వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ పోరుబాట .. అమరావతి రైతులకు మద్దతుగా రంగంలోకి రాహుల్ గాంధీ ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో అధికార పార్టీని టార్గెట్ చేసి బీజేపీ, జనసేన , టీడీపీలు వైసీపీపై మాటల దాడిని కొనసాగిస్తుంటే, కొత్తగా కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. రాజధాని అమరావతి రైతుల కోసం పోరుబాట పట్టాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అమరావతి జేఏసీ నేతలతో మాట్లాడుతున్నారు. ఇక ఏపీలో కాంగ్రెస్ ప్రజా క్షేత్రంలోకి వెళ్ళాలని భావిస్తున్న తరుణంలో అమరావతి ఉద్యమాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలలో తమ వంతు పాత్ర పోషించాలని చూస్తుంది కాంగ్రెస్.

Recommended Video

3 Minutes 10 Headlines | GISAT-1 Launch | North-East Delhi | Oneindia Telugu
 ఏపీలో రాజధాని రైతులకు బాసటగా కాంగ్రెస్

ఏపీలో రాజధాని రైతులకు బాసటగా కాంగ్రెస్

వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలు రాజధానిగా అమరావతికే మద్దతు పలుకుతున్న నేపధ్యంలో జాతీయ స్థాయి నాయకుల్ని పిలిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్‌కు కొత్తగా నియమితులైన కార్యవర్గం కొత్త పీసీసీ చీఫ్ శైలజానాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీ రెడ్డి అమరావతికి మద్దతుగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు . ఇక అమరావతి పోరాటానికి ప్రాధాన్యత రావాలంటే రాహుల్ గాంధీని అమరావతికి తీసుకు రావాలని నిర్ణయం తీసుకున్నారు.

వైసీపీ ఓ రౌడీ పార్టీ ... ఏపీలో జగన్ టార్గెట్ గా రంగంలోకి కాంగ్రెస్వైసీపీ ఓ రౌడీ పార్టీ ... ఏపీలో జగన్ టార్గెట్ గా రంగంలోకి కాంగ్రెస్

రాహుల గాంధీని ఏపీ రాజధానికి తీసుకురావాలని ప్లాన్

రాహుల గాంధీని ఏపీ రాజధానికి తీసుకురావాలని ప్లాన్

ఏపీ కాంగ్రెస్ నేతల ప్రతిపాదనకు రాహుల్ గాంధీ కూడా మద్దతు తెలిపారని సమాచారం . తాను వస్తానని రాహుల్ ఏపీ కాంగ్రెస్ నేతలకు చెప్పినట్టు తెలుస్తుంది . రాహుల్ గాంధీ పర్యటనతో అమరావతి పోరాటం జాతీయ స్థాయికి చేరుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇక ఆయన పర్యటనను వీలైనంత త్వరగా ఫైనల్ చెయ్యాలని భావిస్తున్నారు. అయితే మార్చి ఒకటో తేదీ నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.

ఢిల్లీ వెళ్లి రాహుల్ ను ఆహ్వానించనున్న జేఏసీ నేతలు

ఢిల్లీ వెళ్లి రాహుల్ ను ఆహ్వానించనున్న జేఏసీ నేతలు

ఇక ఈ సమావేశాల నేపధ్యంలో ఆ సమావేశాల మధ్యలో రాహుల్ రావడం కుదరదన్న భావనలో ఏపీ కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. ఆ సమావేశాలు ముగిసిన తర్వాత మొదటి వారంలోనే పర్యటన ఖరారు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇక మరోమారు ఢిల్లీ వెళ్లనున్న జేఏసీ నేతలు రాహుల్ గాంధీని కలిసి ఆయనను అమరావతికి మద్దతు కోరుతూ పర్యటించాలని కోరే అవకాశం ఉంది. ఏది ఏమైనా రాహుల్ గాంధీ అమరావతి రైతుల కోసం వస్తే ఇష్యూ జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావటం ఖాయం . అలా జరిగినా సీఎం జగన్ నిర్ణయంలో మాత్రం ఏ మాత్రం మార్పు ఉండదు అనేది రాజకీయ వర్గాల అభిప్రాయం .

English summary
The Congress party opposes the decision of the three capitals. To this end, the AP newly appointed Working Committee is preparing an action plan in support of capital amaravati. new PCC chief Shailajanath and working president Tulsi Reddy planning to bring Rahul Gandhi .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X