప్పుడో ఆ బొల్లిగాడే నిన్ను లేపేసి ఇతరుల మీదకు నెడతాడు అంటూ చంద్రబాబు నాయుడుని సైతం టార్గెట్ చేశారు. ఇంట్లో కప్పుకూలి మీద పడొచ్చు. గ్రహశకలం వచ్చి తలపైన పడొచ్చు. చస్తూ బతికే శాపం ఏదో ఉందిరా నీకు పెగ్గుగా! అంటూ విజయ సాయి రెడ్డి రఘురామ కృష్ణంరాజు చస్తూ బతుకుతున్నాడు అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

English summary
YSRCP MP Vijayasai Reddy targeted Raghurama Krishnam Raju saying that there is no name of Raghurama Krishnam Raju in the PMO list, BJP leaders know that he is a buffoon and worst fellow..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X