వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి ఎంపీగా బ‌రిలోకి వంగ‌వీటి రాధా : వైసిపి లో ఇస్తామ‌న్న‌దీ ఇదే : టార్గెట్ ఫిక్స్..!

|
Google Oneindia TeluguNews

తాజాగా టిడిపిలో చేరిన వంగ‌వీటి రాధా ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌టం దాదాపు ఖాయ‌మైంది. ఆయ‌న వైసిపి లో తొలుత విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుండి పోటీ కోసం ప్ర‌య‌త్నించారు. అయితే, అప్ప‌టికే తాను ఇచ్చిన హామీ మేర‌కు ఆ సీటును మ‌ల్లాది విష్ణుకు ఇస్తున్నామ‌ని చెబుతూ ప్ర‌త్య‌మ్నాయం చెప్పారు. అందుకు రాధా అంగీక‌రించ‌లేదు. వైసిపి వీడి అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ల త‌రువాత టిడిపిలో చేరారు. ఇప్పుడు ఆయ‌న‌కు అక్క‌డ లోక్‌స‌భ సీటు కేటాయింపు దాదాపు ఖాయ‌మైంది.

<strong>చిక్కుల్లో వైసిపి : బీజేపీతో రహస్య సంబంధాలు :టైమ్స్‌ నౌ స్టింగ్‌ ఆపరేషన్‌...!</strong>చిక్కుల్లో వైసిపి : బీజేపీతో రహస్య సంబంధాలు :టైమ్స్‌ నౌ స్టింగ్‌ ఆపరేషన్‌...!

ఎంపీగా బ‌రిలోకి రాధా..

ఎంపీగా బ‌రిలోకి రాధా..

తొలి నుండి వంగ‌వీటి రాధా విజ‌య‌వాడ సెంట్ర‌ల్ సీటు పై దృష్టి పెట్టారు. వైసిపి లో ఉన్న స‌మ‌యంలోనే త‌న‌కు అదే సీటు కావాల‌ని ప‌ట్టు బ‌ట్టారు. అయితే ,ఆ సీటు ఇవ్వ‌లేమ‌ని వైసిపి స్ఫ‌ష్టం చేసింది. ప్ర‌త్య‌మ్నాయంగా విజ‌య‌ వాడ వెస్ట్ లేదా మ‌చిలీప‌ట్నం ఎంపీ సీటు నుండి పోటీ చేయ‌మ‌ని ఆఫ‌ర్ ఇచ్చింది. రాధా స‌సేమిరా అన్నారు. ఆ త‌రు వాత అనేక ర‌కాలుగా మంత‌నాలు జ‌రిపి..ల‌గ‌డ‌పాటి రాయ‌బారం తో ఎట్ట‌కేల‌కు టిడిపిలో చేరారు. చేరిక స‌మ‌యంలో నూ టిడిపి అధి నేత చంద్ర‌బాబు స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చారు. రాధా కు స‌ముచిత స్థానం క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఆ స‌మ‌యంలో రాధా అభిమానులు మ‌చిలీపట్నం సీటు అంటూ నినాదాలు చేసారు. అయినా..ముఖ్య‌మంత్రి మాత్రం తాను చూసుకుంటాన‌ని రాధా సేవ‌లు పార్టీ ఏ విధంగా వినియోగించుకోవాలో ఆలోచ‌న చేస్తుంద‌ని చెప్పుకొచ్చారు.

అన‌కాపల్లి లోక్‌స‌భ సీటు పై..

అన‌కాపల్లి లోక్‌స‌భ సీటు పై..

వంగ‌వీటి రాధాను తొలుత మంచిలీట్నం నుండి బ‌రిలో దింపాల‌ని ఆలోచ‌న చేసారు. అయితే, అక్క‌డ సిట్టింగ్ ఎంపి బిసి వ‌ర్గానికి చెందిన నారాయ‌ణ ను ఇప్ప‌టికే ఖ‌రారు చేసారు. దీంతో..అక్క‌డ అభ్య‌ర్ధిని మారిస్తే కొత్త సమస్య‌లు వ‌స్తాయ‌ని భావించి..రాధా కోసం ప్ర‌త్యామ్న‌య సీట్ల పై దృష్టి పెట్టారు. కాపు వ‌ర్గం ఎక్కువ‌గా ప్ర‌భావం చూపే లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం పై చ‌ర్చ‌లు సాగుతున్న‌ట్లు స‌మాచారం. విశాఖ జిల్లా అన‌కాప‌ల్లి లోక్‌స‌భ స్థానం పై రాధాతో ప్ర‌తిపాదిం చిన‌ట్లు తెలుస్తోంది. రాధా టిడిపిలో చేరిక స‌మ‌యంలో విశాఖ జిల్లా మంత్రి గంటా సైతం ఉన్నారు. ఆయ‌న తో ఈ ప్ర‌తిపాద‌న పై చ‌ర్చ‌కు వ‌చ్చింది. అన‌కాప‌ల్లి నుండి టిడిపి అభ్య‌ర్ధి గా కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు కొణ‌తాల రామ‌కృష్ణ పేరు ప్ర‌తిపాద‌న‌కు వ‌చ్చింది. అన‌కాప‌ల్లి నుండి సిట్టింగ్ ఎంపీగా గ‌త ఎన్నిక‌ల్లో టిడిపి నుండి గెలిచిన అవంతి శ్రీనివా స్ వైసిప తో చేర‌టంతో తిరిగి అదే సామాజిక వ‌ర్గానికి చెందిన రాధా పేరు ప‌రిశీలిస్తున్నారు.

న‌ర్సాపురం పైనా చర్చ‌..

న‌ర్సాపురం పైనా చర్చ‌..

కాపు సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉండే న‌ర‌సాపురం లోక్‌స‌భ సెగ్మెంట్ నుండి రాధా పేరు ప‌రిశీలిస్తున్నారు. గ‌త ఎన్నిక ల్లో ఇక్క‌డి నుండి బిజెపి అభ్య‌ర్ధి గోక‌రాజు గంగ‌రాజు గెలిచారు. అక్క‌డ టిడిపి అభ్య‌ర్ధిగా ప్ర‌చారం జ‌రిగిన ర‌ఘురామ కృష్ణం రాజు వైసిపి లో చేరి ఆ పార్టీ అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దిగుతున్నారు. క్ష‌త్రియ వ‌ర్గానికి చెందిన ర‌ఘు రామ కృష్ణం రాజు పై వంగ‌వీటి రాధాను బ‌రిలోకి దింపాల‌ని టిడిపి అధినాయ‌క‌త్వం యోచిస్తోంది. ఈ రాత్రికి రాధా పోటీ చేసే సీటు పై క్లారిటీ రానుంది. అయితే, కాపు వ‌ర్గంలో వంగ‌వీటి కుటుంబానికి ఉన్న క్రేజ్ ను ఎన్నిక‌ల్లో అనుకూలంగా మ‌ల‌చుకొ ని..జ‌గ‌న్ ను ల‌క్ష్యంగా చేసుకోవ‌టమే టిడిపి వ్యూహంగా క‌నిపిస్తోంది. రాధా కు సైతం జ‌గ‌న్ ఇప్పుడు టార్గెట్ గా మార‌ను న్నారు. దీంతో..ఆయ‌న టిక్కెట్ ఖ‌రారైన త‌రువాత ప్ర‌చారంలో పూర్తిగా జ‌గ‌న్ ను టార్గెట్ చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో న‌ర్సాపురం లేదా అన‌కాప‌ల్లి నుండి పోటీ చేస్తే రాధా అక్క‌డ ప్ర‌భావితం చేయ‌గ‌లరా అనే చ‌ర్చ కూడా మొద‌లైంది.

English summary
Vangaveeti Rahda may contest for Loksabha from TDP. He may contest from Anakapalli or Narasapuram. TDP may finalise his ticket to night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X