హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాహుల్ గాంధీ-చంద్రబాబు కలయిక, కాంగ్రెస్‌కు ఏపీలో భారీ షాక్, వట్టి వసంత్ రాజీనామా

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలయికపై నేతల ఆగ్రహం| Oneindia

విశాఖపట్నం: కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలవడంపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని విపక్షాలు బీజేపీ, టీఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెస్ తదితర పార్టీలు తీవ్రస్తాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో పలువురు నేతలు కూడా జీర్ణించుకోవడం లేదని అంటున్నారు.

నేను సరే.. మోడీ-లక్ష్మీపార్వతిల మాటేమిటి: శివాజీ దిమ్మతిరిగే కౌంటర్, జగన్ మీద దాడిపై ఇలానేను సరే.. మోడీ-లక్ష్మీపార్వతిల మాటేమిటి: శివాజీ దిమ్మతిరిగే కౌంటర్, జగన్ మీద దాడిపై ఇలా

రాహుల్-చంద్రబాబు కలయిక, కాంగ్రెస్‌కు ఏపీలో దెబ్బ

రాహుల్-చంద్రబాబు కలయిక, కాంగ్రెస్‌కు ఏపీలో దెబ్బ

ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కలయిక దెబ్బ ఏపీలో టీడీపీకి గట్టి షాకిచ్చింది. కీలక నేత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.

పదవికి వట్టి వసంత్ రాజీనామా

పదవికి వట్టి వసంత్ రాజీనామా

తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడానికి నిరసనగా వట్టి వసంత్ కుమార్ గురువారం సాయంత్రం రాజీనామా చేశారు. తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ఇచ్చారు. ఆయన ప్రస్తుతం ఏపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 1983 నుంచి తాను కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టీడీపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నానని, అలాంటి తెలుగుదేశంతో కలవడమా అని ఆయన వ్యాఖ్యానించారని తెలుస్తోంది.

అనూహ్య మలుపు

అనూహ్య మలుపు

ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడులు గురువారం భేటీ అయిన విషయం తెలిసిందే. ఇది దేశ రాజకీయాల్లో కీలక మలుపు. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో అనూహ్య మలుపు. ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై పుట్టిన పార్టీ టీడీపీ. అలాంటి రెండు పార్టీలు కలవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

దాదాపు గంటసేపు భేటీ

దాదాపు గంటసేపు భేటీ

రాహుల్, చంద్రబాబులు గంటసేపు భేటీ అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్రం అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించిందని, ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే కలిశామని వారు చెప్పారు. దేశాన్ని ఎలా కాపాడుకోవాలన్న అంశంపైనే చర్చించామన్నారు. దేశాన్ని కాపాడదాం.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దామనే నినాదంతో ఇరు పార్టీలు కలిసి పనిచేస్తాయన్నారు.

English summary
AICC chief Rahul Gandhi and AP CM Nara Chandrababu Naidu meeting affect. AP Congress leader Vatti Vasanth Kumar resign from Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X