• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రఘువీరాకు పవన్‌ కళ్యాణ్ ఫోన్‌...స్పందించలేదంట...ఎందుకంటే?

|

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపు విషయమై చర్చించేందుకు పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఫోన్‌ చేశారు. అయితే ఆ సమయంలో పోన్ రఘవీరారెడ్డి వద్ద లేకపోవడంతో ఆయన స్పందించలేకపోయారని తెలిసింది. అయితే పవన్ కళ్యాణ్ మరోసారి ప్రయత్నించిన మీదట కాల్ లిఫ్ట్ చేసిన రఘువీరా సతీమణి మరొక రోజు మాట్లాడాలంటూ పవన్ కు సూచించారని ప్రచారం జరుగుతోంది.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై నిజనిర్ధారణ కమిటీ వేసి వాస్తవాలు వెల్లడిస్తామని పవన్‌ కల్యాణ్‌ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇదే విషయమై చర్చించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డికి ఫోన్‌ చేశారని తెలిసింది.అయితే పవన్ ఫోన్ కాల్ కు రఘువీరారెడ్డి స్పందించకపోవడానికి కారణం నిజంగా ఆయన అందుబాటులో లేకపోవడమేనా లేక ఆయనకు పవన్ కళ్యాణ్ జెఎఫ్సి పట్ల ఆసక్తి లేకనా అనే చర్చ నడుస్తోంది

పవన్ జెఎఫ్సి...మద్దతు కోసం...

పవన్ జెఎఫ్సి...మద్దతు కోసం...

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిన దరిమిలా జనసేన అధినేత పవన్‌ సంయుక్త నిజ నిర్థారణ కమిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. లోక్‌సత్తా నేత జయప్రకాష్‌ నారాయణ, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఈ కమిటీకి తమ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన లోగోను కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే విడుదల చేయడం జరిగింది.

పవన్ కాల్ చేశారు...రఘువీరా లిఫ్ట్ చెయ్యలేదు...

పవన్ కాల్ చేశారు...రఘువీరా లిఫ్ట్ చెయ్యలేదు...

ఈ నేపథ్యంలో జెఎఫ్ సికి రఘువీరా మద్దతు కోరేందుకు పవన్ కళ్యాణ్ సోమవారం ఆయనకు ఫోన్ చేశారట. అయితే ఆరోజు రఘువీరా రెడ్డి పుట్టినరోజు కావడంతో ఆయన పవన్ ఫోన్ కు స్పందించలేకపోయారని తెలిసింది. పైగా రఘువీరా తన పుట్టినరోజున ఫ్యామిలీకే పూర్తి సమయం కేటాయిస్తారట. అందువల్ల పవన్ ఫోన్ చేసిన రోజు ఆ సమయంలో ఫోన్ రఘువీరా వద్ద లేదట...దీంతో తన ఫోన్ కాల్ కు రఘువీరా స్పందించక పోవడంతో పవన్ కళ్యాణ్ మరోసారి కాల్ చేశారట.

ఫుట్టినరోజు...మరొక రోజు...

ఫుట్టినరోజు...మరొక రోజు...

అయితే పవన్ రెండోసారి ఫోన్ చెయ్యడంతో...వరుసగా ఫోన్ మోగుతుండటం...వస్తున్న నంబర్ కూడా ఫ్యాన్సీ నంబర్ కావడంతో విషయం తెలుసుకునేందుకు రఘువీరా సతీమణి సునీత ఫోన్ లిఫ్ట్ చేశారట. దీంతో తాను పవన్ కళ్యాణ్ నని, రఘువీరాతో మాట్లాడాలని పవన్ కోరగా...ఆయన సతీమణి సునీత...ఈరోజు రఘువీరా పుట్టిన రోజని...రాజకీయాలు దయచేసి మరో రోజు మాట్లాడాలని...తమ పరిస్థితి అర్థం చేసుకోవాలని కోరారట...దీంతో పవన్ కళ్యాణ్ చేసేదేమీ లేక మిన్నకుండిపోయారని ప్రచారం జరుగుతోంది. అయితే మరోవాదన కూడా వినిపిస్తోంది...పవన్ కళ్యాణ్ జెఎఫ్సి పట్ల రఘువీరాకు ఆసక్తి లేక ఆ విధంగా చేసి ఉంటారని ఆ పార్టీ వారే కొందరంటున్నారు

అదంతా ఏం కాదు...అందుబాటులో లేరంతే!

అదంతా ఏం కాదు...అందుబాటులో లేరంతే!

అయితే...ఇదంతా వట్టి ప్రచారమేనని...అసలు జరిగిందేమిటంటే...రఘువీరా పుట్టిన రోజు కావడంతో కుటుంబ సభ్యులు మినహా ఎవరికీ అందుబాటులేరని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అందువల్ల రఘువీరా పవన్ తో ఫోన్ లో మాట్లాడలేకపోయారే తప్ప అంతకుమించి మరేం లేదంటున్నారు. అయితే అసలు విషయం ఏమిటనేది అటు పవన్ కళ్యాణో...ఇటు రఘవీరానో చెబితే తప్ప బైటకు తెలిసే అవకాశం లేదు మరి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pawan Kalyan formed a Joint Fact Finding Committee (JFFC) comprising of Jayaprakash Narayana, Undavalli Arun Kumar and CPI Narayana to bring all the political parties under one platform over Union Budget 2018. In this background...Jana Sena Supremo called AP Congress chief Raghuveera Reddy on Monday to convey birthday greetings and exchange views. However, Close Coterie of PCC Chief informed Jana Sena Leader that Reddy won't interact with anyone other than family members on his birthday.It's been reported that Pawan Kalyan had even attempted to contact Raghuveera Reddy through his wife Sunitha. Even she seems to have suggested PK to discuss about politics some other day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more