వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే ఉద్యోగులకు బంపర్ ఆఫర్- ఇంటికే మందులు...వాట్సాప్ నంబర్లివే..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ప్రభావంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఇళ్లకే పరిమితమవుతున్నారు. వీరిలో చాలా మందికి అత్యవసర మందులు కూడా అందలేని పరిస్ధితి. రోడ్లపైకి వచ్చేందుకు వీలు లేకపోవడం, ఎక్కడో దూరంగా ఉన్న మందుల షాపులకు వెళ్లి వాటిని కొనుక్కునే అవకాశం లేకపోవడంతో దక్షిణమధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు తనవంతు సహకరిస్తున్న రైల్వే ఇవాళ్టి నుంచి మందుల డోర్‌ డెలివరీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ డివిజన్‌ పరిధిలోని 15 వేల మంది రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లకు ఇంటింటికీ మందులు సరఫరా చేయాలని నిర్ణయించింది. వారంలో ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో మందులను డోర్‌ డెలివరీ చేయాలని అధికారులు నిర్ణయించారు.

దీనికోసం మొత్తం ఆరు వాట్సాప్‌ నంబర్లను ఏర్పాటు చేశారు. సోమ, బుధ, శుక్రవారాల్లో 75693 05668, 76759 28721, 75693 05636 వాట్సాప్‌ నంబర్లకు, మంగళ, గురు, శనివారాల్లో 76739 27677, 75693 05620, 70138 26171 వాట్సాప్‌ నంబర్లకు సమాచారం ఇవ్వటం ద్వారా రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లు మందులను ఇంటికి ఆర్డర్‌ చేయవచ్చు. మందుకు కావాల్సిన ఉద్యోగులు, పెన్షనర్లు సంబంధిత వాట్సాప్ నంబర్‌ కు వారి మెడికల్ ఐడీ కార్డు, చివరిసారిగా తీసుకున్న డాక్టర్ ప్రిస్క్రిప్షన్, మొబైల్ నంబర్, ప్రస్తుత చిరునామాలను పంపాల్సి ఉంటుంది.

railway to deliver medicines at employees doorstep in wake of covid 19

వీటిని రైల్వే వైద్య విభాగం పరిశీలించి మందులు పంపనుంది. ప్రధానంగా డయాబెటీస్, హైపర్ టెన్షన్, గుండె జబ్బుల రోగులకు మందులను పంపుతారు.. వీటితో పాటు టెలీ మెడిసిన్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చారు. రైల్వే ఆస్పత్రి హెల్ప్ డెస్క్ కు ఫోన్ చేయడం ద్వారా టెలిఫోన్ లోనే సలహాలు పొందవచ్చని విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు.

Recommended Video

COVID-19 : Watch Train Coaches Converted Into Isolation Wards For Patients

English summary
in wake of covid 19 outbreak south central railway's vijayawada division has decided to send medicines to 15 thousand employees and pensioners door step through whatsapp order soon. for that officials released whatsapp numbers also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X