హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ ,తెలంగాణా రాష్ట్రాలకు వాన గండం ..తెలంగాణలో 27 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షం ..పరిస్థితి ఇలా

|
Google Oneindia TeluguNews

ఏపీ, తెలంగాణా రాష్ట్రాలను వానలు ముంచేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. వర్షం దెబ్బకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో గత ఇదు రోజులుగా కుండపోతగా వాన కురుస్తుంది . ఈ అతి భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయంగా మారాయి. చెరువులను తలపిస్తున్నాయి. వాగులు , వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు మత్తడి పడుతున్నాయి.లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు .. వాతావరణ శాఖ వెల్లడి

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు .. వాతావరణ శాఖ వెల్లడి

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి శనివారం నాటికి మరింత బలపడి మరో రెండు రోజుల పాటు కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. మరికొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్ల వర్షం

తెలంగాణా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్ల వర్షం

గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. దీంతో ఏపీలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పని మొదలు పెట్టారు .విస్తారంగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అతలాకుతలమవుతోంది . నేడు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ, వైజాగ్ తుఫాను కేంద్రం పేర్కొంది.


తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం లో రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Recommended Video

AP Cabinet Meeting on 19th August తెలంగాణతో వివాదాలు, హైకోర్టు స్టేటస్ కో పై చర్చ ! || Oneindia

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం .. హైదరాబాద్ లోనూ వర్షాలు


అత్యధికంగా కరీంనగర్ జిల్లా మానకొండూరులో27.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ రూరల్ జిల్లా లో 22 నుంచి 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తోంది. వరంగల్ అర్బన్ మరియు ములుగు జిల్లాలలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా సిద్దిపేట జిల్లాలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు హైదరాబాద్లోనూ వర్షం పడుతూనే ఉంది. హైదరాబాద్ లోని చార్మినార్ ,హయత్నగర్, బహదూర్ పురా,రాజేంద్రనగర్, నాంపల్లి, ఆసిఫ్ నగర్ ఏరియాలలో రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

నీట మునిగిన లక్నవరం బ్రిడ్జి .. చెరువులు , జలపాతాలు నిండు కుండల్లా !!


విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో తెలంగాణ రాష్ట్రంలోని ములుగు, ఏటూరు నాగారం ,మహబూబాబాద్ ప్రాంతాల్లో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లక్నవరం చెరువులో పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకొని లక్నవరం బ్రిడ్జి నీటమునిగింది. భద్రకాళి చెరువు నిండు కుండలా తలపిస్తోంది. బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చింది. రామప్ప, పాకాల చెరువులు జలకళతో ఉట్టి పడుతున్నాయి. మరోవైపు భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం బాగా పెరుగుతుంది. మరో రెండు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని ,భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ చెప్పడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

English summary
The Telugu states are being overwhelmed by the heavy rains. Public life became chaotic due to the rain blow. It has already been raining heavily in Telangana for the past few days. All major roads became waterlogged due to this heavy rain. Telangana recorded the heaviest rainfall of 27 cm, the Met office said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X