హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండోసారి ఎందుకొచ్చానంటే: రాహుల్, రఘువీరా ఘాటు వ్యాఖ్యలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బీజేపీ ప్రభుత్వం దళితులు, మైనార్టీలకు వ్యతిరేకమని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. రోహిత్ వేముల మృతి నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో శనివారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు.

జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సేకు ఆర్ఎస్ఎస్‌తో సంబంధాలున్నాయని రఘువీరా ఆరోపించారు. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ మరణానికి కారకులైన కేంద్రమంత్రులను తొలగించాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హెచ్ సీయూ వీసీ అప్పారావుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

మహాత్ముడిని చంపిన గాడ్సే ఆర్ఎస్ఎస్‌కు చెందిన వాడని, అలాంటి ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీయేనని ఆయన మండిపడ్డారు. గాడ్సే, గాంధీ వారసులకు మధ్య సైద్ధాంతిక యుద్ధం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం దళితులు, మైనార్టీలుక వ్యతిరేకం కాబట్టే వారిపై వివక్ష చూపుతోందన్నారు.

మరోవైపు రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న వెంటనే హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, శనివారం అతని జన్మదినోత్సవం నేపథ్యంలో మరోసారి వర్సిటీకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రెండు వారాల క్రితం పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల హెచ్‌సీయూలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

విద్యార్థులు నిర్వహిస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు రాహుల్ అప్పుడు హైదరాబాద్ వచ్చారు. ఈరోజు రోహిత్ జయంతి. ఈ సందర్భంగా హెచ్‌సీయూ క్యాంపస్‌లో విద్యార్థులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఆ దీక్షలో పాల్గొనేందుకు రాహుల్ రెండోసారి హైదరాబాద్ వచ్చారు.

రాహుల్ రాకపై పలువురు ఆరోపణలు చేస్తున్నప్పటికీ దీక్షలో పాల్గొన్న వర్సిటీ విద్యార్థులకు ఆయన మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో రాహుల్ స్పందిస్తూ 'భవిష్యత్తుపై ఎన్నో ఆశలు, ఆశయాలు పెట్టుకున్న ఓ జీవితం అర్థాంతరంగా ముగిసింది. రోహిత్ స్నేహితులు, ఫ్యామిలీ అభ్యర్థన మేరకు న్యాయం పోరాటం చేసేందుకు ఇక్కడకు వచ్చాను. పక్షపాతం, అన్యాయం నుంచి స్వేచ్ఛ కోరుకుంటున్న ప్రతి భారతీయ విద్యార్థి ఆశయం కోసం కట్టుబడి ఉన్నాం' అని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

మరోవైపు రాహుల్ రాకపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న యూనివర్సిటీ వాతావరణాన్ని రాహుల్ గాంధీ కలుషితం చేసేందుకే ఇక్కడి వచ్చారని కేంద్ర మంత్రి వెంకయ్య మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలు సైతం రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్న రాహుల్ గాంధీ శవ రాజకీయీలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాబందుల తరహాలో రాహుల్ వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆరోపించారు. చెన్నైలో ముగ్గురు మెడికల్ కాలేజీ విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లను పరామర్శించేందుకు రాహుల్ అక్కడికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ వైఖరికి నిరసనగా శనివారం తెలంగాణ వ్యాప్తంగా కాలేజీల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది.

English summary
Stepping up the offensive on Dalit scholar suicide issue, Rahul Gandhi commenced a day-long fast on Saturday along with agitating students of Hyderabad Central University here after participating in a candle light vigil in the wee hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X