వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌...ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

తిరుపతి:రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. ఈమేరకు ఆయన పర్యటన షెడ్యూల్ కూడా ఖరారైంది. ప్రధానంగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎపికి వస్తున్న కేంద్ర మంత్రి మరి కొన్ని అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు.

రైల్యే మంత్రి పీయూష్ గోయల్ ఎపి పర్యటర షెడ్యూల్ వివరాలు ఇవి...ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్న ఆయన గురువారం ఉదయం 11.30 గంటలకు చెన్నై చేరుకుంటారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం రాత్రి 7.30 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 8.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి వస్తారు.

Railway Minister Piyush Goyal Andhra Pradesh tour schedule finalized

రోడ్డు మార్గంలో రాత్రి 9.30 గంటలకు తిరుమలకు చేరుకుని బస చేస్తారు. 15వ తేదీ ఉదయం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శనం చేసుకోనున్నారు. అక్కడి నుంచి బయలు దేరి ఉదయం 8.30 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. రైల్వేస్టేషన్‌ తనిఖీ అనంతరం వీఐపీ లాంజ్‌లో ఉదయం 9.45 గంటల వరకు తిరుపతి స్మార్ట్‌ రైల్వేస్టేషన్‌, తిరుచానూరు రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులతో పాటు, గుంతకల్‌ రైల్వే డివిజన్‌ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరపనున్నారు. ఈ క్రమంలో ఆయన తిరుపతి రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేసే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు.

English summary
Tirupati: Railway Minister Piyush Goyal will be visiting Andhra Pradesh for his two-day tour. His tour schedule was also finalized.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X