• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రఘురామకు వైఎస్ జగన్ పై నిజమైన ప్రేమ...రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో పోలుస్తూ వర్మ విచిత్ర ట్వీట్

|

ఏపీలో అధికార వైసీపీకి తలనొప్పిగా మారాడు నరసాపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. పార్టీకి వ్యతిరేకంగా రఘురామ ప్రవర్తిస్తున్నాడని షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఆ తర్వాత రఘురామ జాతీయ ప్రధాన కార్యదర్శి పేరుతో తనకు నోటీసులు జారీ చేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి రివర్స్ నోటీసు ఇవ్వడం,ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు వరుసగా చర్చనీయాంశంగా మారాయి.

"మారుతి వధించిన ప్రణయామృత విషాద గాధ "..మరో రెండు పోస్టర్లు ..కాంట్రవర్సీలతో ఆర్జీవీ మర్డర్

 వైసీపీ ఎంపీ రఘురామపై వర్మ ట్వీట్

వైసీపీ ఎంపీ రఘురామపై వర్మ ట్వీట్

రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో ప్రతిపక్షాలు కూడా దూరి మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ సందర్భంగా నేనేమైనా తక్కువ తిన్నానా అంటూ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు రాంగోపాల్ వర్మ తన వ్యాఖ్యలతో పొగిడారా తిట్టారా అనేది మాత్రం అర్థం కాకుండా చాలా వ్యంగ్యంగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ను మాత్రమే టార్గెట్ చేసే రాంగోపాల్ వర్మ ఈసారి అధికార వైసీపీపై చేసిన విచిత్రమైన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

 రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ముడిపెట్టి జగన్ పై రఘురామ ప్రేమ

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ముడిపెట్టి జగన్ పై రఘురామ ప్రేమ

రాంగోపాల్ వర్మ వైసీపీ ఎంపీ వ్యవహారాన్ని, రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ముడి పెట్టి ట్వీట్ చేశారు. సినిమాను ప్రేమించే రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' ఎప్పుడు విడుదల అయ్యి సినిమా థియేటర్లను కాపాడుతుందో నాకు తెలీదు కానీ వైయస్సార్సిపిని కాపాడటానికి మాత్రం జగన్ ను ప్రేమించే వ్యక్తి ఆర్ఆర్ఆర్ ఇప్పటికే వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది అంటూ విచిత్రమైన ట్వీట్ చేశారు. ఇందులో ఆర్ఆర్ఆర్ అంటే రఘురామకృష్ణంరాజు అని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు.

 స్పందిస్తున్న నెటిజన్లు

స్పందిస్తున్న నెటిజన్లు

ఇక రఘురామకృష్ణంరాజు జగన్ పై స్వచ్ఛమైన ప్రేమను కనబరుస్తారు అంటూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు రాంగోపాల్ వర్మ. నెటిజన్లు ఈ ట్వీట్ పై బాగానే స్పందించారు. రాం గోపాల్ వర్మను టార్గెట్ చేసి నీకెందుకు ఈ రాజకీయాలు అని కొందరు వ్యాఖ్యలు చేస్తే కొన్ని లవ్ లు అంతే .. రాపాక కు జనసేన మీద ఉన్న ప్రేమ, ఆర్ఆర్ఆర్ కు జగన్ మీద ఉంది అంటూ పేర్కొన్నారు.

  Pawan Kalyan Is The Future CM - Ram Gopal Varma || Oneindia Telugu
  రఘురామ వ్యవహారంలోనూ వేలు పెట్టిన వర్మ

  రఘురామ వ్యవహారంలోనూ వేలు పెట్టిన వర్మ

  ఇక ఇప్పటికే రఘురామకృష్ణంరాజు వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారి ఏపీ అధికార పార్టీలో ముసలం పుట్టించింది. విజయసాయి రెడ్డి ని టార్గెట్ చేస్తున్న రఘురామ ఏ మాత్రం తగ్గకుండా షోకాజ్ నోటీసుకు సమాధానంగా విమర్శల వర్షం కురిపించారు. విజయసాయి రెడ్డి కి చెమటలు పట్టించారు. ఇక తాజాగా నేడు ఆయన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ కానున్నారు. నిన్న రాత్రి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ను కలిసిన ఆయన తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు రఘురామకృష్ణంరాజు విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. ఇక కేంద్ర రాజకీయాల్లోనూ ఆసక్తికరంగా మారిన రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో వర్మ కూడా వేలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది

  English summary
  controversial director RGV made interesting tweet on ap politics especially raghurama krishnam raju issue in ruling party . He tweeted that I don’t know when the film loving ssrajamouli‘s RRR will come to save theatres ,but am glad that the Jagan loving RRR (Raghu Ramakrishna Raju) already came to save YSRCP and that’s only because he really truly loves ysjagan
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X